Xiaomi Mi QLED TV 4K 55-ఇంచ్ స్మార్ట్‌టీవీ ఫీచర్స్ మీద ఓ లుక్ వేయండి...

|

ఇండియాలో స్మార్ట్‌ఫోన్‌లతో పాటుగా స్మార్ట్‌టీవీలను అత్యధికంగా అమ్ముడుచేస్తున్న చైనా సంస్థ షియోమి బ్రాండ్ ఇప్పుడు దేశంలో చాలా రోజుల నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Mi QLED టివి 4Kను విడుదల చేసింది. భారత ప్రభుత్వం 'మేక్ ఇన్ ఇండియా' చొరవలో భాగంగా కొత్త టీవీని ప్రారంభించింది. 55-అంగుళాల స్క్రీన్‌తో మరియు హెచ్‌డిఆర్ కోడెక్‌ల మద్దతుతో పాటు ఈ స్మార్ట్ టీవీ ప్రీమియం మెటాలిక్ బెజెల్ డిజైన్‌తో వస్తుంది. ఈ Mi క్యూఎల్‌ఇడి టివి 4K మార్కెట్‌లోని ఇతర స్మార్ట్ టివిలతో పోలిస్తే 230% స్పీకర్లను కలిగి ఉంది. వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

షియోమి Mi QLED TV 4K స్మార్ట్‌టీవీ స్పెసిఫికేషన్స్

షియోమి Mi QLED TV 4K స్మార్ట్‌టీవీ స్పెసిఫికేషన్స్

షియోమి Mi క్యూఎల్‌ఇడి 4K టీవీ 55-అంగుళాల UHD డిస్ప్లే 3840 x 2160 పిక్సెల్స్ పరిమాణంలో వస్తుంది. అలాగే ఇది 96% స్క్రీన్-టు-బాడీ నిష్పత్తితో సన్నని బెజెల్స్‌ నిర్మాణంను కలిగి ఉంటుంది. కావున ఇందులో వినియోగదారులకు ఏదైనా కంటెంట్‌ను చూడటం అద్భుతమైన అనుభవంగా ఉంటుంది. Mi QLED TV 4K వీక్షణ అనుభవం కోసం పిక్చర్ నాణ్యతను పెంచడానికి షియోమి యొక్క Vivid పిక్చర్ ఇంజిన్‌ను ఉపయోగిస్తుంది. డాల్బీ విజన్, HDR10+, HDR10 మరియు HLGల అన్ని ప్రముఖ హెచ్‌డిఆర్ కోడెక్‌ల మద్దతుతో వస్తుంది.

Also Read: Infinix X1 సిరీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి!! బడ్జెట్ ధరలోనేAlso Read: Infinix X1 సిరీస్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌టీవీలు లాంచ్ అయ్యాయి!! బడ్జెట్ ధరలోనే

షియోమి Mi QLED 4K టివి ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్
 

షియోమి Mi QLED 4K టివి ఆండ్రాయిడ్ 10 ఫీచర్స్

సౌండ్ విభాగంలో Mi QLED టివి 4K 6 శక్తివంతమైన 30W స్పీకర్లను కలిగి ఉంటుంది. ఇది 60Hz - 20 KHz యొక్క బెస్ట్-ఇన్-క్లాస్ ఫ్రీక్వెన్సీ పరిధికి మద్దతు ఇస్తుంది. అలాగే అద్భుతమైన మరియు లీనమయ్యే సౌండ్ అనుభవం కోసం డాల్బీ ఆడియో మరియు డిటిఎస్ హెచ్‌డిల మద్దతును కూడా కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ10 బాక్స్ ప్లాట్‌ఫామ్‌లో రన్ అవుతుంది. అలాగే టీవీ వెనుక భాగంలో మూడు HDMI పోర్ట్‌లు, రెండు USB పోర్ట్‌లు, ఒక ఆప్టికల్ పోర్ట్ మరియు ఒక 3.5mm ఆడియో జాక్ వంటివి ఉన్నాయి. ఇవే కాకుండా సరైన రియల్ టైం గేమింగ్ అనుభవాన్ని అందించడానికి ఈ స్మార్ట్ టీవీ ఆటో లో-లేటెన్సీ మోడ్ (ALLM) మద్దతుతో వస్తుంది.

షియోమి Mi QLED 4K టివి మీడియాటెక్ క్వాడ్-కోర్ A55 చిప్‌సెట్‌ ఫీచర్స్

షియోమి Mi QLED 4K టివి మీడియాటెక్ క్వాడ్-కోర్ A55 చిప్‌సెట్‌ ఫీచర్స్

Mi QLED 4K కొత్త స్మార్ట్ టీవీ సరికొత్త మీడియాటెక్ క్వాడ్-కోర్ A55 చిప్‌సెట్‌తో పాటు మాలి G52 MP2 తో లభిస్తుంది. ఇది మునుపటి తరం మాలి 450 కన్నా 6.8 రెట్లు వేగంగా పనిచేస్తుంది. అలాగే ఇది బ్లూటూత్ 5.0 మరియు డ్యూయల్-బ్యాండ్ వై-ఫై వంటి కనెక్టివిటీల మద్దతును కలిగి ఉండి 2GB ర్యామ్, 32GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. ఈ టీవీ యొక్క రిమోట్ యొక్క బటన్లు క్లాస్సి లుక్ ని కలిగి ఉంటుంది. ఇందులో నెట్‌ఫ్లిక్స్ మరియు అమెజాన్ ప్రైమ్ వీడియోల కోసం అంకితమైన బటన్లు కూడా ఉన్నాయి.

షియోమి Mi QLED 4K టివి ధరల వివరాలు

షియోమి Mi QLED 4K టివి ధరల వివరాలు

షియోమి సంస్థ కొత్తగా విడుదల చేసిన Mi QLED 4K టివి యొక్క ధర రూ.54,999. డిసెంబర్ 21, 2020 మధ్యాహ్నం 12 గంటల నుండి Mi హోమ్, ఫ్లిప్‌కార్ట్ లతో పాటుగా దేశవ్యాప్తంగా గల షియోమి యొక్క అన్ని ఆఫ్‌లైన్ రిటైల్ దుకాణాల ద్వారా వీటిని కొనుగోలు చేయడానికి అందుబాటులోకి తీసుకురానున్నది.

Best Mobiles in India

English summary
Xiaomi Mi QLED 4K 55-inch TV Released in India: Price, Specifications, Features, Sale Date and More

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X