యాప్‌ల ద్వారా ఉగ్రవాదుల అటాక్..ఆ మూడే టార్గెట్

Written By:

ఉగ్రవాదులు కొత్త దారిని వెతుకుతున్నారు. ఇండియా సమాచారాన్ని తస్కరించేందుకు టెక్నాలజీతో దూసుకొస్తున్నారు. కశ్మీర్ లో ఉగ్రవాదం, సరిహద్దుల్లో చొరబాట్ల ద్వారా ఆశించిన స్థాయిలో భారత్ ను దెబ్బతీయలేకపోతుండడంతో, ఈసారి పాకిస్థాన్ ఇంటర్నెట్ ని నమ్ముకుంది. భారత్ లోని పలు సైట్లను బ్లాక్ చేయించడం, హ్యాక్ చేయించడం ద్వారా కసి తీర్చుకునే ప్రయత్నం చేసింది. అయితే కాకలు తీరిన సాఫ్ట్ వేర్ నిపుణులున్న భారత్ పై పాక్ పన్నాగాలు పని చేయలేదు. అయితే యాప్‌లతో దేశ సమాచారంతో పాటు,భారతీయుల సమాచారాన్ని దొంగిలించేందుకు సిద్ధమైంది.

100 కోట్ల యాహూ అకౌంట్లు హ్యాక్, సమాచారం గల్లంతు

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

గూగుల్ ప్లే స్టోర్ లో 4 యాప్స్

ఉగ్రవాదులు గూగుల్ ప్లే స్టోర్ లో 4 యాప్స్ సృష్టించారు. అవి డౌన్ లోడ్ చేసుకుంటే మొత్తం సమాచారం వారిచేతుల్లోకి వెళ్లిపోయే విధంగా ఈ యాప్ లను తయారుచేశారు.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని

గూగుల్ ప్లే స్టోర్ లో నాలుగు యాప్స్ పెట్టడం ద్వారా భారతీయుల సమాచారాన్ని సేకరించాలన్న పన్నాగానికి ఆ దేశం తెరలేపిందని హోంశాఖ పేర్కొంది. ఈ మేరకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.

టాప్ గన్..

'టాప్ గన్' అనే గేమింగ్ యాప్, 'యంపీ జంకీ' అనే మ్యూజిక్ యాప్, 'బీడీ జంకీ' అనే వీడియో యాప్, 'ట్రాకింగ్ ఫ్రాగ్' అనే ఎంటర్ టైన్ మెంట్ యాప్ లను పాకిస్థాన్ కు చెందిన ఐఎస్ఐ నిపుణులు నిర్వర్తిస్తున్నారని తెలిపింది.

సమాచారం మొత్తం

మీరు ఈ యాప్స్ డౌన్ లోడ్ చేసుకుంటే మీ సమాచారం మొత్తం పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐ గుప్పిట్లో ఉంటుందని వారు హెచ్చరించారు. కనుక వెంటనే ఈ యాప్స్ మీ మొబైల్ నుంచి తీసేయాలని హెచ్చరికలు జారీ చేసింది.

పఠాన్ కోట్‌లో జరిగిన దాడి వెనుక

ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటంటే ఈఏడాది జనవరిలో పఠాన్ కోట్‌లో జరిగిన దాడి వెనుక యాప్ లే చాలా కీలకంగా వ్యవహరించాయని వాటితోనే టార్గెట్ చేశారని నిఘా వర్గాలు చెబుతున్నాయి.  

ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ లే ప్రధాన టార్గెట్

భారతదేశానికి సంబంధించిన ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ లే ప్రధాన టార్గెట్ గా ఈయాప్ లు పుట్టుకొచ్చాయని వాటి సమాచారం దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Government wants you to delete these 4 apps, right now read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot