సెకనుకు 7 ఫోటోలు తీసే కెమెరా ఇది

Written By:

కెమెరా రంగంలో దూసుకుపోతున్న దిగ్గజం కెనాన్ తన తరువాతి తరం కెమెరాను రిలీజ్ చేసింది. అత్యాధునిక ఫీచర్లతో మార్కెట్లోకి దూసుకువచ్చిన ఈ కెమెరా సెకనుకు 7 ఫోటోలు తీయగల సామర్ధ్యాన్ని కలిగిఉంది.

new-mobiles

షాక్..జియో వల్ల రిలయన్స్‌కు వచ్చే ఆదాయం ఎంతంటే..

సెకనుకు 7 ఫోటోలు తీసే కెమెరా ఇది

కెనాన్ఈఓఎస్ పేరుతో వస్తున్న ఈ కెమెరాను నాలుగోతరం 5డి ఫుల్‌ ఫ్రేమ్‌ డిఎస్‌ఎల్‌ఆర్‌ కెమెరాగా కంపెనీ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ కెమెరా ధర 2,54,995 రూపాయల నుంచి 3,06,995 రూపాయల వరకు ఉంది. ఒక సెకను వ్యవధిలోనే 7 ఫొటో ఫ్రేమ్‌ను తీయడం ఈ కెమెరాలోని ప్రధా న ప్రత్యేకత.

3gb ram best mobiles

తెలుగు రాష్ట్రాల్లో జియో సిగ్నల్స్ అందే ప్రాంతాలు ఇవే

సెకనుకు 7 ఫోటోలు తీసే కెమెరా ఇది

30.4 మెగాపిక్సెల్‌ ఫుల్‌ ఫ్రేమ్‌ సిఎంఔస్‌ సెన్సార్‌, 4కె వీడియో రికార్డింగ్‌, 3.2 అంగుళాల టచ్‌ స్క్రీన్‌, వైఫై/నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్స్‌ (ఎన్‌ఎఫ్‌సి) కనెక్టివిటీ, ఇన్‌బిల్ట్‌ జిపిఎస్‌ వంటివి కూడా ఇందులో ఉన్నాయి. వీటి మూలంగా చిత్రీకరించిన ఫొటోలు, వీడియోలను సులభంగా ట్రాన్స్‌ఫర్‌ చేసుకునే అవకాశం ఉంటుంది.

fingerprintsensor mobiles

ఫాస్టెస్ట్ ప్రాసెసర్‌‌తో ఇంటెక్స్ ఫోన్

సెకనుకు 7 ఫోటోలు తీసే కెమెరా ఇది

దీని బరువు 795 గ్రాములు ఉంటుంది. కెమెరా విడుదల సందర్భంగా కెనాన్ ఇండియా ప్రెసిడెంట్ కజుటడా మాట్లాడుతూ వచ్చే మూడేళ్ల కాలంలో 3,200 కోట్ల రూపాయల అమ్మకాల లక్ష్యంగా పనిచేస్తున్నట్లు తెలిపారు.

సెకనుకు 7 ఫోటోలు తీసే కెమెరా ఇది

దీంతో పాటు గతేడాది అమ్మకాలను ప్రస్తావించారు. గత ఏడాదిలో అమ్మకాలు 2,158 కోట్ల రూపాయలుగా ఉన్నాయని, ఈ ఏడాదిలో 2,350 కోట్ల రూపాయలకు చేరుకునే ఆస్కారం ఉందన్నారు

English summary
Here Write Shoot cinema-quality 4K videos with new Canon EOS camera
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot