Home
Gadgets

Apple iPad Pro 2020 Sale: అద్భుతమైన ఆఫర్లతో మంచి అవకాసం...

ఆపిల్ సంస్థ తన సరికొత్త 11-అంగుళాలు మరియు 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రోను ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభంలో మార్చి నెలలో విడుదల చేసింది. ఇవి ఆపిల్ యొక్క తన పాత ఐప్యాడ్ ప్రో యొక్క రిఫ్రెష్ మోడల్ గా వచ్చినప్పటికి ఇందులో హైలైట్ చేసే ఫీచర్స్ చాలానే ఉన్నాయి.

ఐప్యాడ్ ప్రో 2020

ఐప్యాడ్ ప్రో 2020

వాటిలో ముఖ్యంగా డ్యూయల్ రియర్ కెమెరాలు మరియు సరికొత్త A12Z బయోనిక్ చిప్ చేర్చడం ద్వారా ఈ కొత్త ఐప్యాడ్ ప్రో లైనప్ లను ఆపిల్ సంస్థ ఇంకా శక్తివంతమైనవిగా మార్చాయి. ఈ సంవత్సరం ప్రారంభంలో ఆపిల్ సంస్థ తన కొత్త ఐప్యాడ్ ప్రో 2020ను లాంచ్ చేసింది. కానీ ఇండియాలో ఇప్పుడు దీనిని మొదటిసారిగా అమ్మకానికి ఉంచింది. ఆసక్తిగల వారికోసం ఆపిల్ సంస్థ కొన్ని ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. BSNL 365 రోజుల వాలిడిటీ ప్రోగ్రామ్‌లో మరో కొత్త STV డేటా ప్లాన్...

ఐప్యాడ్ ప్రో 2020 ధరల వివరాలు

ఐప్యాడ్ ప్రో 2020 ధరల వివరాలు

ఆపిల్ యొక్క కొత్త ఐప్యాడ్ ప్రో రెండు వేరు వేరు పరిమాణాలలో వస్తుంది. ఇది సిల్వర్ మరియు స్పేస్ గ్రెయ్ కలర్లలో లభిస్తుంది. 11-అంగుళాల మరియు 12.9-అంగుళాలు గల ఐప్యాడ్ ప్రో 128GB, 256GB, 512GB మరియు 1TB వంటి నాలుగు వేరియంట్లలో లభిస్తుంది.


** 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో యొక్క వై-ఫై మోడల్‌ రూ.71,900 ధర వద్ద మరియు వై-ఫై + సెల్యులార్ మోడల్‌ రూ.85,900 ధర వద్ద లభిస్తుంది.

** 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో యొక్క వై-ఫై మోడల్‌ రూ.89,900 ధర వద్ద మరియు వై-ఫై + సెల్యులార్ మోడల్‌ రూ.1,03,900 ధర వద్ద లభిస్తుంది.

 

ఐప్యాడ్ ప్రో మ్యాజిక్ కీబోర్డ్ ధరలు

ఐప్యాడ్ ప్రో మ్యాజిక్ కీబోర్డ్ ధరలు

** కొత్త ఐప్యాడ్ ప్రోతో పాటు మ్యాజిక్ కీబోర్డ్ ను కూడా పొందవచ్చు. వీటి యొక్క ధరలు 11-అంగుళాల ఐప్యాడ్ ప్రోకు రూ.27,900 మరియు 12.9-అంగుళాల మోడల్‌కు రూ.31,900 ధరను నిర్ణయించారు. ఇది సరళీకృత చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, జపనీస్ మరియు స్పానిష్‌లతో సహా 30 కి పైగా భాషల మద్దతుతో వస్తుంది. Airtel Prepaid Plans:84రోజుల వాలిడిటీతో లాక్డౌన్ సమయంలో సరైన ప్లాన్‌లు ఇవే....

