అరుణగ్రహంపై పంటలే పంటలు

Written By:

అరుణ గ్రహాన్ని నివాసయోగ్యంగా మార్చేందుకు చేస్తున్న ప్రయోగాల్లో భాగంగా అక్కడి వాతావరణానికి అనుగుణంగా పంటలు పండించేందుకూ పరిశోధనలు జరుగుతున్నాయి. వాషింగ్టన్ స్టేట్ వర్సిటీ భౌతిక శాస్త్రవేత్త మైకెల్ అలెన్, వర్సిటీ ఆఫ్ ఇదాహో ఫుడ్ సైంటిస్టు హెలెన్ జాయినర్ కలసి ప్రయోగాలు చేస్తున్నారు. దీనిపై ఆసక్తి ఉన్న కొందరు విద్యార్థులను కలుపుకుపోతున్నారు.

Read more: ది మార్షియన్‌లో ఉన్నవి నిజంగా నాసా చిత్రాలేనా..

మీరు అంగారకుడిపైకి వెళ్తే.. తినేందుకు ఏం కావాలి.. ఏమేం పండించుకోవాలనే దానిపై ఆలోచించండ'ని వారిని కోరారు. అక్కడి వాతావరణంలో కార్బన్(జీవం పెరిగేందుకు ఆధారం), నైట్రోజన్(చెట్లు ప్రొటీన్ తయారు చేసుకునేందుకు అవసరం) ఉన్నట్లు తాజా పరిశోధనలు చెబుతున్నాయి. నీటి జాడలున్నట్లు అర్థమవుతోంది. ఇంకేం వీటి ఆధారంగా అక్కడ వ్యోమగాములు.. వారికి వారే పంటలు పండించుకునే ప్రయత్నం చేయాలి' అని అలెన్ చెప్పారు. ఈ సంధర్భంగా విశ్వ రహస్యాలను తెలిపే నాసా అప్లికేషన్లను ఓ సారి చూద్దాం.

Read more: గృహ నిర్భంధంలో నాసా శాస్ర్తవేత్తలు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

నాసా సైన్స్ (NASA Science)

ఈ అప్లికేషన్ ఆపిల్ ఐప్యాడ్‌లకు మాత్రమే సహకరిస్తుంది. భూమి, సూర్యుడు, సోలార్ వ్యవస్థ తదితర విభాగాలకు సంబంధించిన సమాచారాన్ని విశ్లేషణతో తెలుసుకోవచ్చు. అంతేకాదండోయ్.. నాసా తాజా పరిశోధనల వివరాలు, వారు ఉపయోగించే పరికరాలు ఇలా అనేకమైన ఆసక్తికర అంశాలను తెలుసుకోవచ్చు.

నాసా అప్లికేషన్ (NASA App):

ఆండ్రాయిడ్ ఇంకా ఆపిల్ యూజర్లు ఈ అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. నాసా అధికారిక అప్లికేషన్‌గా పేర్కొనబడే ఈ అప్లికేషన్ నుంచి నాసా ముఖ్య ఉద్దేశ్యాలు, లక్ష్యాలు, పూర్తి అయిన ప్రాజెక్టులు తదితర అంశాలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను వీక్షించవచ్చు.

నాసా సైన్స్ మిషన్ హైలెట్స్( NASA Science Mission Highlights):

ఆపిల్ ఫోన్‌లను సపోర్ట్ చేసే ఈ అప్లికేషన్ ఎర్త్ సైన్స్ ఇంకా ప్లానెటరీ సైన్స్ పట్ల అవగాహనను పెంపొందించుతుంది.

 

 

ఐఎస్ఎస్ లైవ్(ISS Live):

ఆండ్రాయిడ్ ఇంకా ఆపిల్ ఫోన్‌లను సపోర్ట్ చేసే ఈ అప్లికేషన్ స్పేస్ స్టేషన్ ముఖ్య ఉద్దేశ్యాన్ని విశ్లేషిస్తుంది. స్పేస్ మిషన్ కార్యకలాపాలకు సంబంధించి అప్ టూ డేట్ సమాచారాన్ని తెలుసుకోవచ్చు.

 

 

క్యూరియాసిటీ ఆన్ మార్స్ (Curiosity on Mars):

ఆండ్రాయిడ్ ఇంకా ఆపిల్ ఫోన్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. డౌన్ లోడింగ్ చార్జ్ $0.99. ఈ అప్లికేషన్ ద్వారా అంగారకుడి పై పరిశోధన జరుపుతున్న క్యూరియాసిటీ రోవర్ తాజా అప్‌డేట్‌లను న్యూస్, ఫోటోలు, వీడియోల రూపంలో తెలసుకోవచ్చు.

 

 

స్పేస్ క్రాఫ్ట్ 3డి (Spacecraft 3D):

ఆపిల్ ఐవోఎస్ డివైజ్‌లను మాత్రమే ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. ఈ 3డి అప్లికేషన్ క్యూరియాసిటీ రోవర్‌ను ప్రత్యక్షంగా తిలకించిన అనుభూతికి‌ లోనుచేస్తుంది. ఈ పరికరానికి సంబంధించి విడిభాగాలు వాటి ఉద్దేశ్యాలను తెలుసుకోవచ్చు.

 

 

మార్స్ గ్లోబ్ (Mars Globe):

ఈ ఐవోఎస్ అప్లికేషన్ ద్వారా అంగారక గృహంలోని పరిస్ధితులను హై రిసల్యూషన్ డిస్‌ప్లే అనుభూతులతో వీక్షించవచ్చు.

 

 

నాసా బి ఏ మార్లియన్ (NASA be a Martian):

ఆండ్రాయిడ్, విండోస్ ఇంకా ఐవోఎస్ డివైజ్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. రెడ్ ప్లానెట్‌గా పేర్కొనబడే మార్స్‌కు సంబంధించి ఆసక్తికర ఫోటోగ్రాఫ్‌లను తిలకించవచ్చు. అంగారక గ్రహానికి సంబంధించి అనేక సందేహాలను ఈ అప్లికేషన్ ద్వారా నివృత్తి చేసుకోవచ్చు.

 

 

నాసా టెలివిజన్ (NASA Television):

ఆపిల్ ఐవోఎస్ డివైజ్‌లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. నాసా ఏర్పాటు చేసే ప్రత్యేక కార్యక్రమాలను ఈ అప్లికేషన్ ద్వారా వీక్షించవచ్చు.

 

 

సాసా స్పేస్ వెదర్ (NASA Space Weather):

ఆపిల్ డివైజ్‌‍లను ఈ అప్లికేషన్ సపోర్ట్ చేస్తుంది. అంతరిక్ష దృగ్విషయం (space phenomenon), భూమి పై వాతావరణ మార్పులు తదితర అంశాలకు సంబంధించిన సమాచారాన్ని సవివరంగా తెలుసుకోవచ్చు.

 

 

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write You too can learn to farm on Mars
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot