నూతన సంవత్సరం మొదటి రోజు వాట్సాప్ రికార్డ్ !!!! అది ఏమిటో తెలుసా?

|

ప్రస్తుత రోజులలో కమ్యూనికేషన్ కోసం ఒకరికి ఒకరు మెసేజ్ లను పంపడం కోసం ఎక్కువగా వాట్సాప్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. వాట్సాప్ ను ఉపయోగించి రోజువారీగా అధిక సంఖ్యలో మెసేజ్ లు మరియు మీడియాలను ఎక్స్ఛేంజ్ చేస్తున్నారు. ఇది మాములు విషయం అని అనుకోవచ్చు. కానీ నూతన సంవత్సర వేడుకల సందర్బంగా వాట్సాప్ గొప్ప రికార్డును పొందింది.

వాట్సాప్

ఈ నూతన సంవత్సరం రోజున వాట్సాప్ ప్రారంభమైనప్పటి నుండి నెలకొల్పిన అన్ని రికార్డులను బద్దలు కొట్టింది. నూతన సంవత్సర సందర్భంగా వినియోగదారులు 100 బిలియన్లకు పైగా మెసేజ్ లను ఒకరి నుంచి మరొకరు ఎక్స్చేంజ్ చేసుకున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఇందులో 20 బిలియన్లకు పైగా మెసేజ్ లు భారతీయ వినియోగదారులు పంపడం మరొక విషయం. అంతేకాకుండా ఈ 100 బిలియన్ + మెసేజ్ లలో ప్లాట్‌ఫారమ్‌లో షేర్ చేయబడిన వాటిలో ఇమేజెస్ సుమారు 12 బిలియన్లుగా ఉన్నాయి.

 

 

రేపటి నుంచి వాట్సాప్ ఈ ఫోన్లలో పనిచేయదురేపటి నుంచి వాట్సాప్ ఈ ఫోన్లలో పనిచేయదు

నూతన సంవత్సరం

నూతన సంవత్సర వేడుకలలో డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల నుండి తరువాత 24 గంటల వ్యవధిలో ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 బిలియన్లకు పైగా మెసేజ్ లను ఒకరికి ఒకరు పంచుకున్నట్లు వాట్సాప్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఇది రికార్డు స్థాయిలో జరగడం ఇదే మొదటిసారి. పదేళ్ల క్రితం వాట్సాప్ తన సేవలను ప్రారంభించినప్పటి నుండి ఒకే రోజులో అత్యధిక సంఖ్యలో మెసేజ్ లను మార్పిడి చేసుకున్నారు. నూతన సంవత్సరం సందర్భంగా పంచుకున్న 100 బిలియన్ + మెసేజ్ లలో ఇమేజెస్ 12 బిలియన్లకు పైగా ఉన్నాయని వాట్సాప్ తెలిపింది.

 

 

శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా 2-ఇన్ -1 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్....శామ్సంగ్ గెలాక్సీ బుక్ ఫ్లెక్స్ ఆల్ఫా 2-ఇన్ -1 ల్యాప్‌టాప్ స్పెసిఫికేషన్స్, ఫీచర్స్....

మెసేజ్ ఎక్స్ఛేంజ్

ఒకే రోజులో నికర గ్లోబల్ మెసేజ్ ఎక్స్ఛేంజ్ ఆకట్టుకుంటుంది, భారతీయుల సహకారం కూడా చాలా ముఖ్యమైనది. నూతన సంవత్సర పండుగ సందర్భంగా భారతీయ వినియోగదారులు 20 బిలియన్లకు పైగా సందేశాలను పంచుకున్నారని వాట్సాప్ తెలిపింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మార్పిడి చేయబడిన మొత్తం మెసేజ్ లలో ఐదవ వంతు.

 

 

ఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివోఇంటర్నెట్ లేకుండా ఫైల్ లను బదిలి చేసే ప్రయత్నంలో ఒప్పో, షియోమి & వివో

భారతీయులు

వాట్సాప్ వినియోగదారులలో అత్యధిక వాటా భారతీయులు కలిగి ఉండడం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇంకా ఈ సంఖ్య వేగంగా పెరుగుతూనే ఉంది. ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ యాప్ లలో టెక్స్ట్-మెసేజింగ్ అత్యంత ప్రజాదరణ పొందినవాటిలో మొదటి స్థానంలో ఉంది. తరువాత అదే క్రమంలో స్టేటస్, పిక్చర్ మెసేజింగ్, కాలింగ్ మరియు వాయిస్ నోట్స్ కూడా ఉన్నాయి.

Best Mobiles in India

English summary
WhatsApp Record 100 Billion+ Messages on New Year's Evening

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X