క్యాష్‌బ్యాక్ ఆఫర్లతో మొదలైన ఐప్యాడ్ (2019) సేల్స్

|

ఆపిల్ యొక్క కొత్త ఐప్యాడ్ (2019) సేల్స్ మొత్తానికి ఇండియాలో మొదలైనాయి. ప్రముఖ ఆన్‌లైన్ ఛానల్స్ ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ రెండింటిలోనూ దీనిని కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఐప్యాడ్ (2019) ను గత నెలలో కుపెర్టినోలో ఐఫోన్ 11 మరియు ఆపిల్ వాచ్ సిరీస్ 5 లతో లాంచ్ చేశారు. ఈ రెండు ఉత్పత్తుల సేల్స్ ఇప్పటికే ఇండియాలో మొదలైనప్పటికీ ఐప్యాడ్ (2019) అమ్మకాలు ఒక నెల తరువాత అందుబాటులోకి వచ్చింది.

ఐప్యాడ్

ఈ 10.2-అంగుళాల కొత్త ఐప్యాడ్ గత సంవత్సరం 2018లో లాంచ్ అయిన ఐప్యాడ్ మోడల్‌కు అప్డేట్ వేరియంట్ గా ఉంది. అంతేకాకుండా ఇది ఐప్యాడ్ OS మరియు A10 ఫ్యూజన్ SoC అవుట్-ఆఫ్-బాక్స్‌ ఆధారంగా పనిచేస్తుంది. ఐప్యాడ్ (2019) వై-ఫై మాత్రమే మరియు వై-ఫై + సెల్యులార్ మోడల్ అనే రెండు మోడళ్లలో ప్రారంభించబడింది.

 

ఫేస్‌బుక్ మరియు వాట్సాప్ మెసేజ్లను యాక్సెస్ చేయడానికి పోలీసులకు అనుమతులుఫేస్‌బుక్ మరియు వాట్సాప్ మెసేజ్లను యాక్సెస్ చేయడానికి పోలీసులకు అనుమతులు

ధర

ధర

ఐప్యాడ్ యొక్క ఓన్లీ వై-ఫై మోడల్ 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,900 కాగా 128 జీబీ వేరియంట్ ధర రూ. 37,900. వై-ఫై + సెల్యులార్ మోడల్ యొక్క 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.40,900 ఉండగా, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.48,900లు. ఇవి ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ మరియు అమెజాన్ రెండింటిలో సిల్వర్, స్పేస్ గ్రే మరియు గోల్డ్ కలర్ ఎంపికలలో లభిస్తుంది.

ఆఫర్స్

ఆఫర్స్

ఫ్లిప్‌కార్ట్ నో-కాస్ట్ EMI ఆప్షన్స్, SBI క్రెడిట్ కార్డులపై 10 శాతం ఇన్‌స్టంట్ డిస్కౌంట్,అలాగే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డులపై 5 శాతం అపరిమిత క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. అమెజాన్ ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్, నో-కాస్ట్ ఇఎంఐ ఆప్షన్స్, మరియు 10 శాతం అంటే 1,750 రూపాయల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్‌ను ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు మరియు క్రెడిట్ / డెబిట్ EMI లావాదేవీలతో అందిస్తుంది.

స్పెసిఫికేషన్స్

స్పెసిఫికేషన్స్

ఐప్యాడ్ (2019) యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఇది ఐప్యాడ్ OS ఆధారంగా రన్ అవుతుంది. అంతేకాకుండా ఇది 10.2-అంగుళాల (2160x1620 పిక్సెల్‌లు) రెటినా IPS డిస్ప్లే 264ppi పిక్సెల్ సాంద్రతతో మరియు 500-నిట్ పీక్ ప్రకాశంతో ఉంటుంది. ఇది M10 కోప్రాసెసర్‌తో పాటు ఆపిల్ A10 ఫ్యూజన్ SoC చేత శక్తిని పొందుతుంది. ఇది 32GB మరియు 128GB అనే రెండు స్టోరేజ్ ఎంపికలతో అందుబాటులో ఉంది.

 

వివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లువివో గ్రాండ్ దీపావళి సేల్స్.... వీటిపై ఆఫర్లే ఆఫర్లు

కనెక్టివిటీ

కెమెరాల విషయానికొస్తే దీని వెనుక వైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో కలిగి ఉంటుంది. అలాగే ముందు వైపు ఎఫ్ / .2 ఎపర్చర్‌తో 1.2-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంటుంది. ఐప్యాడ్ ఆపిల్ పెన్సిల్ కు మద్దతు ఇస్తుంది. అంతేకాకుండా ఇది స్టీరియో స్పీకర్లు మరియు డ్యూయల్ మైక్రోఫోన్‌లను కూడా కలిగి ఉంది. ఐప్యాడ్ (2019) లోని కనెక్టివిటీ ఎంపికలలో వై-ఫై 802.11ac మరియు బ్లూటూత్ v4.0 ఉన్నాయి. వై-ఫై + సెల్యువర్ మోడల్ జిపిఎస్ మరియు LTE కనెక్టివిటీని అందిస్తుంది. ఈ మోడల్ నానో-సిమ్ కార్డ్ స్లాట్ మరియు eSIM టెక్ కారణంగా వై-ఫై కాలింగ్‌ను కూడా అందిస్తుంది.

 

ఏయే దేశాల్లో ఏ స్మార్ట్‌ఫోన్ నంబర్ 1 స్థానంలో ఉంది ?ఏయే దేశాల్లో ఏ స్మార్ట్‌ఫోన్ నంబర్ 1 స్థానంలో ఉంది ?

సెన్సార్

ఐప్యాడ్ (2019) 32Whr బ్యాటరీతో రేట్ చేయబడింది. దీని ద్వారా Wi-Fi లో 10 గంటల వెబ్ సర్ఫింగ్ సమయం మరియు సెల్యులార్ నెట్‌వర్క్‌లో 9 గంటల సమయం గడపవచ్చు. దీనిలోని సెన్సార్లలో దిగువన టచ్ ఐడి ఫింగర్ ప్రింట్ సెన్సార్, త్రీ-యాక్సిస్ గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, డిజిటల్ దిక్సూచి మరియు బేరోమీటర్ కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
iPad (2019) Sales Start Today via Amazon, Flipkart: Price in India and Other Details

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X