ఆ ఫోన్‌ వాటర్ ఫ్రూఫంటూ కష్టమర్లను శాంసంగ్ మోసం చేసింది..

Written By:

దిగ్గజ మొబైల్ సంస్థ శాంసంగ్ తన వాటర్ ఫ్రూప్ స్పెషల్ ఫీచర్ ఫోన్ తో కష్టమర్లను మోసం చేసిందా అంటే అవుననే అంటోంది ఓ సంస్థ. వాటర్ ప్రూఫ్ స్పెషల్ ఫీచర్ అంటూ ప్రకటన ద్వారా ఊదర గొట్టి ఫ్లాగ్ షిప్ ఫోన్ల మొబైల్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన హై ఎండ్ కేటగిరీ గెలాక్సీ ఎస్ 7, ఎస్ 7 ఎడ్జ్ , యాక్టివ్ లలో సంస్థ చెబుతున్నట్టుగా వాటర్ ప్రూఫ్ సౌకర్యం లేదని తేలిపోయింది. ఉత్పత్తుల టెస్టింగ్స్ లో పేరు గడించిన సంస్థ కన్జ్యూమర్స్ అనే స్వచ్ఛంద సంస్థ తమ పరీక్షలలో వాటి ప్రామాణికత నిలబడలేదని స్పష్టం చేసింది. అందుకే తాము ఈ ఫోన్లను రికమెండ్ చేయలేమని పేర్కొంది.

ఇంటర్నెట్‌‌ని వణికించిన ఈ ఫోటోలు నిజమైనవేనా..?

ఆ ఫోన్‌ వాటర్ ఫ్రూఫంటూ కష్టమర్లను శాంసంగ్ మోసం చేసింది..

అమెరికాలో ఎటి అండ్ టీలో మాత్రమే అందుబాటులోఉన్న ఎస్ 7యాక్టివ్ వాటర్ రిసిస్టెంట్ కాదని (జలనిరోధితం) చెప్పింది. అలాగే ఎస్7 ఎడ్జ్, యాక్టివ్ పై చేసిన పరీక్షల్లో కూడా వాటర్ ప్రూఫ్ నిరూపితం కాలేదని తెలిపింది. ఈ స్మార్ట్ ఫోన్ ను ఒక అరగంట నీళ్లలో ఉంచినపుడు యాక్టివ్ ఫోన్ స్క్రీన్ గ్రీన్ , పసుపు రంగుల్లో మారిపోయిందనీ, టచ్ పనిచేయలేదని తమ రిపోర్టులో తేలిందన్నారు. అంతేకాదు కెమెరా లెన్సెస్ మీద బుడగలుకూడా కనిపించాయని... రెండు ఫోన్ల పరీక్షల్లోనూ ఇదే ఫలితం వచ్చిందని సంస్థ డైరెక్టర్ మారియా రెక్రిక్ తెలిపారు.

ఫీచర్లు ఒకటే.. ఆ ఫోన్‌ల మధ్య తేడా మాత్రం రూ.5,000

ఆ ఫోన్‌ వాటర్ ఫ్రూఫంటూ కష్టమర్లను శాంసంగ్ మోసం చేసింది..

దీనిపై స్పందించిన శాంసంగ్ చాలా తక్కువ ఫిర్యాదులు మాత్రమే తమకు అందాయని తెలిపింది. ఈ విషయంలో కన్జ్యూమర్ రిపోర్ట్స్ ను పరిశీలిస్తున్నామని, దానితో టచ్ లో ఉన్నట్టు చెప్పింది. కాగా 5 అడుగుల నీటిలో అరగంట సేపు ఉన్నా తట్టుకునే సామర్థ్యం తమ ఫోన్లకు ఉందని శాంసంగ్ యూజర్లకు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఆ గ్రహంలో నిత్యం ఉషోదయమే..రాత్రి అనేది ఉండదు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

5.5 అంగుళాల క్వాడ్ హైడెఫినిషన్ కర్వుడ్ ఎడ్జ్ డిస్‌ప్లే (రిసల్యూషన్ సామర్థ్యం 2560×1440పిక్సల్స్), 534 పీపీఐ.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ రెండు ప్రాసెసర్ వేరియంట్‌లలో లభ్యంకానుంది. మొదటి వేరియంట్ స్నాప్ డ్రాగన్ 820 ప్రాసెసర్ కాగా రెండవ వేరియంట్ ఆక్టా కోర్ ఎక్సినోస్ 8 ఆక్టా 8890 ప్రాసెసర్,

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్‌లో హైబ్రీడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌లను పొందుపరిచారు. 4జీబి ర్యామ్, ఇంటర్నల్ మెమరీ ఆప్షన్స్ (32జీబి, 64జీబి), మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరినీ 200జీబి వరకు విస్తరించుకునే అవకాశం.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

డ్యుయల్ పిక్సల్ 12 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా (ప్రత్యేకతలు: ఎల్ఈడి ఫ్లాష్, ఎఫ్ 1.7 అపెర్చర్, స్మార్ట్ ఓఐఎస్), 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఐపీ68 రేటింగ్‌తో వస్తోంది. వాటర్ ఇంకా డస్ట్ ప్రమాదాలను గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ సమర్థవంతంగా తట్టుకోగలదు.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

ఆపరేటింగ్ సిస్టం గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మల్లో ఆపరేటింగ్ సిస్టం పై రన్ అవుతుంది. యాప్ పర్మిషన్, గూగుల్ నౌ ఆన్ టాప్, డోజ్ మోడ్, ర్యామ్ మేనేజర్, ఆటో బ్యాకప్, బ్యాటరీ లైఫ్, ఆటో హ్యాండ్లింగ్ యాప్స్, ఆండ్రాయిడ్ పే వంటి ప్రత్యేక ఫీచర్లను ఎస్7 ఎడ్జ్ అందిస్తుంది.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ ఫోన్ కు "Always-On Display" ఫీచర్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ ఫీచర్ ఫోన్ స్ర్కీన్ పై ఎఫ్పుడు ఆన్ అయ్యే ఉంటుంది. క్లాక్, నోటిఫికేషన్స్, క్యాలెండర్‌లను ఈ ఫీచర్ డిస్‌ప్లే సూచిస్తుంది. తద్వారా చీటికి మాటికి పోన్‌ను ఓపెన్ చేయకుండా బ్యాటరీ ఆదా చేయవచ్చు.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్, 4జీ ఎల్టీఈ, వై-ఫై 802.11, బ్లూటూత్, జీపీఎస్, గ్లోనాస్, వంటి కనెక్టువిటీ ఆప్షన్‌లను సపోర్ట్ చేస్తుంది.

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్‌లోని 10 ప్రత్యేకమైన ఫీచర్లు

గెలాక్సీ ఎస్7 ఎడ్జ్ 3600 ఎమ్ఏహెచ్ బ్యాటరీతో వస్తోంది. వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

English summary
Here Write Consumer Reports Samsung phone not actually water resistant
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot