విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

Written By:

విశ్వంలో భూమిని పోలిన, నివాసయోగ్యంగా ఉండే మూడు గ్రహాలను కనుగొన్నామని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ప్రకటించింది. సౌరవ్యవస్థ వెలుపల జీవాన్వేషణ కోసం జరుగుతున్న పరిశోధనకు సరైన పరిష్కారాన్ని ఈ గ్రహాలు చూపిస్తాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. అత్యంత శీతల పరిస్థితులు ఉన్న ఈ మరుగుజ్జు గ్రహాలు 39 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నట్టు గుర్తించారు.

Read more : ఇంటర్నెట్లో హల్‌చల్ చేస్తున్న ఘోస్ట్‌లు ఇవే!

విశ్వంలో మరో 3  గ్రహాల్లో జీవం ఉనికి

భూమి, శుక్ర గ్రహాలపై ఉండే ఉష్ణోగ్రత ఈ గ్రహాలపై ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. చీలీలో 60 సెంటీమీటర్ల పొడవు ఉన్న ట్రాపిస్ట్ను (ట్రాన్సిటింగ్ ప్లానెట్స్ అండ్ ప్లానెటెస్లమాల్స్ స్మాల్ టెలిస్కోప్) ఉపయోగించి వీటిని కనుగొన్నారు. ఈ గ్రహాల గుర్తింపు ద్వారా సౌరవ వ్యవస్థ వెలుపల రసాయన నిక్షేపాల అన్వేషణకు తొలి అవకాశం దక్కిందని బెల్జియంలోని లీజ్ యూనివర్సిటీకి చెందిన వ్యోమభౌతిక శాస్తవేత్త మైఖెల్ గిల్లాన్ అన్నారు. భూగ్రహానికి సమీపంలో ఉన్నందున అక్కడి వాతావరణాన్ని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీ సాయంతోనే పరిశీలించే అవకాశముందన్నారు.

Read more: వీడియో గేమ్ పిచ్చి రెండేళ్ల పసికందును చంపేసింది

విశ్వంలో మరో 3  గ్రహాల్లో జీవం ఉనికి

ఈ అతిచిన్న గ్రహాలు అత్యంత చేరువలో ఉన్నాయని, వాటిపై ఉన్న వాతావరణాన్ని, కూర్పుపై అధ్యయనం చేపడుతామని మస్సాచుస్సెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ) పరిశోధకుడు జూలియన్ డి విట్ పేర్కొన్నారు.ఇదిలా ఉంటే మనుషుల కన్నా ముందే జంతువులు ఆకాశంలో చక్కర్లు కొట్టి వచ్చాయి. అంతరిక్షంలోకి ఇప్పటిదాకా వెళ్లిన జంతువులను ఓ సారి చూద్దాం.

Read more: అమెరికా తీర్చుకున్న పగకు అయిదేళ్లు నిండాయి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

లైకా అనే ఆడ కుక్కను స్పుత్నిక్‌2 రాకెట్‌ ద్వారా నవంబరు 3 1957న గగనతలంలోకి పంపారు. కానీ దానిని వెనుకకు రప్పించే మార్గం కుదరలేదు. 10 రోజుల పయనం తరువాత అది చనిపోయింది. మానవుడు వెళ్లడానికి ముందు మరిన్ని జంతువులను పంపారు.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

ఆ దశలోనే బెల్కి, స్ట్రెల్కా అనే కుక్కలు 19 ఆగస్టు 1960లో అంతరిక్షయానం చేసి పూర్తి ఆరోగ్యంగా భూమికి తిరిగివచ్చాయి. వాటిలో స్ట్రెల్కా అనే కుక్క 6 పిల్లలను కన్నది. అందులో ఒక దానిని అప్పటి యుఎస్‌ ప్రెసిడెంట్‌ అయిన జాన్‌ ఎఫ్‌.కెనడీ కి ఇవ్వబడింది.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

18 అక్టోబరు, 1963లో వెరానిక్‌ ఎజి1 అనే ఫ్రెంచి రాకెట్‌లో ఫెలిక్స్‌ అనే పిల్లిని అంతరిక్షంలోకి పంపి పారాచూట్‌ ద్వారా భూమికి సురక్షితంగా తీసుకువచ్చారు.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

50 సంవత్సరాల తర్వాత ఇరాన్ ప్రభుత్వం పెర్షియన్ పిల్లులను 2014లోకి అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు కూడా చేసింది.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

రోదసికి వెళ్లే మనుషులను ఆస్ట్రోనాట్లు(వ్యోమగాములు) అంటాం గదా.. అలాగే.. అంతరిక్షానికి వెళ్లిన ఎలుకలే ఈ మౌస్ట్రోనాట్లు! అమెరికాలోని ఫ్లోరిడా నుంచి నింగికి బయలుదేరిన స్పేస్‌ఎక్స్ రాకెట్‌లో బయలుదేరిన 20 ఎలుకలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నాయి. 

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

నాసాతో నాలుగో కాంట్రాక్టులో భాగంగా స్పేస్‌ఎక్స్ కంపెనీ పంపిన ఈ రాకెట్‌లో 20 ఎలుకలతో పాటు వ్యోమగాములకు అవసరమైన ఫ్రీజ్-డ్రైడ్ మీల్స్, 3డీ ప్రింటర్, ఇతర పరికరాలు మొత్తం 2,200 కిలోల బరువైన సరుకుల్ని పంపారు.అయితే.. మనిషి కాకుండా ఇతర క్షీరదాలను ఐఎస్‌ఎస్‌కు పంపడం ఇదే తొలిసారి. రోదసిలో గురుత్వాకర్షణ లేమిలో కండరాల క్షీణతపై ప్రయోగాలు జరిపేందుకు గాను ఈ ఎలుకలను నాసా ఐఎస్‌ఎస్‌కు పంపింది.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

2012 సంవత్సరంలో జపాన్ తప జపనీస్ htv-3లో చేపలతో నిండిన ఆక్వేరియంను తీసుకెళ్లింది. దీనిని మేడ్కా అని వారు పిలుచుకున్నారు. వారు చేపల మీద రకరకాల ప్రయోగాల్లో భాగంగా వాటిని అంతరిక్షంలోకి పంపారు. వాటిని అక్కడికి పంపండం ద్వారా అవి అక్కడ ఎలా ఈదుతున్నాయి. వాటికి ఆక్సిజన్ అందుతుందా లేదా అన్నదానిపై శోధన చేసేందుకు వీలుగా వాటిని పంపారని తెలుస్తోంది.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

ఏబిల్‌, బేకర్‌ అనే రెండు కోతులు 28 మే 1959లో అంతరిక్షాన అడుగుపెట్టాయి. కానీ అవి భూమికి తిరిగిరాలేదు. తరువాత 20 నవంబర్‌ 1961లో ఒక మగ చింపాంజీ భూమి కక్ష్యను రెండుసార్లు చుట్టి వచ్చి సురక్షితంగా భూమిని చేరింది. తరువాత ఎన్నో చింపాంజీలు, కోతులు అంతరిక్షయానం చేశాయి.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

అయితే మొట్టమొదట అంతరిక్షంలోకి వెళ్ళిన జంతువు కోతి. దానిని 1948లో ''ఆల్‌బర్ట్‌ 1'' అనే పేరు మీద పంపారు. కానీ అదీ, దాని సహచరి అయిన ఇంకో కోతి టెస్టుల సమయంలో మరణించాయి. తరువాత మళ్ళీ సెప్టెంబరు 20, 1951లో ఒక కోతి, 11 ఎలుకలను యుఎస్‌ ఏరోబీ రాకెట్‌లో పంపి సురక్షితంగా భూమికి తీసుకువచ్చారు. వీటి ద్వారా అక్కడి రేడియేషన్‌, గురుత్వాకర్షణ లేమిని గ్రహించారు.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

