Samsung Galaxy A31 వచ్చేసింది!! ఫీచర్స్ అదుర్స్.. ధర కూడా తక్కువే...

|

ఇండియాలో స్మార్ట్ ఫోన్ లలో అధికంగా డిమాండ్ ఉన్న బ్రాండ్ లలో శామ్సంగ్ సంస్థ ఒకటి. ఈ రోజు ఇండియాలో శామ్సంగ్ సంస్థ మరొక కొత్త ఫోన్ శామ్సంగ్ గెలాక్సీ A31 ను విడుదల చేసింది. అందరు ఉహించిన విధంగా ఈ ఫోన్ కేవలం ఒకే ఒక వేరియంట్‌తో మాత్రమే లాంచ్ చేయబడింది.

గెలాక్సీ A31

గెలాక్సీ A31

గెలాక్సీ A31 వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్ తో 6.4-అంగుళాల ఫుల్-హెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉండి OneUI 2 తో సరికొత్త ఆండ్రాయిడ్ 10 వెర్షన్‌తో రన్ అవుతుంది. శాంసంగ్ సంస్థ గతంలో ఇండియాలో లాంచ్ చేసిన గెలాక్సీ A30 స్మార్ట్ ఫోన్ కు అప్ డేట్ వెర్షన్ గా గెలాక్సీ A31 ను లాంచ్ చేసారు. Airtel, JioFiber: ప్రత్యేక ప్రయోజనాలతో 1Gbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లు

శాంసంగ్ గెలాక్సీ ఏ31 ధరల వివరాలు

శాంసంగ్ గెలాక్సీ ఏ31 ధరల వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A31 స్మార్ట్ ఫోన్ యొక్క ధరల విషయానికి వస్తే ఇది కేవలం ఒకే ఒక వేరియంట్లో మాత్రమే విడుదల చేసారు. ఇందులో 6GB ర్యామ్ + 128GB స్టోరేజ్ వేరియంట్ యొక్క ధర రూ.21,999. ప్రిజం బ్లాక్, ప్రిజం బ్లూ మరియు ప్రిజం వైట్ వంటి మూడు కలర్ వేరియంట్ లలో లభిస్తుంది.  Redmi Earbuds S: రికార్డు స్థాయిలో సేల్స్!! రూ.2000 లోపు ధరలో బెస్ట్ ఇవే...

శాంసంగ్ గెలాక్సీ ఏ31 లభ్యత వివరాలు

శాంసంగ్ గెలాక్సీ ఏ31 లభ్యత వివరాలు

శామ్సంగ్ గెలాక్సీ A31 స్మార్ట్ ఫోన్ ను దేశంలో ఈ రోజు అంటే జూన్ 4 నుంచి శామ్సంగ్ యొక్క అన్ని ఆన్ లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్ల ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్నాయి. అలాగే శామ్సంగ్ రిటైల్ భాగస్వాములైన అమెజాన్ ఇండియా, ఫ్లిప్‌కార్ట్, బెనో వంటి ఈస్టోర్లు మరియు శామ్‌సంగ్ ఒపెరా హౌస్‌ వంటి ఆఫ్‌లైన్ రిటైలర్ల ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు.

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్పెసిఫికేషన్స్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ యొక్క డిస్ప్లే 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ సూపర్ AMOLED ఇన్ ఫినిటీ-యూ డిస్ ప్లే 1080x2400 పిక్సెల్ రిజల్యూషన్ పరిమాణంలో కలిగి ఉంటుంది. అలాగే దీని డిస్ ప్లే యొక్క యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది. ఇది ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో పీ65 ప్రాసెసర్ ను కలిగి ఉండి ఆండ్రాయిడ్ 10 ఆధారిత వన్ UI2.1 ఆపరేటింగ్ సిస్టం ఆధారంగా రన్ అవుతుంది. Facebook "Collab app": ఫేస్‌బుక్ నుంచి మరో కొత్త వీడియో యాప్...

శాంసంగ్ గెలాక్సీ ఏ31 కెమెరా సెట్ అప్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 కెమెరా సెట్ అప్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ లో వెనకవైపు క్వాడ్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉంది. ఇందులో గల మెయిన్ కెమెరా f / 2.0 ఎపర్చరుతో 48 మెగాపిక్సెల్, ఎఫ్ / 2.2 ఎపర్చర్‌ మరియు అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కెమెరాతో 8 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా, ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా చివరిగా ఎఫ్ / 2.4 ఎపర్చర్‌తో 5 మెగా పిక్సెల్ మాక్రో కెమెరాలతో క్వాడ్ రియర్ కెమెరా సెట్ అప్ ను కలిగి ఉన్నాయి. అలాగే ఈ ఫోన్ యొక్క ముందు భాగంలో సెల్ఫీల కోసం ఎఫ్ / 2.2 ఎపర్చర్‌తో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో ప్యాక్ చేయబడి ఉంది.

శాంసంగ్ గెలాక్సీ ఏ31 సాఫ్ట్‌వేర్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 సాఫ్ట్‌వేర్

శాంసంగ్ గెలాక్సీ ఏ31 స్మార్ట్ ఫోన్ సాఫ్ట్‌వేర్ పరంగా ఇది ఆండ్రాయిడ్10- ఆధారిత OneUI అవుట్-ఆఫ్-బాక్స్‌తో రన్ అవుతుంది. ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ఇందులో గల మైక్రో SD కార్డు స్లాట్ ద్వారా మెమొరీని 512GB వరకు విస్తరించడానికి అవకాశం ఉంది. ఇది డ్యూయల్ 4G Volte సిమ్ స్లాట్, వైఫై, బ్లూటూత్, GPS/A-GPS, USB టైప్-C, 3.5mm హెడ్ ఫోన్ జాక్ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఇందులో ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఇది 15W ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సామర్థ్యం గల 5000mAh బ్యాటరీ సపోర్ట్ తో ప్యాక్ చేయబడి ఉంటుంది.

Best Mobiles in India

English summary
Samsung Galaxy A31 Launched in India: Price, Specs, Sales Offers

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X