మొదటి ఫ్లాష్ సేల్‌లో లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు..

By Hazarath
|

భారత ఈ కామర్స్ ఫ్లాట్‌పాంలోకి అడుగుపెట్టిన లీమాల్ అంతే వేగంతో ముందుకు దూసుకుపోతోంది. ఇటీవలే కంపెనీ లాంచ్ చేసిన తమ స్మార్ట్‌ఫోన్లు లీ2, లీ మ్యాక్స్2లకు భారీ ఆదరణ లభిస్తోందని కంపెనీ తెలిపింది. తమ మొదటి ఫ్లాష్ సేల్‌లో లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయని లీ మెయిల్ .కామ్ వెల్లడించింది. జూన్ 28 నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటకు ముగిస్తే..అమ్మకాలు అదేరోజు 12 గం.నుంచి మధ్యాహ్నం 2 గంటల వద్ద ప్రారంభిస్తామని ప్రకటించింది.

 

Read more : లీ 1ఎస్ రికార్డ్ సేల్, 31 సెకన్లలో 2,20,000 ఫోన్‌లు

lee

అలాగే భారత ఆన్‌లైన్ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌టీవీలు, రివర్స్ ఇన్-ఇయర్ హెడ్ ఫోన్లు, ఆల్ మెటల్ ఇయర్ ఫోన్లు, బ్లూటూత్ హెడ్ ఫోన్లు, బ్లూటూత్ స్పీకర్లు తదితర డివైస్ ల అమ్మకాలు లీఇకో ఈ-కామర్స్ ప్లాట్ ఫామ్ లీ మాల్ లో ప్రవేశపెట్టింది. అమెరికాలో ఈ ఏడాది జనవరిలో లీమాల్ లో రిజిస్టర్అయిన 30 వేలమందితో కలిపి మొత్తం రిజిస్ట్రేషన్ల సంఖ్య 60వేలకు చేరింది.

Read more: లీ 1ఎస్.. నెంబర్ వన్!

lee

అలాగే హాంకాంగ్ లో 12,423మంది తన సూపర్ ఫోన్ల కోసం పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపింది. 2013లో మొదటిసారి చైనాలో లీ మాల్ ప్రారంభించగా ప్రస్తుతం అమెరికా, హాంగ్ కాంగ్ లో లీమాల్ ప్లాట్ ఫామ్ తో భారీ విజయాన్ని సాధించింది. భారత్ లో జూన్ 8న మెగా ఈవెంట్ తో దేశ రాజధాని ఢిల్లీలో ఈ ప్లాట్ ఫామ్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే.

Read more : LeEco కంపెనీ నుంచి మరో 3 సూపర్ ఫోన్స్

లీ 2 ఫోన్లు పాపులర్ ఎందుకు అయ్యాయో 10 కారణాలు మీ ముందుంచుతున్నాం వాటిపై ఓ స్మార్ట్ లుక్కేయండి.

1

1

వర్కింగ్ ఫ్రొపెషనల్స్ స్మార్ట్ గా ఉండే స్మార్ట్ ఫోన్ల కోసం చూస్తుంటారు. ఇలాంటి వారు ఈ లీ స్మార్ట్ ఫోన్ కొనేందుకు చాలా ఇష్టపడతారు కూడా. ఇతర ఫోన్లతో పోలిస్తే ఈ పోన్ ధర తక్కువగా ఉండటం అంతే కాకుండా అత్యాధునిక ఫీచర్లు ఉండటం కూడా వారికి బాగా కలిసివచ్చింది.

2

2

ఈ ఫోన్ బ్యాటరీలైప్ కూడా ఎక్కువ మన్నిక కావడంతో అందరూ దీని వైపే దృష్టి పెట్టారు. ఈ ఫోన్ లో యాప్స్ ని ఎప్పుడు కావాలంటే అప్పుడు షట్ డౌన్ చేసే ఆప్షన్ ఉండటంతో అది కూడా ప్లస్ పాయింట్ అయింది. క్విక్ ఛార్జింగ్ కూడా దీనికి తోడయింది.

3
 

3

ఫోన్ బ్రైట్ నెస్ కూడా ఇతర ఫోన్ల కన్నా ధీటుగా వస్తుండటంతో అది కూడా ప్లస్ పాయింట్ అయింది.హైఎండ్ ఫోన్‌లలో మాత్రమే ఆఫర్ చేసే బీజిల్ లెస్ డిజైన్, ఫుల్ ఫ్లోటింగ్ గ్లాస్ వంటి క్లాసికల్ ఫీచర్లను లీ 1ఎస్ ఫోన్‌లో మీరు చూడొచ్చు. పూర్తి మెటల్ బాడీతో వచ్చే ఫోన్ లు ఎంత వేగంగా హీట్ అవుతాయో అంతే వేగంగా కూల్ అవుతాయి. అదే విధంగా సిగ్నల్ రిసీవింగ్ కూడా వేగంగా ఉంటుంది.

4

4

ప్రపంచపు మొట్టమొదటి మిర్రర్ సర్‌ఫేస్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది. 5.5 అంగుళాల FHD డిస్‌ప్లే, హీలియో ఎక్స్ 10 టర్బో ప్రాసెసర్, 3జీబి ర్యామ్, 32జీబి ఇంటర్నల్ మెమరీ, డ్యుయల్ సిమ్ కార్డ్‌స్లాట్, 4జీ ఎల్టీఈ సపోర్ట్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, క్విక్ ఛార్జింగ్ టెక్నాలజీ వంటి అంశాలు లీ1ఎస్ సామర్ధ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయి.

5

5

వినియోగదారులకు మరింత భరోసానిస్తూ లీఇకో దేశవ్యాప్తంగా 555 సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేసింది. ఈ సెంటర్లు 24*7 టోల్ ఫ్రీ సేవలను అందిస్తాయి. కాబట్టి మీరు నిశ్చింతగా లీఇకో ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు. 10 లాంగ్వేజ్ ల్లో మీకు సర్వీసు అందుబాటులో ఉంటుంది.

6

6

మీరు అత్యవసర మైన మీటింగ్ లో ఉన్నప్పుడు పోన్ మిమ్మల్ని డిస్ట్రబ్ చేయకుండా ఉండేందుకు ఈ ఫోన్లో కొన్ని ఫీచర్స్ ఉన్నాయి. ఆ ఫీచర్స్ తో మీరు ఆటోమేటిగ్గా మేసెజ్ లను అలాగే కాల్స్ ను డిస్ కనెక్ట్ చేయవచ్చు.

7

7

ఈ ఫోన్ లో కొత్తగా పిన్ టాప్ బటన్ చేర్చారు. మీరు ఆఫీసులో పనిచేస్తున్నపుడు మీకు ఎటువంటి స్పామ్ మెయిల్స్ రాకుండా ఈ బటన్ ద్వారా అడ్డుకోవచ్చు.

8

8

స్టూడెంట్స్ కు ఈ ఫోన్ తో చాలానే ఎంటర్ టైన్ మెంట్ దొరుకుతుంది. అలాగే నాలెడ్జికి సంబంధించిన అంశాలు ఈ ఫోన్ ద్వారా వారు పొందవచ్చు. సెల్పీలు ఇష్టపడేవారు ఈ ఫోన్ తో ట్రావెలింగ్ సమయంలో దర్జాగా ఫోటోలు దిగవచ్చు. పెద్ద డిస్ ప్లే తో ఆకట్టుకునే విధంగా మీ ఫోటోలను చూపెడుతుంది.

9

9

ఇది 2004 నవంబర్ లో లీకో కంపెనీని స్థాపించారు. దీని ప్రధాన కేంద్రం చైనాలోని బీజింగ్ నగరంలో ఉంది. స్మార్ట్ పోన్లనే కాకుండా ఇంటర్నెట్ టీవీ, వీడియో ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ,స్మార్ట్ డివైసెస్, మొదలుగు ఉత్పత్తులను కూడా అందిస్తోంది.

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

గిజ్‌బాట్ పేజీని లైక్ చేయండి

టెక్నాలజీ గురించి మీరు ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్‌డేట్ పొందాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి.

https://www.facebook.com/GizBotTelugu/

Best Mobiles in India

English summary
Here Write LeMall receives 1 lakh registrations for first flash sale in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X