ఫాస్టెస్ట్ ప్రాసెసర్‌‌తో ఇంటెక్స్ ఫోన్

By Hazarath
|

దేశీయ టెక్నాలజీ హ్యాండ్ సెట్స్ దిగ్గజం ఇంటెక్స్ తన కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్టెస్ట్ ప్రాసెసర్ తో పాటు మల్టీ టాస్కింగ్ గా ఈ కొత్త ఫోన్ వినియోగదారులు సమర్థవంతమైన సహాయం చేస్తుందని కంపెనీ చెబుతోంది.

తెలుగు రాష్ట్రాల్లో జియో సిగ్నల్స్ అందే ప్రాంతాలు ఇవే

intex

స్మార్ట్-మోషన్ టెక్నాలజీతో అందుబాటులోకి వచ్చిన "క్లౌడ్ ట్రీడ్" డివైస్ హ్యాండ్స్ ఫ్రీ అనుభవాన్నిస్తుందని పేర్కొంది. స్నాప్ డీల్ ద్వారా మాత్రమే లభ్యం కానున్న ఈ స్మార్ట్ ఫోన్ ధరను రూ.4,999 గా నిర్ణయించింది. 3జీ ఆధారిత ఈ మొబైల్ను ఆగస్టు 29 దాకా ముందస్తు బుకింగ్స్ కోసం అందుబాటులో ఉంటుందని ఇంటెక్స్ ప్రకటించింది. 5 అంగుళాల హెచ్ డీ స్క్రీన్ తో ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్ ఆపరేటింగ్ సిస్టమ్ ను కలిగి ఉంది.

ఇకపై పోలీసు వెరిఫికేషన్ లేకుండానే పాస్‌పోర్ట్ మీ చేతికి

intex

దీంతో పాటు 1.5 గిగాహెట్జ్ హెక్సా కోర్ ప్రాసెసర్ తో ఫోన్ పనిచేస్తుంది. ర్యామ్ విషయానికొస్తే 2జీబీ రామ్ తో పాటు 16 జీబీ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది. దీన్ని 32 జీబీ వరకు ఎక్స్ పాండబుల్ మెమొరీ ద్వారా విస్తరించుకోవచ్చు. 2200 ఎంఏహెచ్ బ్యాటరీ. 5 ఎంపీ రియర్ అండ్ ఫ్రంట్ కెమెరాతో ఫోటోలు తీయవచ్చు.

అన్ లిమిటెడ్ 3జీ డాటా..రేట్లు సగానికి కట్

intex

దీంతోపాటుగా గెస్ట్చర్ కంట్రోల్స్, ఎమర్జెన్సీ, రక్షణ, వాయిస్ క్యాప్చర్, స్లో మోషన్ వీడియో క్యాప్చర్ లాంటి మల్టిపుల్ నేవిగేషన్ ఫీచర్స్ తో తమ ఫోన్ వినియోగదారులను ఆకట్టుకుంటుందని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

Best Mobiles in India

English summary
Here Write Intex unveils new smartphone for multi-taskers at Rs 4,999

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X