Moto C Plus vs Redmi 4, రూ.6,999లో బెస్ట్ ఫోన్ ఏది..?

స్పెసిఫికేషన్స్ పరంగా ఈ రెండు ఫోన్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే...

|

ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌లకు విస్తృతమైన డిమాండ్ తీసుకువచ్చిన బ్రాండ్‌లలో మోటరోలా ఒకటి. ఈ బ్రాండ్ లాంచ్ చేసిన Moto E సిరీస్ అప్పట్లో పెను సంచలనం రేపాయి. అమ్మకాల పరంగా అనేక రికార్డుల బద్దలు కొట్టిన మోటో ఇ సిరీస్ ఫోన్‌లు మార్కెట్‌ను కొత్త ట్రెండ్ వైపు నడిపించాయి. ప్రస్తుతానికి మోటో ఇ సిరీస్ నుంచి మోటో ఇ4 ఫోన్ కొత్తదిగా ఉంది.

Moto C Plus vs Redmi 4

Moto C Plus vs Redmi 4

తాజాగా మోటో సీ పేరుతో సరికొత్త ఎంట్రీలెవస్ సిరీస్‌ను మోటరోలా లాంచ్ చేసింది. ఈ సిరీస్ నుంచి కొద్ది రోజుల క్రితం ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయిన Moto C Plusరూ.6,999 ధర ట్యాగ్‌లో బెస్ట్ ఎంట్రీ లెవల్ ఫోన్‌గా నిలిచింది. ఇదే ధర ట్యాగ్‌లో షియోమీ లాంచ్ చేసిన Redmi 4, మోట సీ ప్లస్‌కు ప్రధాన పోటీగా నిలిచింది. స్పెసిఫికేషన్స్ పరంగా ఈ రెండు ఫోన్‌లను కంపేర్ చేసి చూసినట్లయితే...

డిస్‌ప్లే పరంగా చూస్తే..

డిస్‌ప్లే పరంగా చూస్తే..

మోటో సీ ప్లస్ ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది.
షియోమీ రెడ్మీ 4 ఫోన్ 5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లేతో వస్తోంది.

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..

ప్రాసెసర్ విషయానికి వచ్చేసరికి..

మోటో సీ ప్లస్ 1.3గిగాహెట్జ్ MediaTek MT6737 క్వాడ్-కోర్ కార్టెక్స్-ఏ53 సాక్ పై రన్ అవుతుంది.
షియోమీ రెడ్మీ 4 మోడల్ 1.4గిగాహెట్జ్ Snapdragon 435 SoC పై రన్ అవుతుంది.

 కెమెరా స్పెసిఫికేషన్స్...

కెమెరా స్పెసిఫికేషన్స్...

మోటో సీ ప్లస్ ఫోన్‌ 8 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తోంది.

షియోమీ రెడ్మీ 4 మోడల్‌లో 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరాతో పాటు 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాలను ఏర్పాటు చేసారు.

 

ఆపరేటింగ్ సిస్టం

ఆపరేటింగ్ సిస్టం

మోటో సీ ప్లస్ ఫోన్‌ ఆండ్రాయిడ్ నౌగట్ ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది.
షియోమీ రెడ్మీ 4 ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది

ర్యామ్, స్టోరేజ్

ర్యామ్, స్టోరేజ్

మోటో సీ ప్లస్ : 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం,
షియోమీ రెడ్మీ 4: 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ స్లాట్ ద్వారా ఫోన్ స్టోరేజ్ కెపాసిటీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం,

బ్యాటరీ ఎంతంత..?

బ్యాటరీ ఎంతంత..?

మోటో సీ ప్లస్ శక్తివంతమైన 4000 mAh బ్యాటరీతో వస్తోంది.
షియోమీ రెడ్మీ 4 మోడల్ 4,100 mAh బ్యాటరీతో వస్తోంది.

ధరల వివరాలు

ధరల వివరాలు

మోటో సీ ప్లస్ ధర రూ.6,999
షియోమీ రెడ్మీ 4 ప్రారంభ వేరియంట్ ధర రూ.6,999.

ఏది బెస్ట్ స్మార్ట్‌‌ఫోన్..?

ఏది బెస్ట్ స్మార్ట్‌‌ఫోన్..?

అటు స్పెసిఫికేషన్స్ పరంగా ఇటు ధర పరంగా మోటో సీ ప్లస్ అలానే రెడ్మీ 4 ఫోన్‌లు సమానమైన పోలికలను కలిగి ఉన్నప్పటికి, ప్రాసెసర్ విషయంలో మాత్రం మోటో సీ ప్లస్ వెనుకంజలో ఉంది. ఈ ఫోన్‌లో MediaTek chipsetను ఏర్పాటు చేయటం వల్ల ఈ ఫోన్ లైఫ్ సైకిల్ మొత్తం ఆండ్రాయిడ్ నౌగట్ తోనే గడిచిపోతుంది. కొత్త ఆపరేటింగ్ సిస్టంకు అప్‌గ్రేడ్ అయ్యే ఛాన్స్ ఉండదు. బ్రాండ్ వాల్యూను కోరుకునే వారికి మోటో సీ ప్లస్ బెస్ట్ ఆప్షన్ అయితే, ఎక్స్‌ట్రా పనితీరు కోరుకునే వారికి రెడ్మీ 4 బెస్ట్ ఆప్షన్.

Best Mobiles in India

English summary
Spec Comparison : Moto C Plus vs Redmi 4. Read More in Telugu Gizbot..

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X