బెంగుళూరులో బయటపడ్డ 4 లక్షల ఏళ్ల నాటి మనుషుల ఆనవాళ్లు

Written By:

ఐటీ హబ్ గా , గార్డెన్ సిటీగా నీరాజనాలు అందుకుంటున్న బెంగుళూరు..నాలుగు లక్షల సంవత్సరాల క్రితమే మానవులకు నివాసంగా మారింది. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. మొట్టమొదటి సారిగా ఇక్కడ రాతియుగం నాటి ఆనవాళ్లు బయటపడ్డాయి. ప్రస్తుతం బెంగళూరు ఉన్న చోటనే రాతియుగం నాటి ఆనవాళ్లు లభ్యమైనట్టు మంగళూరు యూనివర్సిటీకి చెందిన పురాతత్వ శాస్త్రవేత్త, చరిత్రకారుడు డాక్టర్ కేబీ శివతారక్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెలలో కదిరెనహళ్లి సమీపంలో వాటర్ లీకేజీ మరమ్మతుల కోసం రోడ్డు తవ్వుతుండగా కొన్ని రాళ్లు బయటపడ్డాయి.

ఆ గుడిలో అణువణువు అనేక రహస్యాలమయం

బెంగుళూరులో బయటపడ్డ 4 లక్షల ఏళ్ల నాటి మనుషుల ఆనవాళ్లు

ఆ రాళ్లను పరీక్షల కోసం తీసుకెళ్లిన శివతారక్ అవి రాతియుగం నాటి మనుషుల పనిముట్లని నిర్ధారించుకున్నారు. గతంలో ఇటువంటి రాతి పనిముట్లనే తుముకూరు, మాండ్య, చిత్రదుర్గ జిల్లాల్లో ఆయన కనుగొన్నారు. శివతారక్ కనుగొన్న ఐదు పనిముట్లలో ఒకటి చేతి గొడ్డలి, చిన్న కత్తిలాంటి సాధనం, ఆకులా ఉండే పనిముట్టు, రాతి సుత్తి, చిన్న చేతి గొడ్డలి ఉన్నాయి. క్వార్ట్జ్ రాయితో తయారైన ఇవి 7-11 సెంటీమీటర్ల పొడవు 4-7 సెంటీమీటర్ల వెడల్పు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. అప్పట్లో వేట అనేది మనుషుల ప్రధాన వృత్తి కావడంతో ఈ ఆయుధాలను వివిధ రకాలుగా ఉపయోగించే వారని శివతారక్ తెలిపారు.

వేయి సంవత్సరాల ఆ గుడిలో అన్ని మిస్టరీ వింతలే

బెంగుళూరులో బయటపడ్డ 4 లక్షల ఏళ్ల నాటి మనుషుల ఆనవాళ్లు

ప్రస్తుతం బెంగళూరు ఉన్న ప్రాంతానికి రాతియుగం నాటి మానవులు వలస వచ్చి ఉండొచ్చని కర్ణాటక యూనివర్సిటీ ఆర్కియాలజీ రిటైర్డ్ ప్రొఫెసర్ రవికోరి శెట్టర్ పేర్కొన్నారు. బెంగళూరు చుట్టపక్కల ఎక్కడా పాతరాతి యుగం నాటి ఆనవాళ్లు లేవన్నారు. ప్రస్తుతం తవ్వకాల్లో లభ్యమైనా క్వార్ట్జ్ రాయి నిల్వలు ఈ ప్రాంతంలో లేవని, ఉత్తరాదితోపాటు తుముకూరు సమీపంలోని కిబ్బనహళ్లిలో మాత్రమే ఉన్నాయని వివరించారు. దీనిని బట్టి చూస్తే పాతరాతి యుగం మానవులు సంచార జీవితంలో భాగంగా బెంగళూరు వచ్చి ఉండవచ్చని రవి కోరి పేర్కొన్నారు.

వేల ఏళ్లుగా పరిశోధనలకు చిక్కని నగరం 17 ఏళ్ల బాలుడికి చిక్కింది

ఇప్పటికీ రహస్యంగానే మిగిలిన భూగర్భ స్థావరాలు ఏంటో తెలుసా

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

(Labyrinth Of Egypt)

ఈజిప్ట్ లో ఉన్న ఈ భూగర్భ ప్రపంచంలో ఎన్నో విజ్ఙానపరమైన అంశాలు దాగిఉన్నాయి. ఈ కోటల మీద చెక్కిన చిత్ర లిపి పురాతన ఈజిప్ట్ కు సంబంధించిన నాగరికతను ప్రతిబింబిస్తుంది. అయితే అది ఏంటనేది శాస్ర్తవేత్తలు ఇప్పటికీ కనుక్కోలేకపోతున్నారు. ఇది పవిత్రమైన మొసళ్లు నివసించడానికి నిర్మించిన ప్రదేశమని చెబుతుంటారు.12 మంది రాజులు నిర్మించారని చెబుతారు. అయితే ఈజిప్ట్ ప్రభుత్వం దీని పరిశోధనకు వ్యతిరేకత తెలుపుతోంది. దీన్ని లాబ్రినాధ్ గా పిలుస్తారు.

( Hidden Beneath Death Valley)

5000 సంవత్సరాల క్రితం నాటి అండర్ గ్రౌండ్ సిటీ ఇది. దీన్ని డెత్ వాల్లీ అని పిలుస్తారు. కాలిఫోర్నియా రాష్ట్రంలో ఉంది. ఈ ప్రదేశాన్ని సందర్శించిన వారికి అక్కడ మమ్మీలు, అలాగే ఆసక్తికరమైన పాత ఖళా ఖండాలు కనిపించాయని చెబుతారు. అయితే అది ఎవరిది అక్కడ ఎందుకు దీన్ని నిర్మించారనేది మాత్రం ఇప్పటికీ మిస్టరీలానే ఉంది.

( The Grand Canyon )

పురాతన నాగరికతకు సంబంధించిన నాగరికులు ఈ గ్రాండ్ కాన్యన్ లోని రహస్య భూగర్భ నగరంలో నివసిస్తున్నారని శాస్ర్తవేత్తల పరిశోధనలో తేలింది. అయితే అది ఇంకా రహస్యంగానే ఉంది. అసలు నిజంగానే పురాతన వాసులు ఉన్నారా లేరా అన్నది మాత్రం శాస్ర్తవేత్తలు ఇప్పటికీ తేల్చలేకపోతున్నారు.

( Underground City Of Derinkuyu)

టర్కీలో ఈ నగరాన్ని భూగర్భంలో కనుగొన్నారు. ఇతి అత్యంత అధునాతనంగా కట్టినట్టుగా కనిపిస్తుంది. అక్కడ నిర్మాణం చూస్తే ఎవరైనా ఔరా అనాల్సిందే. అయితే అంతటి అధునాతన నగరాన్ని ఎవరు నిర్మించారన్నది మాత్రం రహస్యంగానే మిగిలింది.

( Ancient Lost City Found Beneath Missouri)

మిస్సోరిలోని పురాతన నగరం ఇది. అక్కడ రాక్షసులు నివసించారని చెబుతుంటారు. శాస్ర్తవేత్తల పరివోధనలతో అక్కడ పెద్ద పెద్ద మనుషుల ఎముకలు బయటపడ్డాయి. అయితే వాళ్లెవరనేది మాత్రం మిస్టరీగానే మిగిలింది.

( Mystery Of Mt. Tsurugi Deepens)

పురాతన కాలంనాటి ఓ రహస్య స్థావరాన్ని జపాన్ లో కనుగొన్నారు. అది అంతా పర్వతాలతో నిండి ఉంది. అద్భుతమైన దేవాలయాలతో అది కనిపించింది. శాస్ర్తవేత్తలు మూడేళ్లపాటు పరిశోధనలు చేసినా అది ఏంటనేది మాత్రం కనుక్కోలేకపోయారు.

The Vast Taklamakan Desert

ఈ ప్రదేశంలోకి నీవు ఓ సారి ఎంటరయితే బయటకు రావడానికి నీకు దారి కనిపించదు. చాలా కాలం క్రితం అక్కడ దేవాలయాలు ఉన్నాయి. అయితే అవన్నీ ఇసుకతోనే నిర్మించారని శాస్ర్తవేత్తలు చెబుతున్నారు. మొత్తం ఎడారిలాగా ఉంటుంది. అందుకే దీన్ని సీ ఆఫ్ డెత్ అని కూడా పిలుస్తారు. ఇది చైనాలో ఉంది.

Hyperborea Or Atlantis Ruins

ఇది రష్యాలో కనుగొన్నారు. భూగర్భంలో అంతా సరస్సులాగా ఉంటుంది. దీన్ని అక్కడి వాసులు ఓ పవిత్ర భూమిగా చెబుతుంటారు. అక్కడ కనుగొన్న సరస్సును కూడా చాలా పవిత్రమైనదిగా చూస్తుంటారు. మరి ఎవరు దీన్ని నిర్మించారనేది మాత్రం రహస్యమే.

Sioux Indians White Horse

ఇది మన ఇండియా స్టోరి. ఈ భారీ గుహల నుంచి ఓ పురాతన మనిషి బయటకు వచ్చాడని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అతని తెల్లని శరీరంతో ఆ పురాతన గుహల నుండి బయటకు వెళ్లి పోయాడని వారంటున్నారు.మరి ఎవరతను అనేది మాత్రం రహస్యంగానే ఉండిపోయింది.

Underground Pyramid In Italy

ఇటలీలో భూగర్భంలో ఈ పెద్ద పిరమిడ్ ని శాస్ర్తవేత్తలు కనుగొన్నారు. అయితే ఇది 6th- 4th centuries BC మధ్య కాలంలోనిదని శాస్ర్తవేత్తలు నిర్ధారించారు.అయితే ఎవరు దీన్ని అక్కడ పెట్టారు. ఎలా తీసుకెళ్లారన్నది మాత్రం సస్పన్స్ గానే ఉంది.

( Three-Eyed Lama’)

టిబెట్ లోని భూగర్భ ప్రదేశంలో ఇలా మెట్లతో కూడిన మందిరాలు చాలానే బయటపడ్డాయి. అక్కడి గుహలు అన్ని అత్యంత సుందరంగా దేవాలయాలతో కళకళలాడేలా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. ఇక్కడ లభించిన ఆధారాల ప్రకారం వీరు గ్రహాంతర వాసులకు చెందిన మూలాలుగా శాస్ర్తవేత్తలు నిర్ధారించారు. ఇక అక్కడనుంచి బండి ముందుకు సాగలేదు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Man existed in Bengaluru 4 lakh years ago Archaeologist
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot