జనాభాను మించనున్న సెల్‌ఫోన్ కనెక్షన్లు!

Posted By: Staff

జనాభాను మించనున్న సెల్‌ఫోన్ కనెక్షన్లు!

 

సెల్‌ఫోన్ ఆకౌంట్‌ల సంఖ్య 2014 కల్లా ప్రపంచ జనాభాను మించిపోనుంది. ఇప్పటికే 100 పైగా దేశాల్లో జనాభా కన్నా సెల్‌ఫోన్ అకౌంట్లే అధికంగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రూపొందించిన ‘ఇన్ఫర్మేషన్ సొసైటీ 2012’  నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ప్రస్తుతం 6 బిలియన్ల (వందల కోట్లు) సెల్‌ఫోన్ కనెక్షన్లు ఉండగా 2014కి ఇవి 730 కోట్లకు చేరతాయి. అప్పటికి ప్రపంచ జనాభా 700 కోట్లే ఉంటుంది. ఇప్పటికే రష్యాలో జనాభాకు 1.8 రెట్లు అధికంగా 25 కోట్ల మేర సెల్‌ఫోన్ అకౌంట్లు ఉన్నాయి. అటు బ్రెజిల్‌లో 1.2 రెట్లు అధికంగా 24 కోట్ల కనెక్షన్లు ఉన్నాయి. ఐటీయూ నివేదిక ప్రకారం స్మార్ట్ ఫోన్లకు చైనా ప్రధాన మార్కెట్‌గాను, ప్రపంచంలో పావు భాగం ఇంటర్నెట్ యూజర్లకు కేంద్రంగాను నిలుస్తోంది.

టాప్-10 అద్భతాలు….(ఫోటో ఫీచర్)

మీరు వాడుతున్న సెల్‌ఫోన్ నకిలీదా..? తస్మాత్!!

ఆధునిక జనజీవన స్రవంతిలో సెల్‌ఫోన్ లేకుండా ఒక్క నిమిషం కూడా గడపలేని పరిస్థితి. మనవాళి అభిరుచులకు తగట్లుగానే రకరకాల సెల్‌ఫోన్‌లు మార్కెట్లో విడుదలవుతున్నాయి. అయితే వీటిని తలదన్నే రీతిలో డమ్మీ మోడల్ మొబైల్ హ్యాండ్ సెట్‌లు మార్కెట్లో ప్రత్యక్షమవుతున్నాయి. వీటిని విక్రయిదారులు తమ మాయమాటలతో చాలామందికి అంటగడుతున్నారు. మొబైల్ ఫోన్‌ల వ్యాపారంలో భాగంగా హైదరాబాద్ లోని అబిడ్స్ జగదీష్ మార్కెట్ మినీసెల్ వరల్డ్‌గా ప్రసిద్దికెక్కింది.

ఈ మార్కెట్లో దొరకని ఫోన్ అంటూ ఉండదు. అన్నిరకాల సెల్‌ఫోన్‌లకు సంబంధించి సేల్స్ ఇంకా సర్వీసింగ్ ఇక్కడ జరుగుతుంది. చైనా ఫోన్లు మొదలుకుని ప్రముఖ కంపెనీలు బ్రాండెడ్ ఫోన్‌ల వరకు సకలం లభ్యమవుతాయి. దాదాపు ఈ మార్కెట్లో 200కు పైగా గ్యాడ్జెట్‌లను విక్రయించే దుకాణాలు ఉన్నాయి. నకిలీ సెల్‌ఫోన్‌లకు ఈ మార్కెట్ అడ్డా. వినియోగదారులకు టోకరా వేస్తూ బ్రాండెడ్ కాని సెల్‌ఫోన్‌లను ఇక్కడ విక్రయిస్తుంటారు. ఈ మార్కెట్లో సెల్‌ఫోన్‌లను కొనుగోలు చేసే వారు ఆచితూచి స్పందించటం అవసరం. ఏమాత్రం ఆశ్రద్ద వహించినా పెద్ద ఎత్తున టోకరా తప్పదు.

అభిమాని అంటే వీడేరా…! (ఫోటో గ్యాలరీ)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot