నోకియా 2.2 మీద శాశ్వత ధర తగ్గింపు

|

HMD గ్లోబల్ యొక్క బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ నోకియా 2.2 ఇప్పుడు మరొక సారి ధర తగ్గింపును అందుకుంది. నోకియా 2.2 ఈ ఏడాది ప్రారంభంలో రూ .6,999 ప్రారంభ ధరతో ఇండియాలో రిలీజ్ అయింది.ఈ హ్యాండ్‌సెట్ లో 2జీబీ ర్యామ్ +16 జీబీ స్టోరేజ్ యొక్క బేస్ మోడల్ మీద రూ .1,000 ధర తగ్గింపు లభించిన తరువాత ఇప్పుడు రూ.5,999 ధర వద్ద లభిస్తున్నది. అలాగే 3 జీబీ ర్యామ్ +32 జీబీ స్టోరేజ్ మోడల్ యొక్క ధర రూ.6,999లు.

నోకియా 2.2
 

ఇండియాలో నోకియా 2.2 స్మార్ట్‌ఫోన్ మీద తగ్గింపు ధరను పొందడం ఇది రెండవ సారి. HMD గ్లోబల్ సంస్థ మొదటి సారిగా అక్టోబర్ నెలలో వీటి ధరలను తగ్గించింది. ఈ నెలలో నోకియా 2.2 స్మార్ట్‌ఫోన్ ధరలు 2జీబీ ర్యామ్ వేరియంట్ కోసం రూ.6,599 ఉండగా 3జీబీ ర్యామ్ వేరియంట్ ధర 7,599 రూపాయలుగా నిర్ణయించబడింది.

స్మార్ట్‌ఫోన్

భారతదేశంలో నోకియా 2.2 స్మార్ట్‌ఫోన్ మీద తాజా తగ్గింపును హెచ్‌ఎండి గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ ఎపిఐసి అజే మెహతా ట్వీట్ ద్వారా ప్రకటించారు. కొత్త తగ్గింపు ధరలతో దీనిని ఈ రోజు నుండి ప్రముఖ ఈ-కామర్స్ ఫ్లిప్ కార్ట్ నుండి కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ హెలియో A22 SoC ని కలిగి ఉండి ఫేస్ అన్‌లాక్ వంటి ఫీచర్లకు మద్దతు ఇస్తుంది. నోకియా 2.2 రియల్‌మి C2, ఆసుస్ జెన్‌ఫోన్ మాక్స్ M1, రెడ్‌మి 8 వంటి వాటికి గట్టి పోటీ ఇస్తోంది.

నోకియా 2.2 స్పెసిఫికేషన్స్

నోకియా 2.2 స్పెసిఫికేషన్స్

డ్యూయల్ సిమ్ నానో స్లాట్ గల నోకియా 2.2 ఆండ్రాయిడ్ 9 పై ఆధారంగా పని చేస్తుంది. ఇది 5.71-అంగుళాల హెచ్‌డి + 720x1520 పిక్సెల్స్ డిస్‌ప్లేను 19: 9 కారక నిష్పత్తితో వాటర్‌డ్రాప్- నాచ్ స్టైల్ నిర్మాణంతో కలిగి ఉంటుంది. ఇది అడ్రినో 505 GPU మరియు 3GB RAM తో జతచేయబడి మీడియా టెక్ హీలియో A22 SOC తో పనిచేస్తుంది.

ఆప్టిక్స్
 

నోకియా 2.2లో కెమెరా యొక్క ఆప్టిక్స్ విషయానికొస్తే ఫోటోలు మరియు వీడియోల కోసం వెనుకవైపు ఇది డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో ఎఫ్ / 2.2 లెన్స్‌తో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా మరియు ఎఫ్ / 2.2 లెన్స్‌తో 2 మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్‌ కెమెరాను కలిగి ఉంటుంది. అలాగే ముందు భాగంలో ఎఫ్ / 2.0 లెన్స్‌తో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంది.

కనెక్టివిటీ

నోకియా 2.2 లో 16GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా 256GB వరకు విస్తరించడానికి SD కార్డ్ స్లాట్ కూడా ఉంది. ఇందులో 4G VoLTE, Wi-Fi 802.11 b / g / n, బ్లూటూత్ v4.2, GPS / A-GPS, NFC, మైక్రో-యుఎస్‌బి 2.0 పోర్ట్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్ మరియు కనెక్టివిటీ ఫ్రంట్‌లో ఎఫ్‌ఎం రేడియోతో వస్తుంది. వెనుక భాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. చివరగా ఈ ఫోన్ 3,000 ఎంఏహెచ్ బ్యాటరీతో ప్యాక్ చేయబడి వస్తుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
Nokia 2.2 Mobile Price Dropped in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X