Home
News

అతి తక్కువ ధరకు యు బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్

ACT ఫైబర్నెట్ మాదిరిగానే యు బ్రాడ్‌బ్యాండ్ కూడా దేశంలోని ప్రముఖ ఫైబర్-టు-హోమ్ బ్రాడ్‌బ్యాండ్ సర్వీసు ప్రొవైడర్లలో ఒకటి. తెలియనివారి కోసం యు బ్రాడ్‌బ్యాండ్ వోడాఫోన్ యొక్క యాజమాన్యంలో ఉంది.అంతే కాకుండా ఇది హైదరాబాద్, ముంబై, పూణే, విశాఖపట్నం మరియు భారతదేశంలోని 22 ప్రధాన నగరాల్లో వీటి యొక్క కార్యకలాపాలను నిర్వహిస్తున్నది.

you broadband 100mbps unlimited

ఇప్పుడు బ్రాడ్‌బ్యాండ్ రంగంలోకి రిలయన్స్ జియో గిగాఫైబర్ కూడా రావడంతో దాని యొక్క ప్రయోగ ఒత్తిడితో వోడాఫోన్ యాజమాన్యంలోని యు బ్రాడ్‌బ్యాండ్ తన కార్యకలాపాలు నిర్వహిస్తున్న మొత్తం 22 నగరాల్లో ఆకర్షణీయమైన బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలను అందించడం ప్రారంభించింది. దీని యొక్క తాజా చర్యలో భాగంగా హైదరాబాద్ మరియు ఇతర నగరాల్లో యు బ్రాడ్బ్యాండ్ యొక్క 100 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ఇప్పుడు నెలకు 1,000 రూపాయల కన్నా తక్కువకు లభిస్తుంది (పన్నులతో సహా రూ.944).

you broadband 100mbps unlimited

ఇందులో ఉత్తమమైన భాగం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ అపరిమిత FUP తో రావడం. కొన్ని నగరాల్లో ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) 60 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను అపరిమిత FUP తో నెలకు 1,999 రూపాయలకు అందిస్తోంది.

యు బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్రణాళిక వివరాలు:

యు బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్రణాళిక వివరాలు:

హైదరాబాద్ ప్రాంతంలో అందుబాటులో ఉన్న యు బ్రాడ్‌బ్యాండ్ యొక్క హై-స్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలలో ఒకటైన 100 ఎంబిపిఎస్ ప్లాన్ ను వినియోగదారులకు కంపెనీ 4 ఆప్షన్లలో అందిస్తోంది. ఇందులో మొదటిది 100 ఎమ్‌బిపిఎస్ వేగంతో 30 రోజుల వాలిడిటీ సమయం కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 944రూపాయలకు లభిస్తుంది. యు బ్రాడ్‌బ్యాండ్ అందిస్తున్న ఈ ప్లాన్ అపరిమిత డేటాను అందిస్తుంది కాబట్టి వినియోగదారులు తమ డేటా ఎఫ్‌యుపి పరిమితిని పూర్తి చేయడం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

 

90,180,360 రోజుల  ప్రణాళిక వివరాలు:

90,180,360 రోజుల ప్రణాళిక వివరాలు:

యు బ్రాడ్‌బ్యాండ్ 100 Mbps ప్లాన్ తన చందాదారులకు 90 రోజులు, 180 రోజులు మరియు 360 రోజుల ఎంపికలను కూడా అందిస్తోంది. అపరిమిత డేటాతో కూడిన 100 ఎమ్‌బిపిఎస్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ చందాదారులకు 90 రోజుల వాలిడిటీతో కేవలం 2,744రూపాయలకు లభిస్తుంది. మరొక బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ 180 రోజుల వాలిడిటీ మొత్తం కాలానికిగాను చందాదారులు 5,133రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుంది. చివరగా 360 రోజుల చెల్లుబాటు యొక్క ప్లాన్ మొత్తం సంవత్సర కాలానికి కేవలం 9,558రూపాయలకు అందిస్తుంది.

యు బ్రాడ్‌బ్యాండ్ 150 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :

యు బ్రాడ్‌బ్యాండ్ 150 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :

యు బ్రాడ్‌బ్యాండ్ హై స్పీడ్ ప్లాన్‌లను కూడా అందిస్తోంది. వాటిలో 150 ఎమ్‌బిపిఎస్ మరియు 200 ఎమ్‌బిపిఎస్ స్పీడ్‌ను కూడా అందిస్తుంది. 150 ఎమ్‌బిపిఎస్ ప్లాన్ 30-రోజుల, 90-రోజుల, 180-రోజుల మరియు 360-రోజుల ఎంపికలో వరుసగా 1000 జీబీ, 3,300 జీబీ, 7,200 జీబీ మరియు 15,600 జీబీల డేటాను అందిస్తుంది. ఈ ప్లాన్ లో డేటా ముగిసిన తరువాత 5 Mbps FUP వేగాన్ని అందిస్తుంది. పైన పేర్కొన్న చెల్లుబాటు కాలానికి చందాదారులు 30 రోజులకు 1,403 రూపాయలు, 90 రోజులకు 4,209 రూపాయలు, 180 రోజులకు 8,418 రూపాయలు మరియు 360 రోజులకు 12,036 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది.

యు బ్రాడ్‌బ్యాండ్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :

యు బ్రాడ్‌బ్యాండ్ 200 Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ :

యు బ్రాడ్‌బ్యాండ్ అందించే అత్యధిక బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్ 200 Mbps. ఈ ప్లాన్ నాలుగు ఎంపికల ద్వారా లభిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ధర వరుసగా 1,673 రూపాయలు, 5,019 రూపాయలు,10,038 రూపాయలు మరియు 13,452 రూపాయలు. ఈ ప్రణాళికలో కూడా FUP స్పీడ్ తరువాత పైన పేర్కొన్న 150 Mbps ప్లాన్‌కు సమానమైన 5 Mbps స్పీడ్ తో వస్తుంది. యు బ్రాడ్‌బ్యాండ్ పోర్ట్‌ఫోలియోలో హైదరాబాద్‌లోని వినియోగదారులకు 15 ఎమ్‌బిపిఎస్, 30 ఎమ్‌బిపిఎస్, 50 ఎమ్‌బిపిఎస్, 75 ఎమ్‌బిపిఎస్ మరియు 100 ఎమ్‌బిపిఎస్ వంటి ఇతర అపరిమిత డేటా ప్లాన్‌లను కూడా చందాదారులకు అందిస్తోంది.

More from GizBot

Best Mobiles in India

English summary
you broadband 100mbps unlimited
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X