చింపాంజీలు 1959లో హమ్ అనే చింపు మొట్ట మొదటిగా అంతరిక్ష యానం చేసింది. ఈ చింపు చాలానే ట్రైనింగ్ తీసుకుని అంతరిక్షంలో అడుగుపెట్టింది. ఆకాశంలో తినేందుకు బనానాని ఈ చింపుకి ఇచ్చారు. మెర్కూరి రెడ్ స్టోన్ 2లో ఫ్లోరిడా నుంచి జనవరి 31 1961న ఘనంగా ఈ చింపు అంతరిక్షంలోకి అడుగుపెట్టింది.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

9నవంబర్‌ 1970లో కప్పలను భూమి కక్ష్యకు తీసుకునివెళ్ళారు. తరువాత 10 డిసెంబరు 1990లో తమోహిరో అకియామా అనే జపనీస్‌ జర్నలిస్ట్‌ 6 పచ్చ కప్పలను సోవియట్‌ మిర్‌ స్పేస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్ళి గురు త్వా కర్షణ లేమిపై పరిశోధన చేశారు.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

అయితే అంతరిక్షం నుంచి కిందకి వస్తున్న సమయంలో అనుకోకుండా రాకెట్ పేలిపోవడంతో ఓ కప్ప అంతరిక్షం నుంచి దూకుతూ కెమెరాకు చిక్కింది. ఇక ఆ తర్వాత ఎన్నో కప్పలు అంతరిక్షంలో చక్కర్లు కొట్టి వచ్చాయి.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

నులి పురుగులు కూడా అనేక సార్లు అంతరిక్షంలోకి చక్కర్లు కొట్టి వచ్చాయి. అపోలో మిషన్ 16లో ఈ నులి పురుగులు ఆకాశంలోకి యాత్రను చేసి వచ్చాయి. 2003లో అంతరిక్షం నుంచి భూమికి వస్తున్న స్పేస్ శాటిలైట్ కాలిపోయిన విషయం విదితమే..అందులో ఉన్న ఏడుగురు వ్యోమగాములు చనిపోయారు . అయితే అందులో నులి పురుగుల ఆశ్చర్యంగా బతికి ఉన్నాయి.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

అంతరిక్షంలో గాలి అనేది ఉండదు అనే విషయం అందరికీ తెలుసు. అక్కడ ఆక్సిజన్ అసలే దొరకదు.అయినప్పటికీ శాస్ర్తవేత్తలు వాటర్ బీర్స్ ని ఆకాశంలోకి పంపారు.యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ పోటోన్ m-3మిషన్ లో వీటిని తీసుకెళ్లింది. ఇవి అక్కడ కొన్ని రోజుల పాటు ఆహారం తీసుకోకుండా ఉంటాయనే విషయం విదితమే. అందుకే వీటిని ఆకాశంలోకి పంపారు.

విశ్వంలో మరో 3 గ్రహాల్లో జీవం ఉనికి

అరబెల్లా అని పిలుచుకునే సాలీడుని 28 జులై 1978లో స్కైలాబ్‌ రాకెట్‌ ద్వారా అంతరిక్షంలోకి తీసుకు వెళ్ళారు. అక్కడ ఈ సాలీడు60 రోజులు గడిపింది. గురుత్వాకర్షణ లేమిలో సాలీడు వాటి తాడులను ఏవిధంగా పెంపొందించుకుంటాయో తెలుసుకోవడానికి ఈ పరిశోధనను నిర్వహించారు.

గిజ్‌బాట్ పేజిని లైక్ చేయండి

టెక్నాలజీకి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్ డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Astronomers Find 3 Habitable Alien Planets Around Ultracool Dwarf Star
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot