6జిబి ర్యామ్‌తో వస్తున్న కూల్ ప్లే 6

Written By:

కూల్‌ప్యాడ్ అభిమానుల కోసం ఆ కంపెనీ నుంచి సరికొత్త ఫోన్ రానుంది. కూల్‌ప్యాడ్ కూల్ ప్లే పేరుతో వస్తున్న ఈ ఫోన్ 6 జిబి ర్యామ్ తో రానుంది. కంపెనీ ఈ నెల 16వ తేదీన చైనా మార్కెట్‌లో విడుదల చేయనుంది. ఆ తరువాత ఇతర దేశాల్లోనూ ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. భారత్‌లో ఈ ఫోన్ రూ.14వేల ధరకు లభ్యం కానుంది.

నార్త్ కొరియాలో ఏం జరుగుతోంది..?

6జిబి ర్యామ్‌తో వస్తున్న కూల్ ప్లే 6

ఫీచర్లు కూడా ధరకు తగ్గట్టుగానే ఉన్నాయి. కూల్ ప్యాడ్ ఫీచర్ల విషయానికొస్తే 5.5 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే తో పాటు 1080 x 1920 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్ తో ఫోన్ రానుంది. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 653 ప్రాసెసర్ మీద ఫోన్ ఆపరేట్ అవుతుంది.

స్మార్ట్‌ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ సరికొత్త ఆఫర్లు !

6జిబి ర్యామ్‌తో వస్తున్న కూల్ ప్లే 6

ర్యామ్ విషయానికొస్తే 6 జీబీ ర్యామ్ తో ఫోన్ సరికొత్తగా రానుంది. 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ని కంపెనీ ఇస్తోంది. కెమెరా విషయానికొస్తే 13, 13 డ్యుయల్ రియర్ కెమెరాలతో పాటు సెల్ఫీ అభిమానుల కోసం 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. ఈ ఫోన్ కు డ్యుయల్ సిమ్ ను పొందుపరిచారు. బ్యాటరీ విషయానికొస్తే 4060 mAh బ్యాటరీ.

షియోమికి దిమ్మతిరిగేలా మోటో కొత్త ఫోన్లు !

6జిబి ర్యామ్‌తో వస్తున్న కూల్ ప్లే 6

ఆండ్రాయిడ్ 7.1 నూగట్ మీద రన్ అవుతుంది. 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అదనపు ఫీచర్లు.

English summary
Coolpad Cool Play 6 with 13-megapixel dual rear cameras, 6GB of RAM launched: Specifications, features read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot