Xiaomi Mi 10i 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయింది!! ధరలు, ఫీచర్స్ ఇవే...
చైనా యొక్క స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి ఎట్టకేలకు Mi 10 సిరీస్‌లో భాగమైన Mi10iని భారతదేశంలో ఆన్‌లైన్ ఈవెంట్ ద్వారా విడుదల చేసింది. షియోమి సంస్థ కొంతకాలంగా టీజ్ చేస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్ రెడ్‌మి నోట్ 9 ప్రో 5G యొక్క రీబ్రాండెడ్ వెర్షన్ గా 2021లో ఇండియాలో మొదటి లాంచ్ కావడం విషేషం. షియోమి యొక్క ఈ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి Mi 10i 5G స్మార్ట్‌ఫోన్ ధరలు & సేల్స్ వివరాలు
షియోమి సంస్థ ఇండియాలో Mi 10i స్మార్ట్‌ఫోన్ ని మూడు వేరు వేరు ర్యామ్ / స్టోరేజ్ వేరియంట్లలో విడుదల చేసింది. ఇందులో 6GB ర్యామ్+ 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999. అలాగే 6GB ర్యామ్, 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 21,999 కాగా చివరిది 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ.23,999. ఈ స్మార్ట్‌ఫోన్ ను జనవరి 8 నుండి అమెజాన్ ఇండియా మరియు Mi.కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ సభ్యులు జనవరి 7నుంచే కొనుగోలు చేయవచ్చు. ఆఫర్ల విషయానికొస్తే ఐసిఐసిఐ బ్యాంక్ కార్డుల వినియోగదారులకు కొనుగోలు మీద రూ.2,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ లభించడంతో పాటుగా ఇఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. వీటితో పాటుగా రూ.10,000 విలువైన రిలయన్స్ జియో ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

షియోమి Mi 10i 5G 120HZ డిస్‌ప్లే స్పెసిఫికేషన్స్
షియోమి Mi 10i యొక్క స్పెసిఫికేషన్స్ వివరాల విషయానికి వస్తే ఫోన్ వెనుక భాగంలో 108 మెగాపిక్సెల్ ఫీచర్లతో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ తో పాటుగా 5G సపోర్ట్, 120HZ డిస్‌ప్లే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌లో వెనుక భాగంలో వృత్తాకార మాడ్యూల్‌లో క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటుంది. ఇందులో మెయిన్ కెమెరా 108-మెగాపిక్సెల్ వద్ద మరియు సెకండరీ కెమెరా అల్ట్రా-వైడ్ లెన్స్ తో 13-మెగాపిక్సెల్ వద్ద మరియు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో పాటు 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్ కెమెరాలను కలిగి ఉంటుంది. అలాగే సెల్ఫీలు మరియు వీడియో కాలింగ్ కోసం ఫోన్ ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కాన్ఫిగర్ చేయబడి ఉంటుంది.

షియోమి Mi 10i 5G 33W ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్స్
షియోమి Mi 10i కొత్త ఫోన్ 6.67-అంగుళాల ఫుల్ HD + అడాప్టివ్‌సింక్ డిస్ప్లేను మధ్యలో పంచ్-హోల్ మరియు 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. వినియోగ కేసును బట్టి వేరియబుల్ రిఫ్రెష్ రేట్ (30Hz నుండి 120Hz) కు మద్దతు ఉంది. ఈ పరికరం కొత్త క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 750G ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ మద్దతుతో 4,820mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది. అలాగే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 12 తో రన్ అవుతుంది.


Click it and Unblock the Notifications








