మార్కెట్లోకి సామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

Posted By:

దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ల తయారీ కంపెనీ సామ్‌సంగ్ తన గెలాక్సీ జే సిరీస్ నుంచి  జే5, జే7 మోడల్స్‌లో రెండు బడ్జెట్ ఫ్రెండ్లీ 4జీ నెట్‌వర్క్ స్మార్ట్‌ఫోన్‌లను ఇండియన్ ఆన్‌లైన్ మార్కెట్లో విడుదల చేసింది. ప్రముఖ రిటైలర్ ఫ్లిప్‌కార్ట్ ఈ స్మార్ట్‌ఫోన్‌లను ఎక్స్‌క్లూజివ్‌గా విక్రయించనుంది. ఫోన్‌లకు సంబంధించిన ముందస్తు బుకింగ్‌లు ఇప్పటికే  ప్రారంభమయ్యాయి. మొదటి సేల్ జూలై 23న ఉంటుంది. బ్లాక్, వైట్ ఇంకా గోల్డ్ కలర్ వేరియంట్‌లలో ఈ ఫోన్‌లు అందుబాటులో ఉంటాయి.

Read More : చాట్‌సిమ్‌తో ఇన్‌స్టెంట్ మెసేజింగ్ ఫ్రీ!

మార్కెట్లోకి  సామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు
 

గెలాక్సీ జే5 ఫీచర్లను పరిశీలించినట్లయితే:

5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.2గిగాహెర్ట్జ్ క్వాడ్-కోర్ స్నాప్‌డ్రాగన్ 410 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 13 మెగా పిక్సల్ ఆటో ఫోకస్ రేర్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, బ్లూటూత్ వీ4.1, వై-ఫై, ఎన్ఎఫ్ సీ, జీపీఎస్, గ్లోనాస్, మైక్రోయూఎస్బీ), 2600 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : బెస్ట్ ఆఫ్ ‘సోనీ ఎక్స్‌పీరియా'

మార్కెట్లోకి  సామ్‌సంగ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లు

గెలాక్సీ జే7 ఫీచర్లను పరిశీలించినట్లయితే:

5.5 అంగుళాల టీఎఫ్టీ డిస్‌ప్లే (రిసల్యూషన్ 1280 x 720పిక్సల్స్), 1.5గిగాహెర్ట్జ్ ఆక్టా-కోర్ ఎక్సినోస్ 7580 ప్రాసెసర్, 1.5జీబి ర్యామ్, ఆండ్రాయిడ్ 5.1 లాలీపాప్ ఆపరేటింగ్ సిస్టం, 8జీబి ఇంటర్నల్ మెమరీ, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్ ద్వారా ఫోన్ మెమరీని 128జీబి వరకు విస్తరించుకునే అవకాశం, 13 మెగా పిక్సల్ రేర్ ఫేసింగ్ కెమెరా, 5 మెగా పిక్సల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, కనెక్టువిటీ ఫీచర్లు (4జీ, 3జీ, బ్లూటూత్ వీ4.1, వై-ఫై, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్, జీపీఎస్, గ్లోనాస్, మైక్రో యూఎస్బీ), 3000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ.

Read More : ఎప్పుడు అదే యావ.. మానేదెలా? 

English summary
Samsung launched Galaxy J5, J7 SmartPhones with 4G exclusively on Flipkart. Read More in Telugu Gizbot...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot