గృహ నిర్భంధంలో నాసా శాస్ర్తవేత్తలు
అరుణగ్రహం మీదకు వెళ్లడానికి ఆరుగురు శాస్ర్తవేత్తలు తమను తాము ఏడాది పాటు గృహ నిర్భంధంలో బంధించుకున్నారు. నాసాకు చెందిన ఈ ఆరుగురు సిబ్బంది ఏడాది కాలం పాటు ఏకాంత జీవనం గడపనున్నారు. వీరికి అక్కడ తినడానికి నిద్రపోవడానికి సరిపడేంత ప్లేస్ మాత్రమే ఉంటుంది. ఓ చిన్న గోపురం లాంటి గుహలో వారు ఈ ఏకాంతాన్ని అనుభవించేందుకు సిద్ధమైపోయారు.దానికి సంబంధించిన ఫోటోస్ ను ఓ సారి చూసేయండి.
Read more : యాప్స్ లేని లైఫ్ వేస్ట్

తమను తాము బంధించుకున్నారు.
అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసాకు చెందిన ఆరుగురు సిబ్బంది హవాయి నగరంలో గోపురం (డోమ్) వంటి ఓ కట్టడంలోకి వెళ్లి తమను తాము బంధించుకున్నారు.

ఏడాదికాలం పాటు ఏకాంత జీవితం
ఈ నెల 28 నుంచి ప్రారంభమైన వీరి ఏకాంత జీవితం ఏడాదికాలం పాటు కొనసాగనుంది.

అమెరికా అంతరిక్ష సంస్థ ప్రయోగం
అరుణగ్రహంపైకి మానవులను పంపేందుకు సిద్ధమవుతున్న అమెరికా అంతరిక్ష సంస్థ ఈ ప్రయోగాన్ని చేపట్టింది.

ఆరుగురు ఆ గోపురంలో
అరుణగ్రహంపై జీవితాన్ని ఈ ఆరుగురు ఆ గోపురంలో ఏడాదిపాటు అనుకరిస్తారు.

అందరూ నాసా సిబ్బందే
ఈ ఆరుగురిలో ఒకరు ఫ్రాన్స్‌కు చెందిన ఖగోళ జీవశాస్త్రవేత్త, జర్మనీకి చెందిన ఒక వైద్యుడు, అమెరికాకు చెందిన ఒక పైలెట్, ఒక వాస్తుశిల్పి, ఒక డాక్టరు/పాత్రికేయుడు, మరో భూసార శాస్త్రజ్ఞుడు ఉన్నారు.

డోమ్‌లో 365 రోజులు
ఈ ఆరుగురు 11 మీటర్ల వ్యాసం, ఆరు మీటర్ల ఎత్తున్న డోమ్‌లో 365 రోజుల పాటు నివసిస్తారు.

రెండు నుంచి మూడేండ్లు
అరుణగ్రహానికి మానవుల మిషన్ రెండు నుంచి మూడేండ్లు పట్టవచ్చని అంచనా వేస్తున్నారు.

నిద్రపోవడానికి ఒక మంచం
ఈ ఆరుగురికి నిద్రపోవడానికి ఒక మంచం, ఒక టేబుల్ వారి గదిలో ఏర్పాటుచేశారు. వీరికి ఆహారంగా పొడి జున్ను, క్యాన్‌లలో ట్యూనా చేపల భోజనం ఇచ్చారు. ఈ డోమ్‌కు సౌరశక్తి ద్వారా ఇంధనం లభిస్తుంది.


Click it and Unblock the Notifications








