Home
Mobile

3 రోజులు.. కోటీ 30 లక్షల ఫోన్లు

స్మార్ట్ ఫోన్ల విభాగంలోయాపిల్ ఉత్పత్తి ఐ ఫోన్ కు ఉన్నంత డిమాండ్ మరే ఇతర మొబైల్ కు లేదనే చెప్పాలి. ఐఫోన్ పేరిట ఇప్పటిదాకా యాపిల్ విడుదల చేసిన అన్ని మోడళ్లకు విశ్వవ్యాప్లంగా ఊహించని ఆదరణ లభించింది. తాజాగా ఈ నెల 9న సరికొత్త ఫీచర్లతో యాపిల్ ఐపోన్ 6ఎస్ ,అలాగే ఐ ఫోన్ 6ఎస్ ప్లస్ మోడళ్లను మార్కెట్లోకి విడుదల చేసింది. ఇంకా నెల కూడా గడవలేదు. అప్పుడే ఈ మోడళ్లు 1.30 కోట్ల యూనిట్ల దాకా అమ్ముడుపోయాయి. ఐఫోన్ సీరిస్ లో గత మోడల్ ఐ ఫోన్ 6 కోటి మేర యూనిట్ల విక్రయం కాగా ఈ రికార్డును ఐ ఫోన్ 6ఎస్ ఇప్పటికే అధిగమించేసింది.ఇంకా భారత్ తదితర దేశాల్లో ఐపోన్ తాజా మోడల్ రిలీజ్ కానే లేదు.

Read more:యాపిల్‌పై నెటిజన్లకు ఇంత కోపముందా..

వచ్చే నెల 16న భారత్ లో ఐఫోన్ 6ఎస్ మోడళ్లు అందుబాటులోకి వస్తాయి. ఇక్కడి సేల్స్ ను కూడా కలుపుకుంటే ఐఫోన్ 6ఎస్ చెరిపేయలేని రికార్డులను సొంతం చేసుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. భారత్ లోకి ఐఫోన్ లేటెస్ట్ మోడల్స్ తొందరగా రావడం ఇదే తొలిసారి. ప్రపంచ మార్కెట్లో ఐ ఫోన్ లేటెస్ట్ మోడల్స్ విడుదలయిన నెల రోజులకే భారత మార్కెట్లోకి రానున్నాయి. అయితే భారత్ లో ఐ ఫోన్ 6 ఎస్ .ప్లస్ ధరల గురించి ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Read more: యాపిల్‌ హ్యాకర్ల చేతిలో పడింది

ఐ ఫోన్ 6 ఎస్ ధర సుమారు 60 వేల రూపాయలు అలాగే ప్లస్ ధర 68 వేల రూపాయలు ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ ఫోన్లలో కొత్త త్రీడి టచ్ డిస్ ప్లే టెక్నాలజీ, 2 జీబి రామ్ తో ఏ 9 ప్రాసెసర్,ఐవోఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నాయి. సంస్థ చిరకాల ప్రత్యర్థి సామ్‌సంగ్‌కు చెందిన గెలాక్సీ నోట్5, గెలాక్సీ ఎస్6 ఎడ్జ్ ప్లస్‌కు పోటీగా ఆపిల్ ఈ ఫోన్లను లాంచ్ చేసింది.దీని ఫీచర్స్ పై ఓ లుక్కేద్దాం.

Read more: యాపిల్ స్మార్ట్‌వాచీ యువకుడి ప్రాణాలు కాపాడింది

మొబైల్ ధరలు

మొబైల్ ధరలు

యుఎస్ లో మొబైల్స్‌లో 6ఎస్‌ మోడల్‌ను 16, 64,128 జీబీ కెపాసిటీ ఇచ్చింది. 16 జీబీ 649 డాలర్లు, 64 జీబీ 749 డాలర్లు, 128 జీబీ 849 డాలర్లును ధరగా కంపెనీ నిర్ణయించింది.

 

 

16, 64, 128జీబీ కెపాసిటీ

16, 64, 128జీబీ కెపాసిటీ

16, 64, 128జీబీ కెపాసిటీ ఇక, 6ఎస్‌ ప్లస్‌ కూడా 16, 64, 128జీబీ కెపాసిటీలతో రిలీజ్‌ చేసింది. వీటి ధరలను 749-949 డాలర్లుగా కంపెనీ తెలిపింది.

 

 

ఫీచర్ల విషయానికి వస్తే..

ఫీచర్ల విషయానికి వస్తే..

ఫీచర్ల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు 1 జీబీ ర్యామ్‌తో వచ్చిన ఐఫోన్‌ ఇక నుంచి 2 జీబీ ర్యామ్‌తో మరింత పవర్‌ పుల్‌గా పనిచేయనున్నాయ్. గేమింగ్‌ ప్రియుల కోసం హైఎండ్ గ్రాఫిక్స్, పుల్ హెచ్‌డి, హై రెజిల్యూషన్‌ డిస్‌ప్లే ప్రత్యేక ఆకర్షణ.

 

 

కొత్తగా 3డీ టచ్

కొత్తగా 3డీ టచ్

6ఎస్‌ 4.7 అంగుళాల డిస్‌ప్లేతో వస్తే.. 6ఎస్‌ప్లస్‌ 5.5 అంగుళాలు. రెటీనా డిస్‌ప్లేతో 12 మెగాపిక్సల్‌ రియర్‌ కెమెరా, 5 మెగాపిక్సల్‌ ఫ్రంట్‌ ఫేసింగ్‌ కెమెరా ఇచ్చింది. ఇక కొత్తగా త్రీడీ టచ్‌ అందించింది

 

 

కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్

కొత్తగా యాడ్ అయిన ఫీచర్స్

లాంచ్ రోజు 3D టచ్ ను వివరిస్తూ మొదలు పెట్టింది ఆపిల్ బృందం. ఇది ఐ ఫోన్ 6s లో ప్రవేశపెడతున్న ఫోర్స్ టచ్ టెక్నాలజీ. నార్మల్ గా కాకుండా ఒక 10ms మిని టాప్ అండ్ 15ms ఫుల్ టాప్ చేస్తే టచ్ inputs రెగ్యులర్ గా చేసే పనులు కాకుండా వేరే ఫలితాలను ఇస్తాయి ఫోనులో. ఇది యాప్ ఓపెన్ చేయకుండానే యాప్ లో పనులు చేస్తుంది. అంటే సేల్ఫీ తీసుకోవాలనుకున్నప్పుడు వెంటనే తీయటానికి ఉపయోగపడుతుంది.

హార్డ్ వేర్ విషయానికి వస్తే..

హార్డ్ వేర్ విషయానికి వస్తే..

హార్డ్ వేర్ విషయానికి వస్తే.. 3rd Gen A9 డెస్క్ టాప్ క్లాస్ 64 బిట్ ప్రొసెసర్ ఉంది. ఇది A8 ప్రొసెసర్ కన్నా 70% ఫాస్ట్ గా అండ్ 90% ఫాస్ట్ గ్రాఫిక్స్ తో రన్ అవుతుంది. దీనిలో M9 మోషన్ కో - ప్రొసెసర్ నిరంతరం రన్ అవుతుంటుంది. మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు యాప్స్ పెర్ఫార్మన్స్ ను స్ట్రీమ్ లైన్ చేస్తుంది.

 

 

12 మెగా పిక్సెల్

12 మెగా పిక్సెల్

12 మెగా పిక్సెల్ iSight కెమేరా ఫాస్ట్ గా ఫోకస్ చేస్తుంది. deep trench isolation కూడా ఉంది. ఇది ఓవర్ ఆల్ గా ఇమేజ్ లో noise తీయటానికి. 4K వీడియో రికార్డింగ్ ఉంది. ఫ్రంట్ కెమేరా 5MP కు అప్ గ్రేడ్ అయ్యింది.

 

 

ఇమేజ్ లైవ్ వీడియో లా కన్వర్ట్

ఇమేజ్ లైవ్ వీడియో లా కన్వర్ట్

ఫోటో తీసేటప్పుడు లాంగ్ ప్రెస్ చేసి capture చేస్తే ఇమేజ్ లైవ్ వీడియో లా కన్వర్ట్ అవుతుంది. ఇది 3D టచ్ ఫోటోగ్రఫీ అని చెబుతుంది ఆపిల్. కెమేరా ఫ్లాష్ కు రెటినా ట్యాగ్ కూడా ఉంది. ఇది true టోన్ ఫ్లాష్ కన్నా బెటర్ గా ఉంటుంది.

 

 

గొరిల్లా గ్లాస్ వలె కొత్త 7000 సిరిస్ గ్లాస్

గొరిల్లా గ్లాస్ వలె కొత్త 7000 సిరిస్ గ్లాస్

iphone 6S లో 23 LTE బాండ్స్ డబుల్ స్పీడ్ తో వర్క్ అవుతాయి. దీనికి కూడా ఆండ్రాయిడ్ ఫోనుల్లో ఉండే గొరిల్లా గ్లాస్ వలె కొత్త 7000 సిరిస్ గ్లాస్ ఉంది. దీనిలో అల్యూమినియం యూస్ చేసినట్లు చెబుతుంది ఆపిల్.

 

 

దీనికి సంబంధించిన వీడియో

యాపిల్ ఫోన్ పీచర్స్ ను తెలియజేస్తూ లాంచ్ రోజు యాపిల్ టీమ్ రిలీజ్ చేసిన వీడియో

 

Best Mobiles in India

English summary
Here Write Apple India to launch iPhone 6S, 6S Plus on October 16 
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X