Home
News

భారత మార్కెట్లోకి రెడ్‌మి k20 సిరీస్

ప్రముఖ చైనా కంపెనీ షియోమి ఈ రోజు ఇండియాలో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేయబోతోంది. ఈ రోజు అనగా జూలై 17 బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం ద్వారా రెడ్‌మి K20 మరియు రెడ్‌మి K20 ప్రో రెండు మొబైల్ ఫోన్లను ఆవిష్కరించబోతోంది. ఈ కొత్త రెడ్‌మి స్మార్ట్‌ఫోన్‌లను చైనాలో మే నెలలో విడుదల చేశారు.

xiaomi redmi k20 redmi k20 pro india launch today

ఇండియాలో ఈ రెండు స్మార్ట్‌ఫోన్‌లు సరసమైన ఫ్లాగ్‌షిప్‌ల ద్వారా అందుబాటులోకి వస్తాయి అని అందరు భావిస్తున్నారు. కాబట్టి ఈ కొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఆకర్షణీయమైన ధర వద్ద అద్భుతమైన హార్డ్‌వేర్‌ను ఆశించవచ్చు. భారతదేశంలో రెడ్‌మి K20 మరియు రెడ్‌మి K20 ప్రో మొబైల్ ఫోన్ ధరలను ఈ రోజు జరిగే ఈవెంట్ లాంచ్ కార్యక్రమంలో వెల్లడవుతాయని భావిస్తున్నారు.

xiaomi redmi k20 redmi k20 pro india launch today

ఇది పూర్తిగా కొత్త రెడ్‌మి ఫోన్‌ల శ్రేణి మరియు బడ్జెట్ ఫోన్‌లలో ఒకటిగా రెడ్‌మి బ్రాండ్ యొక్క ఇమేజ్‌ను పెంచడానికి షియోమి చేసిన ప్రయత్నం.

షియోమి రెడ్‌మి K20 సిరీస్ ఇండియా లైవ్ స్ట్రీమ్ వివరాలు:

షియోమి రెడ్‌మి K20 సిరీస్ ఇండియా లైవ్ స్ట్రీమ్ వివరాలు:

షియోమి సంస్థ ఈ రోజు మధ్యాహ్నం 12:00 గంటలకు రెడ్‌మి K20 మరియు దాని యొక్క K20 ప్రో వెర్షన్‌ను న్యూ ఢిల్లీలో జరిగే కార్యక్రమం ద్వారా విడుదల చేయనుంది. ఈ కార్యక్రమం కంపెనీ యొక్క Mi.com వెబ్‌సైట్, యూట్యూబ్ ఛానెల్ మరియు షియోమి యొక్క సోషల్ మీడియా ఛానెల్‌లలో ఈవెంట్‌ను ప్రత్యక్షంగా ప్రసారం చేస్తోంది.

షియోమి రెడ్‌మిK20  స్పెసిఫికేషన్స్:

షియోమి రెడ్‌మిK20 స్పెసిఫికేషన్స్:

రెడ్‌మి K20 స్మార్ట్‌ఫోన్‌ 6.39-అంగుళాల ఫుల్-HD + AMOLED డిస్‌ తో వస్తుంది. ఈ డిస్ప్లే 19.39: 9 కారక నిష్పత్తి మరియు 91.9 శాతం స్క్రీన్-టు-బాడీ రేషియోతో ఉంటుంది . రెడ్‌మి K20 స్మార్ట్‌ఫోన్‌ 3GB-8GB RAM మరియు 64GB-256GB వరకు ఇంటర్నల్ మెమరీ గల వివిధ వేరియంట్లతో వస్తాయి.ఇది స్నాప్‌డ్రాగన్ 730 SoCతో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పాప్-అప్ సెల్ఫీ కెమెరా మరియు ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉన్నాయి.

షియోమి రెడ్‌మిK20 ప్రో స్పెసిఫికేషన్స్:

షియోమి రెడ్‌మిK20 ప్రో స్పెసిఫికేషన్స్:

రెడ్‌మిK20 ప్రోలో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 855 SoC మరియు అడ్రినో 640 GPUలు ఉన్నాయి. రెడ్‌మిK20 ప్రో 8GB వరకు RAM మరియు 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్లతో అందుబాటులోకి రానుంది. ఇందులో ప్రత్యేక ఆకర్షణగా 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 13 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, మరియు 2x జూమ్తో 8 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ ఉంది. అంతే కాకుండా ముందువైపు సెల్ఫీస్ కోసం 20 మెగాపిక్సెల్ పాప్-అప్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది. రెడ్‌మి K20 ప్రో ముందు మరియు వెనుక భాగంలో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో వస్తుంది . ఇది 4,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి ఉంటుంది మరియు బాక్స్‌లో 18W ఫాస్ట్ ఛార్జర్‌ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ 6.39-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది మరియు దీనికి తోడు డిస్ప్లే లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది HDR కి మద్దతు ఇస్తుంది కాబట్టి మీరు యూట్యూబ్, నెట్‌ఫ్లిక్స్ మరియు గేమింగ్‌లో కూడా HDR కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. ఇది ఎల్లప్పుడూ ఆన్-డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా MIUI 10 తో రన్ అవుతుంది మరియు ఇది సిస్టమ్-వైడ్ డార్క్ మోడ్‌కు మద్దతు ఇస్తుంది. రెడ్‌మిK20 ప్రో 191 గ్రాముల బరువుతో పాటు యుఎస్‌బి టైప్-సి పోర్ట్ కలిగి ఉంది.

 ధరల వివరాలు:

ధరల వివరాలు:

భారతదేశంలో షియోమి రెడ్‌మి k20 మొబైల్ రూ .21,999 వద్ద మరియు రెడ్‌మి k20 ప్రో మొబైల్ రూ.27,999 నుంచి లభిస్తాయి. రెడ్‌మిk20 6 GB ర్యామ్ మరియు 64 GB లేదా 128 GB స్టోరేజ్‌తో లభిస్తుంది. 64 GB స్టోరేజ్ ఉన్న వేరియంట్ ధర రూ .21,999 కాగా, 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ .23,999. అలాగే రెడ్‌మిk20 ప్రో మొబైల్ కూడా రెండు స్టోరేజ్ ఆప్షన్లలో వస్తుంది అవి 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ మరియు 8 GB ర్యామ్ + 256 GB స్టోరేజ్. రెడ్‌మిk20 ప్రో యొక్క 6 GB ర్యామ్ + 128 GB స్టోరేజ్ వేరియంట్ ధర 27,999 రూపాయలు.

8 GB ర్యామ్+ 256 GB స్టోరేజ్ ఉన్న రెడ్‌మిk20 ప్రో యొక్క వేరియంట్ ధర రూ.30,999 కు లభిస్తుంది. ఆల్ఫా సేల్ ద్వారా మొబైల్ లను ప్రీ బుక్ చేసిన వారు ఈ రోజు లావాదేవీని 8PM లోపు పూర్తి చేయవచ్చు. ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ మరియు డెబిట్ కార్డు నుంచి మొబైల్ బుక్ చేసిన వారికి రూ .2,000 క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఇతర Mi అభిమానులు రేపటి నుంచి Mi హోమ్ స్టోర్స్ నుండి స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. రెండు ఫోన్లు జూలై 22 నుండి మధ్యాహ్నం 12:00 గంటలకు ఫ్లిప్‌కార్ట్, Mi.com మరియు Mi స్టోర్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు 27W సోనిక్చార్జ్ అడాప్టర్ 999 రూపాయల ధర వద్ద లభిస్తుంది.

 

More from GizBot

Best Mobiles in India

English summary
xiaomi redmi k20 redmi k20 pro india launch today
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X