ఐప్యాడ్ ప్రో 2020 స్పేస్ గ్రే కలర్ స్మార్ట్ కీబోర్డ్ ధర

ఐప్యాడ్ ప్రో 2020 స్పేస్ గ్రే కలర్ స్మార్ట్ కీబోర్డ్ ధర

** కొత్త ఐప్యాడ్ ప్రో కోసం రెండవ తరం ఆపిల్ పెన్సిల్ ను రూ.10,900 ధర వద్ద పొందవచ్చు.

** ఇది కాకుండా కొత్త ఐప్యాడ్ ప్రో కోసం స్పేస్ గ్రే కలర్ కొత్త స్మార్ట్ కీబోర్డ్ ను 11-అంగుళాల మోడల్ కోసం రూ.7,500 మరియు 12.9-అంగుళాల మోడల్ కోసం రూ.9,900 ధర వద్ద లభిస్తుంది. ఫోలియో కీబోర్డ్ ఐప్యాడ్ ప్రోకు కవర్‌గా మరియు ఆసరాగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. Chinese Apps: ఇండియా యాప్ మార్కెట్‌ను శాసిస్తున్న చైనా యాప్‌లు ఇవే

 

ఐప్యాడ్ ప్రో 2020 స్పెసిఫికేషన్స్

ఐప్యాడ్ ప్రో 2020 స్పెసిఫికేషన్స్

ఆపిల్ యొక్క 11-అంగుళాల మరియు 12.9-అంగుళాల కొత్త ఐప్యాడ్ ప్రో టాబ్లెట్‌లు రెండూ కూడా ఒకేరకమైన డిస్ప్లే ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో ప్రోమోషన్ టెక్, వైడ్ కలర్, యాంటీ రిఫ్లెక్టివ్ కొటిన్ ట్రూ టోన్ డిస్ప్లే మరియు 600 నిట్స్ బ్రైట్ నెస్ వంటి అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఈ రెండు టాబ్లెట్‌లు ఆపిల్ యొక్క A12Z బయోనిక్ ప్రాసెసర్‌తో పాటు న్యూరల్ ఇంజన్ మరియు ఎంబెడెడ్ M12 కోప్రాసెసర్‌తో రన్ అవుతాయి.

 ఐప్యాడ్ ప్రో 2020 కెమెరా ఫీచర్స్

ఐప్యాడ్ ప్రో 2020 కెమెరా ఫీచర్స్

ఆపిల్ కొత్త ఐప్యాడ్ ప్రో రెండూ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉన్నాయి. ఇందులో ఎఫ్ / 1.8 ఎపర్చరు లెన్స్‌తో పాటు అల్ట్రా-వైడ్ యాంగిల్ తో 12-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాను మరియు ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో మరియు 125-డిగ్రీల ఎఫ్‌ఓవితో 10 మెగాపిక్సెల్ రెండవ కెమెరాను కలిగి ఉన్నాయి. దీని యొక్క కెమెరాలు 60fps వద్ద 4K వీడియోలను రికార్డ్ చేయగలవు. అలాగే 24fps కి మద్దతుతో స్లో-మోషన్ వీడియోలను తీయడానికి కూడా అనుమతిని ఇస్తుంది. అలాగే ముందు వైపు గల 7 మెగాపిక్సెల్ కెమెరా పోర్ట్రెయిట్ మోడ్, పోర్ట్రెయిట్ లైటింగ్, అనిమోజీ వంటి ఫీచర్లను కలిగి ఉంది. దీని సహాయంతో FHD రిజల్యూషన్ వీడియోలను 60fps వద్ద రికార్డ్ చేయవచ్చు.

ఐప్యాడ్ ప్రో 2020 స్టూడియో-క్వాలిటీ ఫీచర్స్

ఐప్యాడ్ ప్రో 2020 స్టూడియో-క్వాలిటీ ఫీచర్స్

కొత్త ఐప్యాడ్ ప్రో రెండూ లిడార్ స్కానర్‌తో వస్తాయి. కెమెరాలు మెరుగైన రియాలిటీ పనితీరు కోసం వాటి యొక్క రేంజ్ వరకు లైటింగును అందిస్తాయి. మునుపటిలాగే కొత్త 11-అంగుళాల మరియు 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో మోడళ్లలో నాలుగు వైపులా నాలుగు స్పీకర్లు మరియు స్పష్టమైన వాయిస్ రికార్డింగ్ మరియు కాల్‌ల కోసం ఐదు 'స్టూడియో-క్వాలిటీ' మైక్రోఫోన్‌లు ఉన్నాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
Apple iPad Pro 2020 Sale Start in India: Price, Specs and More
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X