ఆ టాబ్లెట్ ధర కేవలం రూ. 2999 మాత్రమే
ప్రముఖ కంపెనీలకు ధీటుగా దేశీయ దిగ్గజ కంపెనీ సెల్‌కాన్ విపణిలో దూసుకుపోతోంది. కొత్త కొత్త ఉత్పత్తులతో ఇతర కంపెనీలకు ధీటుగా బదులిస్తోంది. ఇప్పుడు అదే వరసలో అత్యంత తక్కువ బడ్జెట్లో సీటీ 111 టాబ్లెట్‌ను విడుదల చేసింది.
Read more: శాంసంగ్ నుంచి తక్కువధరకే 4జీ స్మార్ట్‌ఫోన్లు

కేవలం రూ. 2999 లకే అదిరిపోయే టాబ్లెట్ ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 7 అంగుళాత తెరతో సెల్‌కాన్ నుంచి బయటకొచ్చిన టాబ్లెట్ ప్రముఖ కంపెనీలకు ధీటుగానే బదులిస్తుందని కంపెనీ యాజమాన్యం ఆశాభావం వ్యక్తం చేస్తోంది. ఈ టాబ్లెట్‌లో ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ ,వైఫై 802.11 b/g/n , ఏఆర్ ఎమ్ కోర్ టెక్స్ ఎ7,1.3 GHz క్వాడ్ కోర్ ప్రాసెసర్ ఉన్నాయి.
Read more: సముద్రం అడుగున 25 అంతస్థుల భవనాలు!

ఇంకా 2 ఎంపీ రేర్ కెమెరా ,ఫ్రంట్ కెమెరా, 7 అంగుళాల తెర ,3జీ ఓటీజీ సపోర్ట్ , పెన్ డ్రైవ్, కార్డ్ రీడర్, మౌస్, కీపాడ్ సపోర్ట్ ,2500 mAh బ్యాటరీ, 32 జీబి ఎక్స్పాండబుల్ మెమొరీ మొదలగు ఫీచర్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications