100 కోట్ల యాహూ అకౌంట్లు హ్యాక్, సమాచారం గల్లంతు

Written By:

ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం యాహూ యూజర్లకు దిమ్మతిరిగే షాకిచ్చింది. తమ యూజర్లకు చెందిన అకౌంట్లు హ్యాక్ అయ్యాయని తెలిపింది. దాదాపు 100 కోట్ల అకౌంట్లు హ్యాకింగ్ కు గురయ్యాయని ఇది 2013లోనే ఇది జరిగిందని అయితే మళ్లీ అదే మూడు నెలల క్రితం జరిగిందని బాంబు పేల్చింది.

రూ. 18 వేల శాంసంగ్ జె7 ఫోన్ రూ. 3 వేలకే, మీకు కాల్ వచ్చిందా..?

100 కోట్ల యాహూ అకౌంట్లు హ్యాక్, సమాచారం గల్లంతు

దిగ్గజాలతో పోటీ పడలేక ఇప్పటికే కష్టాల్లో ఉన్న యాహూని అమెరికా టెలికాం కంపెనీ వెరిజాన్ ఈ మధ్య 4.8 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజా వార్తల నేఫథ్యంలో ఈ డీల్ ప్రశ్నార్థకంగా మారింది. 2014లోనే ఇదే రకమైన హ్యాకింగ్ తో యాహూ సతమతమైందని తమ నెట్వర్క్ నుంచి 50 కోట్ల అకౌంట్ల వివరాలు హ్యాకింగ్కు గురయ్యాయని స్వయంగా తెలిపింది.

దిగ్గజాలకు షాక్..ఆపిల్ నుంచి డ్యూయెల్ సిమ్ ఫోన్లు !

100 కోట్ల యాహూ అకౌంట్లు హ్యాక్, సమాచారం గల్లంతు

అయితే 50 కోట్ల యూజర్ల సమాచారం హ్యాకింగ్ కి గురవడమనేది ఇప్పటి వరకు అతిపెద్ద సైబర్ నేరంగా ఉంది. అయితే, తాజాగా 100 కోట్ల అకౌంట్లు హ్యాకింగ్ గురయ్యాయని తెలపడం కలకలం రేపుతోంది. గతంలో తమ యూజర్ల వివరాలను తస్కరించిన హ్యాకర్లు అప్పటి లాగే ఇప్పుడు కూడా యూజర్ల పేర్లు, ఈమెయిల్ ఐడీలు, టెలిఫోన్ నంబర్లు, పాస్వర్డ్లతో పాటు, ఎన్క్రిప్టెడ్, అన్ ఎన్క్రిప్టెడ్ సెక్యూరిటీ ప్రశ్నలు, సమాధానాలు అపహరించినట్లు సదరు సంస్థ తెలిపింది.

తుపాను దెబ్బకి ఇంటర్నెట్ విలవిల, సర్వర్లు డౌన్

100 కోట్ల యాహూ అకౌంట్లు హ్యాక్, సమాచారం గల్లంతు

అయితే తమ యూజర్లకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్ సమాచారం, పేమెంట్ డేటా మాత్రం అపహరణకు గురికాలేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో తమ యూజర్లకు పలు సూచనలు చేస్తూ తమ పాస్వర్డ్లు, సెక్యూరిటీ ప్రశ్నల సమాధానాలు మార్చుకోవాలని యూహూ పేర్కొంది.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

English summary
Yahoo Says Over 1 Billion User Accounts Hacked read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot