హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

Written By:

ఈకామర్స్ సైట్లు అందుబాటులోకి వచ్చిన పాత వస్తువులను అమ్మేయటం షరా మామూలుగా మారిపోయింది. అయితే అలా అమ్మేసిన ఒక వస్తువు ఇప్పుడు సంచలనంగా మారింది. అదే హిట్లర్ టైప్ రైటర్. ప్రపంచాన్ని గడగడలాడించిన నియంత హిట్లర్ 1970వ దశకంలో తన ఆర్మీ జనరల్స్ కు రహస్య సందేశాల్ని పంపేందుకు ఈ టైప్ రైటర్ యంత్రాన్ని వినియోగించేవాడు. ఈ మిషన్ ద్వారా పంపిన సందేశాలతో వేలమంది తమ ప్రాణాలను కోల్పోయారు.

Read more: రెండవ ప్రపంచ యుద్ధంలో నాజీల సీక్రెట్ ఆయుధాలు

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

ఈ యంత్రం ప్రత్యేకత ఏమిటంటే.. జర్మన్ అక్షరాల్ని టైప్ చేస్తే.. రహస్య కోడ్ లాంగ్వేజ్ లోకి మారిపోయి.. ఎవరికి పంపాలో వారికి పంపిస్తుంది. నాజీ పార్టీకి చెందిన ప్రముఖులకు మాత్రమే వీటి వాడకం తెలుసునని యూకే అధికారులు అభిప్రాయ పడుతున్నారు.ఇలాంటివి దాదాపు 200 వరకు ఉండగా అవన్నీ మాయమై ప్రస్తుతం నాలుగు మాత్రమే లభ్యమయ్యాయని అధికారులు చెబుతున్నారు. ఈ అపురూప వస్తువును ఈబే తన సైట్ లో రూ.930లకు అమ్మకానికి పెట్టింది.

Read more: ఉత్తర కొరియాకు మరోసారి పరాభవం

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

ఏదో పాత వస్తువ అని అనుకొని ఈ బేలో అమ్మకానికి పెట్టగా.. బ్రిటన్ లోని నేషనల్ మ్యూజియం ఆఫ్ కంప్యూటింగ్ కు చెందిన జాన్ అనే ఒక వలంటీర్ దీన్ని గుర్తించారు. ఈ అపురూపమైన వస్తువును మారు మాట్లాడకుండా కొనేసి తన సొంతం చేసుకున్నాడు. తాను సొంతం చేసుకున్న ఈ యంత్రం పని తీరును జూన్ 3న మ్యూజియంలో పరీక్షించనున్నట్లు చెబుతున్నారు. తుక్కు సామాను కింద అమ్మిన టైప్ రైటర్ వెనుక ఇంత చరిత్ర ఉందా అని చూసిన వాళ్లు షాక్ తినే పరిస్థితి.

Read more: సామాన్యుల చేతికి అందని ఫోన్ ఇదే

ఆరు కోట్ల మంది చావుకు అలాగే పదిలక్షల కోట్ల డాలర్ల నష్టాన్ని మిగిల్చిన రెండవ ప్రపంచ యుద్ధంలో హిట్లర్ వాడిన సీక్రెట్ ఆయుధాలు.. ఆయన వ్యూహాలు ఎలా ఉండోవో మీరు చూడండి.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

రెండవ ప్రపంచ యుద్ధం వస్తుందని తెలిసి హిట్లర్ ముందుగానే ఆయుధాలను తయారు చేసుకున్నారు. హిట్లర్ నాజీ ఇంజనీర్స్ అప్పట్లోనే అత్యాధునిక ఆయుధాలను తయారుచేశారు. వాటిలో సోనిక్ గన్స్ ,ఎక్స్ రే గన్స్ ,లాండ్ క్రూజెర్స్ లాంటి విధ్వంసక ఆయుధాలు ఉన్నాయి.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

దీనికి సంబంధించి వెపన్స్ మ్యాగజైన్ ఆస్తకికర కథనాన్ని ప్రచురించింది. హిట్లర్ నాజీల సీక్రెట్ వెపన్స్ ఇవే నంటూ కొన్ని ఫోటోలను ప్రచురించింది.వాటిలో అత్యాధునికమైన ఆయుధాలతో పాటు క్షణాల్లో విధ్వంసం సృష్టించి పరిసరాలను బూడిద చేసే బాంబులు కూడా ఉన్నాయి.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

ఇది హిట్లర్ దగ్గరున్న అత్యంత మోస్ట్ సీక్రెట్ పవర్ పుల్ బాంబు. ఈ స్మార్ట్ బాంబుకు పితామహుడుగా హిట్లర్ నే అభివర్ణిస్తారు.ఇది 700lbsరేడియో గైడెడ్ ను మోసుకెళ్లగలదు. ఈ బాంబు ఎటువంటి రక్షణ వ్యవస్థనైనా క్షణాల్లో భస్మీపటలం చేయగలదు.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

ఇదొక అత్యాధునిక హిట్లర్ అస్త్రం. ఇది ప్లయింగ్ వింగ్ బాంబు..ఇది గగనంలో 49వేల మీటర్ల ఎత్తులో ఎగురుతూ 2000 lbsరేడియో గైడెడ్ ని మోసుకెళ్లగలదు. భూమి మీద దీని వేగం సరాసరి 600 mph.ఈ బాంబర్ మొదటగా 1944లో ఎగిరింది. దీనికి రెండు టర్బోజెట్ ఇంజిన్లు,రెండు ఫిరంగులు అలాగే R4M రాకెట్లు అమర్చారు.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

ప్రపంచంలోనే ప్రత్యేకమైన స్టీల్ విమానం ఇదే. ఈ విమానమే నాజీలు మిలియన్ రీచ్ మార్క్ స్టీల్ విమానాలకు స్ఫూర్తినిచ్చింది. ఇది ఎలక్ట్రానిక్ మోటార్ తో గ్యాస్ బర్నర్ సాయంతో శత్రు సేన మీదకు దూసుకెళుతుంది.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

హిట్లర్ చేతిలో ఇదొక అత్యాధునిక ఆయుధం. ఇదొక సూక్ష్మ ట్యాంకు..దీని ద్వారా 133 పేలుడు పదార్ధాలు 220 220lbs వరకు తీసుకెళ్లవచ్చు. భారీ వాహనాలను అటాక్ చేయడానికి వాటిని పేల్చడానికి దీనిని ఉపయోగించారు. ఈ నాజీల ఆయుధమే ఇప్పుడు రేడియో కంట్రోల్ ఆయుధాల తయారీకి కేంద్రబిందువయింది.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

20వశతాబ్దంలోని శక్తివంతమైన నియంత హిట్లర్. ఆరేళ్లల్లో యూరప్‌లోని 80% భూభాగాన్ని హిట్లర్ గెలుచుకున్నాడు. అతన్ని యుద్ధ మేధావిగా చరిత్ర కారులు చెప్తారు. హిట్లర్ కొన్ని ముఖ్యమైన సైనిక పొరపాట్లని చేసి ఉండకపోతే, నేడు యూరప్, ప్రపంచంలోని అధిక భాగం బహుశా నాజీ పరిపాలనలో ఉండి ఉండేది.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

మొదటిసారిగా హిట్లర్, సోవియట్ యూనియన్‌ని గెలవలేకపోయాడు. ఇందుకు కారణం చలి కాలంలో ఆ దేశం మీదకి దాడి చేయడమే. చలికాలం జర్మన్ సైనికులకి ప్రతికూలం, సోవియట్ సైన్యానికి అనుకూలం అని తెలిసి కూడా తన సలహాదారుల సలహాలని పట్టించుకోక ఆ దాడిని ఆజ్ఞాపించాడు.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

మరో తప్పిదం సోవియట్ యూనియన్ మీదికి దాడి చేసే సైనికులకి ఇవ్వడానికి యంబికె 42 అనే ప్రపంచంలోని తొలి అసాల్ట్ సబ్‌మెషీన్ గన్ తయారీకి ముందు అంగీకరించినా తర్వాత వద్దని కోపావేశంలో నిర్ణయం తీసుకున్నాడు. జర్మన్ కమాండర్స్, హిట్లర్‌కి తెలియకుండా వాటిని తయారు చేయించినా వాటిని రద్దు చేశాడు.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

