ఇంటెక్స్ ఐరిస్ట్ స్మార్ట్‌వాచ్@రూ.11,999

దేశవాళీ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ ఇంటెక్స్ స్మార్ట్‌వాచ్‌ల విభాగంలోకి ప్రవేశించింది. ఐరిస్ట్ (IRist) పేరుతో తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ స్మార్ట్‌వాచ్‌ను ఇంటెక్స్ టెక్నాలజీస్ గురువారం ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. వాచ్ ధర రూ.11,999. ప్రముఖ రిటైలర్ ఈబే (ebay) ఈ వాచ్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. బ్లాక్, పింక్ ఇంకా ఆరెంజ్ కలర్ వేరియంట్‌లలో ఐరిస్ట్ స్మార్ట్‌వాచ్‌ను సొంతం చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టం పై స్పందించే ఈ ఐరిస్ట్ వాచ్‌ను ముందుగా ఇంటెక్స్ షాంఘై వేదికగా బుధవారం నిర్వహించిన మొబైల్ వరల్డ్ కాంగ్రెస్‌లో ప్రకటించటం జరిగింది.

Read More: ఈ ఫోన్ పగలదు, తడవదు!
ఇన్-బుల్ట్ 3జీ సిమ్ సపోర్ట్‌తో వస్తోన్న ఐరిస్ట్ స్మార్ట్‌వాచ్ ద్వారా వినియోగదారుడు కాల్స్ చేసుకోవచ్చు, రిసీవ్ చేసుకోవచ్చు. స్మార్ట్‌ఫోన్‌కు ఐరిస్ స్మార్ట్‌వాచ్‌ను కనెక్ట్ చేసుకునేందకు ఐకనెక్ట్ అనే యాప్ ఇన్‌స్టాల్ చేసుకోవల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌వాచ్ ద్వారా ఇంటర్నెట్ బ్రౌజ్ చేసుకోవచ్చు. వాచ్‌లో నిక్షిప్తం చేసిన వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ ద్వారా ఈమెయిల్స్‌తో పాటు మెసేజ్‌లను పంపుకోవచ్చు. వాయిస్ కమాండ్‌లను ఉపయోగించి యాప్స్‌ను ఓపెన్ లేదా క్లోజ్ చేయవచ్చు. వాచ్ ద్వారా మ్యూజిక్ ఇంకా కాల్స్ మాట్లాడుకునేందుకు బ్లూటూత్ హెడ్‌సెట్‌ను కంపెనీ అందిస్తోంది.

Read More: 100 కోట్ల చరిత్ర...
ఐరిస్ట్ వాచ్ స్పెఫికేషన్లు:
1.56 అంగళాల ఓఎల్ఈడి డిస్‌ప్లే (రిసల్యూషన్ 240×240పిక్సల్స్), ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ 4.4.2 ఆపరేటింగ్ సిస్టం, 1.2గిగాహెర్ట్జ్ మీడియాటెక్ ఎంటీ6572 డ్యుయల్ కోర్ ప్రాసెసర్, 512 ఎంబి ర్యామ్, 4జీబి ఇంటర్నల్ ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా వాచ్ స్టోరేజ్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 3జీ సపోర్ట్‌తో కూడిన సింగిల్ - సిమ్ కార్డ్ సపోర్ట్, 5 మెగా పిక్సల్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (బ్లూటూత్ 4.0, వై-ఫై, యూఎస్బీ, జీపీఎస్), 600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ (240 నిమిషాల టాక్‌టైమ్, 200 గంటల స్టాండ్‌బై టైమ్). వాచ్ బరువు 83 గ్రాములు, చట్టుకొలత 44x44x14 మిల్లీమీటర్లు.
Read More: చాట్‌సిమ్‌తో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఫ్రీ!


Click it and Unblock the Notifications








