Home
Tablets

12GB RAM, AI ఫీచర్లు, 10,090mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్.. గెలాక్సీ ట్యాబ్ S10 FE, S10 FE+ స్పెక్స్, ధరలు లీక్!

శాంసంగ్ నుంచి మరో రెండు కొత్త ట్యాబ్లెట్లు రాబోతున్నాయి. అవే గెలాక్సీ ట్యాబ్ S10 FE, గెలాక్సీ ట్యాబ్ S10 FE+. వీటిని అధికారికంగా ఎప్పుడు లాంచ్ చేస్తారో ఇంకా తెలియదు కానీ, వీటికి సంబంధించిన ముఖ్యమైన స్పెసిఫికేషన్లు, AI ఫీచర్లు, యూరప్ మార్కెట్ ధరలు మాత్రం ఇప్పుడే ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. మరి ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం.

* డిస్‌ప్లేలు ఇంకాస్త పెద్దగా ఉంటాయి

ఈ రెండు కొత్త ట్యాబ్ లు చూడటానికి దాదాపు పాత మోడల్స్ లాగే ఉన్నాయి. అల్యూమినియం బాడీ డిజైన్‌తో రానున్నాయి. దుమ్ము, నీటి నుంచి రక్షణ కోసం IP68 రేటింగ్ కూడా ఉంటుంది, అయితే, డిస్‌ప్లే సైజుల్లో తేడా ఉంటుంది. గెలాక్సీ ట్యాబ్ S10 FEలో 10.9-అంగుళాల WUXGA+ LCD డిస్‌ప్లే ఉంటుంది. దీని రిఫ్రెష్ రేట్ 90Hz.

Samsung Galaxy Tab S10 FE and S10 FE  Leak Full Specs  AI Features  and Pricing Revealed Ahead of Launch

గెలాక్సీ ట్యాబ్ S10 FE+ కొంచెం పెద్దగా, 13.1-అంగుళాల WQXGA+ LCD డిస్‌ప్లేతో వస్తుంది. దీని రిఫ్రెష్ రేట్ కూడా 90Hz.

అయితే, ఇందులో OLED స్క్రీన్లు లేకపోవడం కొందరిని నిరాశపరచవచ్చు. కానీ, ధరను అందుబాటులో ఉంచడానికే శాంసంగ్ LCD ప్యానెల్స్‌ను ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ ట్యాబ్లెట్లు కేవలం 6mm మందంతో, గత మోడళ్ల కంటే 0.5mm పలుచగా ఉండనున్నాయని సమాచారం.

* పనితీరు, బ్యాటరీ

ఈ రెండు ట్యాబ్లెట్లలో శాంసంగ్ సొంతంగా డెవలప్ చేసిన 4nm ఎక్సీనోస్ 1580 ప్రాసెసర్‌ను ఉపయోగించినట్లు సమాచారం. ఇది ఫ్లాగ్‌షిప్ రేంజ్ ప్రాసెసర్ కాకపోయినా, సినిమాలు చూడటానికి, మల్టీ టాస్కింగ్ చేయడానికి, ఆఫీస్ పనులు చేసుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా పనిచేస్తుంది.

* బ్యాటరీ

ట్యాబ్ S10 FE లో 8,000mAh బ్యాటరీ ఉంటుంది. ట్యాబ్ S10 FE+ లో ఇంకాస్త పెద్దగా 10,090mAh బ్యాటరీ ఉంటుంది. రెండూ 45W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. కానీ, ఎప్పటిలాగే బాక్సులో ఛార్జర్ ఇచ్చే అవకాశం తక్కువగానే ఉంది.

రూ.10499 కే 5500mAh బ్యాటరీ, 50MP కెమెరా, డ్యూయల్‌ LED ఫ్లాష్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల..!
* కెమెరాలు, ఎస్ పెన్

ఈ రెండు ట్యాబ్లెట్లలో వెనుకవైపు 13MP కెమెరా, ముందువైపు వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 120-డిగ్రీల వైడ్ యాంగిల్‌తో కూడిన 12MP అల్ట్రావైడ్ కెమెరా ఉంటాయి. శాంసంగ్ ట్యాబ్‌ల ప్రత్యేకత అయిన S పెన్ సపోర్ట్ కూడా వీటికి స్టాండర్డ్‌గా లభిస్తుంది. నోట్స్ రాసుకోవడానికి, డ్రాయింగ్ చేయడానికి, ప్రొడక్టివిటీ పనులకు ఇది చాలా ఉపయోగపడుతుంది.

* AI ఫీచర్లు

ప్రస్తుతం AI ట్రెండ్ నడుస్తోంది. శాంసంగ్ కూడా తన లేటెస్ట్ డివైజ్‌లలో AI ఫీచర్లను ఎక్కువగా అందిస్తోంది. ఈ కొత్త ట్యాబ్ S10 సిరీస్‌లో కూడా కొన్ని అదిరిపోయే AI ఫీచర్లు ఉండనున్నాయి. లీకుల ప్రకారం, గూగుల్ పాపులర్ ఫీచర్ 'సర్కిల్ టు సెర్చ్' ఇందులో ఉంటుంది.

దీనితో స్క్రీన్‌పై కనిపించే దేని గురించైనా, కేవలం సర్కిల్ గీసి వెంటనే సెర్చ్ చేయవచ్చు. వీటితో పాటు, ఫోటో ఎడిటింగ్, లైవ్ ట్రాన్స్‌లేషన్ (మాట్లాడుతుండగానే వేరే భాషలోకి మార్చడం), వాయిస్ నోట్స్‌ను టెక్స్ట్‌గా మార్చడం వంటి మరిన్ని AI ఫీచర్లు కూడా ఉండొచ్చని అంచనా.

* యూరప్ మార్కెట్ కోసం లీకైన ధరలు (అంచనా)

- గెలాక్సీ ట్యాబ్ S10 FE ధరల అంచనా (యూరప్ మార్కెట్)

లీకుల ప్రకారం, గెలాక్సీ ట్యాబ్ S10 FE వై-ఫై మోడల్ బేస్ వేరియంట్ (8GB RAM / 128GB స్టోరేజ్) ధర 579 యూరోలు (సుమారు రూ 49,674) ఉండవచ్చు. అదే వై-ఫై మోడల్‌లో హై-ఎండ్ వేరియంట్ (12GB RAM / 256GB స్టోరేజ్) ధర 679 యూరోలు (సుమారు రూ.58,265)గా అంచనా వేస్తున్నారు.

5G కనెక్టివిటీతో వచ్చే గెలాక్సీ ట్యాబ్ S10 FE బేస్ వేరియంట్ (8GB RAM / 128GB స్టోరేజ్) ధర 679 యూరోలు (సుమారు రూ.58,265) ఉండొచ్చని, అలాగే 5G హై-ఎండ్ వేరియంట్ (12GB RAM / 256GB స్టోరేజ్) ధర 779 యూరోలు (సుమారు రూ.66,856) ఉండొచ్చని సమాచారం.

- గెలాక్సీ ట్యాబ్ S10 FE+ ధరల అంచనా (యూరప్ మార్కెట్)

పెద్ద స్క్రీన్ కలిగిన గెలాక్సీ ట్యాబ్ S10 FE+ విషయానికొస్తే, దీని వై-ఫై బేస్ వేరియంట్ (8GB RAM / 128GB స్టోరేజ్) ధర 749 యూరోలు (సుమారు రూ.64,261) ఉండవచ్చని తెలుస్తోంది. వై-ఫైలోనే హై-ఎండ్ వేరియంట్ (12GB RAM / 256GB స్టోరేజ్) ధర 849 యూరోలు (సుమారు రూ.72,852)గా ఉండొచ్చని అంచనా.

5G సపోర్ట్‌తో వచ్చే గెలాక్సీ ట్యాబ్ S10 FE+ బేస్ వేరియంట్ (8GB RAM / 128GB స్టోరేజ్) ధర కూడా 849 యూరోలు (సుమారు రూ.72,852) ఉండొచ్చని, ఇక టాప్-ఎండ్ 5G వేరియంట్ (12GB RAM / 256GB స్టోరేజ్) ధర 949 యూరోలు (సుమారు రూ.81,443)గా ఉండొచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది.

ఈ ధరలను గమనిస్తే, శాంసంగ్ అప్పర్ మిడ్-రేంజ్ సెగ్మెంట్‌పై దృష్టి పెట్టినట్లు స్పష్టమవుతోంది. అంటే, బేసిక్ టాబ్లెట్ కంటే ఎక్కువ ఫీచర్లు కావాలి, కానీ ఫ్లాగ్‌షిప్ మోడల్ అంత బడ్జెట్ లేని వారి కోసం ఇవి మంచి ఆప్షన్ కానున్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Leaked Samsung Galaxy Tab S10 FE and S10 FE+ specs, AI features, pricing revealed. Discover details on displays, Exynos 1580 chip, battery, S Pen, and more.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X