లెనోవో నుంచి మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లు
లెనోవో మూడు సరికొత్త స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేసింది. లెనోవో ఏ1000, లెనోవో ఏ6000 షాట్, లెనోవో కే3 నోట్ మ్యూజిక్ మోడల్స్‌లో ఈ మూడు హ్యాండ్‌సెట్‌లు ఆక్టోబర్ చివరి వారం నుంచి దేశంలోని రిటైల్ అవుట్‌లెట్‌లలో లభ్యమవుతాయి.

Read More : ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తో 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్‌లు
Lenovo A1000 స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..
4 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 480x 800పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, స్ప్రెడ్‌ట్రమ్ ఎస్‌సీ7731 క్వాడ్‌కోర్ సాక్ (క్లాక్ వేగం 1.3గిగాహెర్ట్జ్), అడ్రినో మెయిల్400 ఎంపీ2 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 1జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 5 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, వీజీఏ ప్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్ 3జీ, వై-ఫై, బ్లూటూత్ 4.0). 2050 ఎమ్ఏహెచ్ బ్యాటరీ. ధర రూ.4,999.

Read More : హానర్ 7 : 10 స్టన్నింగ్ ఫీచర్స్
ప్రత్యేకమైన కెమరా వ్యవస్థతో లభ్యం కానున్న Lenovo A6000 Shot స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..
5 అంగుళాల హైడెఫినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్720x 1280పిక్సల్స్), ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ అవుట్ ఆఫ్ ద బాక్స్, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 410 క్వాడ్‌కోర్ సాక్ (క్లాక్ వేగం 1.2గిగాహెర్ట్జ్), అడ్రినో 306 గ్రాఫిక్ ప్రాసెసింగ్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని విస్తరించుకున అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (డ్యుయల్ సిమ్, 4జీ ఇండియన్ ఎల్టీఈ బ్యాండ్ సపోర్ట్, 3జీ, వై-ఫై, బ్లుటూత్), ధర రూ.9,999.

Read More : పండుగ సేల్.. రూ.11,000కే బెస్ట్ ల్యాప్‌టాప్
Lenovo K3 Note Music స్పెక్స్ ఈ విధంగా ఉన్నాయి..
5.5 అంగుళాల ఎఫ్ హైడెషినిషన్ డిస్‌ప్లే (రిసల్యూషన్1920x 1080పిక్సల్స్) విత్ 178 డిగ్రీ వైడ్ వ్యూవింగ్ యాంగిల్, ఆండ్రాయిడ్ 5.0 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, మీడియాటెక్ ఎంటీ6752 ఆక్టా కోర్ 1.7గిగాహెర్ట్జ్ ప్రాసెసర్, అడ్రినో మాలీ టీ760 ఎంపీ2 గ్రాఫిక్ యూనిట్, 2జీబి ర్యామ్, 16జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 32జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, డ్యుయల్ సిమ్ 4జీ సపోర్ట్, ధర రూ.12,999.


Click it and Unblock the Notifications








