తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

|

బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌‌ఫోన్ మార్కెట్లో గత కొంత కాలంగా తీవ్రమైన పోటీ వాతావరణం నెలకున్న విషయం తెలిసిందే. జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్‌లు పోటీపోటీగా స్మార్ట్‌ఫోన్‌లను మార్కెట్లోకి తీసుకువస్తోన్న నేపధ్యంలో డజన్లు కొద్ది అందుబాటులో ఉంటోన్న మోడళ్లు యూజర్ ఎంపికను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యంగా ఆండ్రాయిడ్ వర్షన్ స్మార్ట్‌ఫోన్‌‌లకు మార్కెట్లో మంచి గిరాకీ నెలకుంది. నేటి ప్రత్యేక శీర్షికలో భాగంగా ఉపయోగకరమైన స్పెసిఫికేషన్‌లతో బడ్జెట్ ఫ్రెండ్లీ ధర ట్యాగ్‌లలో లభ్యమవుతున్న 10 లేటెస్ట్ వర్షన్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల వివరాలను మీముందుంచుతున్నాం.

మా ఫేస్‌బుక్ పేజీని లైక్ చేయటం ద్వారా మరిన్ని అప్‌డేట్స్ పొందండి

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఇటీవల హానర్ 6 స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చి రూ.20,000 ధర సెగ్మెంట్‌లో ఘన విజయాన్ని అందుకున్న హువావీ తాజాగా రూ.6,999 ధర పరిధిలో మరో బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ‘హానర్ హోళీ'

(Honor Holly)పేరుతో అందుబాటులోకి వచ్చిన ఈ ఫోన్‌ను ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

అద్భుతంగా డిజైన్ కాబడిన ఈ స్మార్ట్‌ఫోన్‌ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే... 5 అంగుళాల డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 720 x 1280పిక్సల్స్), క్వాడ్‌కోర్ 1.3గిగాహెట్జ్ ప్రాసెసర్, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, లై-ఐయోన్ 2000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 16జీబి ఇంటర్నల్ మెమరీ, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4.2 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం. డివైస్ కనెక్టువిటీ ఫీచర్లను పరిశీలించినట్లయితే 3జీ 21 ఎంబీపీఎస్ హెచ్‌ఎస్‌డీపీఏ, 5.76 ఎంబీపీఎస్ హెచ్‌యూపీఏ, 2జీ జీఎస్ఎమ్ 900/1800/1900 మెగాహెర్ట్జ్ (డ్యుయల్ సిమ్), వై-ఫై 802.11 బీ/జీ/ఎస్, బ్లూటూత్ వీ4, ఏ-జీపీఎస్, మైక్రో యూఎస్బీ వీ2.

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ ధర రూ.5,999

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే...4.7 అంగుళాల ఐపీఎస్ ఎల్‌సీడీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 720x1280పిక్సల్స్, 300 పీపీఐ), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 2 ప్రొటెక్షన్, . ఎంఐయూఐ వర్షన్ 5 ఆండ్రాయిడ్ ఇంటర్‌ఫేస్ పై ఫోన్ రన్ అవుతుంది. 

డ్యూయల్ సిమ్ కనెక్టువిటీ, 1.6గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 400 సాక్, అడ్రినో 305 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే సౌలభ్యత, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా (ఆటో ఫోకస్ అలానే ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 1.3 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా.

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ ధర రూ.6,999
ప్రముఖ రిటైలర్ ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

లెనోవో ఏ6000 కీలక స్పెసిఫికేషన్‌లు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 1జీబి ర్యామ్, 8జీబి  ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, డ్యుయల్ మైక్రోసిమ్ స్లాట్, 8 మెగా  పిక్సల్ ఆటో ఫోకస్ కెమెరా (ఎల్ఈడి ఫ్లాష్ సౌకర్యంతో), 2 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ ఎల్టీఈ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్), 2300 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఫోన్ బరువు 128 గ్రాములు, మందం 8.2మిల్లీ మీటర్లు.

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

8జీబి వేరియంట్ ధర రూ.7,999

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280x720పిక్సల్స్), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, డ్యుయల్ కోర్ 2గిగాహెర్ట్జ్ ఇంటెల్ ఆటమ్ జెడ్2580 మొబైల్ చిప్‌సెట్, 1జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ వేరియంట్స్ 8జీబి/16జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమెరీని 64జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 8 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 2 మెగా పిక్సల్ సెకండరీ కెమెరా, డ్యుయల్ సిమ్ 3జీ కనెక్టువిటీ, 2,110 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ ధర రూ.8,999
ప్రముఖ రిటైలర్ అమెజాన్.ఇన్ ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

మైక్రోమాక్స్ తన సరికొత్త యూ బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ ‘యురేకా'ను ఇటీవల మార్కెట్లోకి తీసుకువచ్చింది. ధర రూ.8,999. ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ వర్షన్ ఆధారంగా డిజైన్ చేసిన శ్యానోజెన్ ఆపరేటింగ్ సిస్టం పై ఈ డివైస్ రన్ అవుతుంది. ప్రముఖ రిటైలర్ అమెజాన్.ఇన్ ఈ ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయిస్తోంది.

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఈ సెల్ఫీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.9,999

ఫోన్ స్పెసిఫికేషన్‌లను పరిశీలించినట్లయితే:

5.5 అంగుళాల 720 పిక్సల్ హైడెఫినిషన్ స్ర్కీన్, ఆక్టా‌కోర్ ప్రాసెసర్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమెరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఆండ్రాయిడ్ 4.4 కిట్ క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, కనెక్టువిటీ ఫీచర్లు (వై-ఫై, 3జీ, 2జీ, జీపీఎస్, బ్లూటూత్).

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్ కోర్ ప్రాసెసర్,
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టం,
డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ,
13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా,
5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ ధర రూ.11,499

ఫోన్ ప్రత్యేకతలు:

5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే(రిసల్యూషన్ 1280 x 720), కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్సన్, 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ 6582 ప్రాసెసర్, 1జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 2 మెగా పిక్సల్ ఫ్రంట్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 2100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 3జీ, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్.

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ ధర రూ.8,000 లోపే

ఫోన్ ప్రత్యేకతలు:

క్వాడ్ కోర్ ప్రాసెసర్, 720 పిక్సల్ ఓజీఎస్ డిస్‌ప్లే, ఆండ్రాయిడ్ 4.4 కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ప్రైమరీ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

 

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

తక్కువ బడ్జెట్‌లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌

ఫోన్ ధర రూ.9,999

షియోమీ రైడ్‌మై నోట్ 4జీ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు 5.5 అంగుళాల హైడెఫినిషన్ ఐపీఎస్ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280×720పిక్సల్స్), 13 మెగా పిక్సల్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ సపోర్ట్, 3100 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, ఎమ్ఐయూఐ 5 ఆపరేటింగ్ సిస్టం (ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆధారం).

 

Best Mobiles in India

English summary
Top 10 Best Budget Smartphones with Decent Camera under 10,000 in India.Read more in Telugu Gizbot...

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X