సోవియట్ సైనికులు లక్షల్లో ఉండడంతో ఒక్కో జర్మన్ సైనికుడు పదుల సంఖ్యలో సోవియట్ సైనికులని చంపడానికి ఈ రైఫిల్ ఎంతో అనుకూలంగా ఉండేది. తన తప్పుని గ్రహించి హిట్లర్ 1943 మధ్యలో దీన్ని పునరుద్ధరించాడు. కానీ అప్పటికే ఆలస్యమైపోయింది.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో యుద్ధ విమానాలు ప్రొపెల్లర్‌తో ఎగురుతుండేవి. ఎమ్-ఇ 262 అనే కోడ్‌నేమ్‌తో జర్మన్ వైమానిక శాస్తజ్ఞ్రులు మొదటిసారిగా జట్ పవర్డ్ ఎయిర్ క్రాఫ్ట్‌ని కనిపెట్టారు. 1943 మధ్యకల్లా ఇవి తయారవ్వాల్సి ఉంది. వాటిని ఇంటర్‌సెప్టర్ (రక్షణ విమానాలు)గా ఉపయోగించేవారు. కానీ హిట్లర్ వీటిని ఇష్టపడక ఫైటర్ బాంబర్ విమానాలనే ఉపయోగించి శత్రువులమీద బాంబింగ్ చేయాలని నిర్ణయించాడు.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

దాంతో జెట్ పవర్డ్ ఏర్ క్రాఫ్ట్స్ తయారీ నిలిచిపోయింది.చివరికి తన తప్పిదం తెలుసుకుని ఆగస్టు 1945 కల్లా వీటిని తయారుచేసారు. కానీ అప్పటికే మిత్రసైన్యాలు జెట్ యుద్ధ విమానాలను తయారుచేసుకుని, వేల సంఖ్యలో ఉపయోగించడంతో లుఫ్త్‌వాఫ్ (జర్మన్ వైమానిక దళం) వాటి ధాటికి తట్టుకోలేకపోయింది.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

హిట్లర్ ఎన్నడూ తన సైనికులు వెనక్కి తగ్గడాన్ని ఇష్టపడలేదు. ఆఖరి సైనికుడు జీవించి ఉన్నంత కాలం యుద్ధాన్ని కొనసాగించాలన్న ఆదర్శాన్ని నమ్మాడు. కానీ సైనిక పథకాలలో ఓ భాగం అవసరం వస్తే వెనక్కి తగ్గి మళ్లీ ముందుకు వెళ్లడం. దాన్ని పాటించకపోవడంతో సోవియట్ యూనియన్‌లోకి వెళ్లిన సైనికులు వెనక్కి రావడానికి అనుమతించలేదు. దాంతో సిక్త్స్ పాంజన్ ఆర్మీ మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

1945లో జర్మనీలోకి మిత్రసైన్యాలు ప్రవేశించాక తాము వెనక్కి వచ్చి రైన్ రివర్ మీది వంతెనని నాశనం చేస్తామని అనుమతి కోరితే అనుమతింలేదు. అందువల్ల రష్యన్స్ బెర్లిన్‌లో ప్రవేశించేసరికి కేవలం నలభై వేలమంది జర్మన్ సైనికులు మాత్రమే మిగిలి ఉన్నారు.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

నాజీ శాస్తజ్ఞ్రులు వి1, వి2 అనే కోడ్ నేమ్‌తో రాకెట్లని తయారు చేసారు. కానీ హిట్లర్ వాటిని లండన్ మీదికి పౌరులు బాధితులుగా ఉండేలా ప్రయోగించాడే తప్ప జర్మనీ సరిహద్దుల్లోని రష్యన్, అమెరికన్ సైనికుల మీదకి మాత్రం ప్రయోగించలేదు.అవి ఇంటికప్పుల మీద కూలి పేలేవి. ఫైరింజన్స్‌కి కొంత పని కలిగేది తప్ప సైనిక నష్టాన్ని కలిగించలేదు. వాటిని శత్రు సైనికుల మీద ప్రయోగించి ఉంటే వారిని నిలువరించే వారు.

హిట్లర్ సీక్రెట్ మిషన్‌ని తుక్కు సామాను కింద అమ్మేశారు

ఆగస్టు 1942 కల్లా జర్మన్స్‌ని నిరోధించడమే కాక రష్యా జర్మనీ మీదకి యుద్ధానికి తయారైంది. ఒక్కసారే ఫీల్డ్ మార్షల్ రండ్ స్టెట్ మాటని హిట్లర్ విన్నాడు. దాంతో అతని పథకం ప్రకారం ఆర్డెన్స్ అడవిగుండా మేజినాట్ లైన్‌ని జర్మన్ సైనికులు చుట్టుముట్టడంతో పోరాడకుండా ఫ్రాన్స్ లొంగిపోయింది. ఈ రోజుకీ ఫ్రాన్స్ పిరికితనం మీద జోక్స్ చెప్పుకుంటారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Device used in Nazi coding machine found for sale on eBay
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot