పేటీఎమ్‌కి వాట్సప్ భారీ షాక్, త్వరలోనే !

Written By:

డిజిటల్ సర్వీసుల్లో దూసుకుపోతున్న పేటీఎమ్‌కి వాట్సప్ భారీ షాకివ్వబోతుందనే ప్రస్తుత పరిణామాలు తెలియజేస్తున్నాయి. ఫేస్‌బుక్‌ నేతృత్వంలోని మేసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ త్వరలోనే డిజిటల్‌ చెల్లింపు సేవలను ప్రారంభించనుంది. భారత్‌ నుంచే ఈ సేవలకు శ్రీకారం చుట్టనుంది. అలాగే డిజిటల్‌ లావాదేవీల విభాగానికి అధిపతిని నియమించుకునే పనిలో ఉంది.

మొబైల్ ఫోన్ల గురించి షాకింగ్ నిజాలు !

పేటీఎమ్‌కి వాట్సప్ భారీ షాక్, త్వరలోనే !

భారత్‌లో డిజిటల్‌ సేవల వ్యాప్తికి సహకారం అందించేందుకు ఉన్న అవకాశాలపై చర్చించేందుకు గత ఫిబ్రవరిలో ఐటీ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌తో వాట్సప్‌ సహవ్యవస్థాపకుడు బ్రియన్‌ యాక్టన్‌ సమావేశమయ్యారు. వాట్సప్‌కు భారతే అతిపెద్ద విపణి.

వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్

పేటీఎమ్‌కి వాట్సప్ భారీ షాక్, త్వరలోనే !

ప్రపంచమొత్తం మీద వాట్సప్‌కు 100 కోట్ల మంది వినియోగదారులుంటే.. ఇక్కడే 20 కోట్ల మంది ఉండటం గమనార్హం.వచ్చే ఆరు నెలల్లోనే ఈ సర్వీసులు ప్రారంభించబోతున్నారని సమాచారం. డిజిటల్ సర్వీసుల్లో దూసుకెళ్తున్న పేటీఎంకు చెక్ పెట్టి, వాట్సప్ ఆ స్థానాన్ని కొట్టేయాలని యోచిస్తుందని తెలుస్తోంది.

ఎల్ఈడీ టీవీలపై భారీ డిస్కౌంట్లు

దీంతో ప్రస్తుతమున్న 20 కోట్ల యూజర్ బేస్ ను మరింత పెంచుకోనుందని రిపోర్టు వెల్లడించింది. ఇండియన్ యూజర్ల కోసం ఓ స్పెషల్ ఫీచర్ ను తీసుకురాబోతున్నట్టు వాట్సప్ అంతకముందే ప్రకటించిన సంగతి తెలిసిందే.

English summary
WhatsApp plans Indian digital payments read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot