ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ తో వాట్సాప్

|

ఈ ఏడాది ఆగస్టులో వాట్సాప్ తన ఆండ్రాయిడ్ బీటా వినియోగదారుల కోసం ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్‌ను విడుదల చేసింది. ఫేస్బుక్ యాజమాన్యంలోని వాట్సాప్ సంస్థ ఎట్టకేలకు ఇప్పుడు బయోమెట్రిక్ యాక్సిస్ ద్వారా ఓపెన్ అవడానికి వాట్సాప్ యొక్క ఆండ్రాయిడ్ యాప్ వెర్షన్ కు తీసుకువస్తోంది. ఈ ఫీచర్ ఉపయోగించడం ద్వారా వాట్సాప్ వినియోగదారులు వారి సందేశాలను ఇతరులు చదవకుండా నిరోధించడానికి వీలుగా మరొక లాక్ ను అందిస్తుంది. టచ్ ఐడి మరియు ఫేస్ ఐడికి మద్దతుతో ఈ ఫీచర్‌ను మొదట iOS లో రూపొందించారు.

వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ ను ఎనేబుల్ చేయడం ఎలా?

వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ ను ఎనేబుల్ చేయడం ఎలా?

వాట్సాప్ లో ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ ను "సెట్టింగులు" లోని "అకౌంట్" ఆప్షన్ క్రింద "ప్రైవసీ" విభాగంలో కనుగొనవచు. దీన్ని వాట్సాప్‌లో ఎనేబుల్ చెయ్యడానికి ఈ పద్ధతులు పాటించండి.

సెట్టింగులు> అకౌంట్> ప్రైవసీ> ఫింగర్ ప్రింట్ లాక్‌కి వెళ్లి ఎనేబుల్ చేయవచ్చు. మీరు వాట్సాప్ యొక్క "ఫింగర్ ప్రింట్ లాక్" ఫీచర్ ను ప్రారంభిస్తే అది OS లో ముందే ఏర్పాటు చేసిన మీ వేలిముద్రను ఉపయోగించమని అడుగుతుంది. ఈ యాప్ "ఆటొమ్యాటిక్ గా లాక్" చేయడానికి మూడు ఎంపికలతో వస్తుంది. మొదటిది "వెంటనే," రెండవది "1 నిమిషం తరువాత", మరియు మూడవది "30 నిమిషాల తరువాత."

 

ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్

వాట్సాప్ యొక్క ఫింగర్ ప్రింట్ లాక్ ఫీచర్ మెసేజ్ లను మాత్రమే దాచిపెడుతుందని గమనించాలి ఫోన్ కాల్‌లను ఎప్పటి లాగే అనుమతిస్తుంది. నోటిఫికేషన్లలో మెసేజ్ సందర్భ దృశ్యాన్ని ప్రారంభించడానికి లేదా నిలిపివేయడానికి ఈ ఫీచర్ వినియోగదారులను అనుమతిస్తుంది. అంతేకాకుండా వినియోగదారులు ఈ లక్షణాన్ని ప్రారంభించినప్పుడు వాట్సాప్ విడ్జెట్ దాని కంటెంట్‌ను దాచిపెడుతుంది.

వాట్సాప్

ఈ సంవత్సరం ప్రారంభంలో వాట్సాప్ వినియోగదారులకు అదనపు భద్రత కల్పించడానికి మొదటి సారిగా ఐఫోన్ కోసం టచ్ ఐడి మరియు ఫేస్ ఐడిని రూపొందించారు. ఈ రోజు ఇలాంటి యాక్సిస్ ను ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా పరిచయం చేస్తోంది. మద్దతు ఉన్న అన్ని రకాల ఆండ్రాయిడ్ ఫోన్‌లలో మీ ఫింగర్ ప్రింట్ తో యాప్ ను అన్‌లాక్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది అని వాట్సాప్ తెలిపింది.

 ఎన్ఎస్ఓ గ్రూప్

1,400 మంది భారతీయ జర్నలిస్టులు, మరియు కార్యకర్తలపై గూడచర్యం చేసినందుకు వాట్సాప్ ఇజ్రాయెల్ సంస్థ ఎన్ఎస్ఓ గ్రూప్ పై కేసు పెట్టిన తరువాత ఈ వార్త వచ్చింది. ప్రైవేట్ సంస్థ వినియోగదారులపై దాడి చేయడానికి అత్యాధునిక పెగసాస్ స్పైవేర్ను ఉపయోగించింది. గత నివేదికల ప్రకారం వాట్సాప్ మొదట్లో ఈ దాడికి సంబందించిన పెగాసస్ గురించి మే 2019 లో కనుగొంది. ఆ సమయంలో సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాట్సాప్ వినియోగదారులను వారి యాప్ ను అప్ డేట్ చేయమని కోరింది.

స్పైవేర్

ఈ స్పైవేర్ "జీరో-క్లిక్ జీరో-డే" అని పిలువబడే దుర్బలత్వంపై పనిచేసింది. ఇక్కడ దాడి చేసేవారు నేరుగా స్మార్ట్‌ఫోన్‌కు సోకుతారు. వాస్తవానికి దాడి చేసినవారు పరికరంలో పెగసాస్ ఇంజెక్ట్ చేయడానికి వాట్సాప్ వీడియో కాల్స్ ఉపయోగించారు. దీని గురించి ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బాధితుడు తమ వంతుగా ఏమీ చేయనవసరం లేదు. దీని అర్థం బాధితులు కాల్ తీసుకోవలసిన అవసరం కూడా లేదు.

Best Mobiles in India

English summary
How to Enable Fingerprint Lock Feature in WhatsApp For Android Phones

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X