అమెజాన్ సంచలనం..13 నిమిషాల్లోనే సరుకు డెలివరీ

Written By:

మీరు అమెజాన్ లో ఏవైనా వస్తువులు ఆర్డర్ చేస్తున్నారా..వాటి కోసం మీరు రెండు మూడు రోజులు ఎదురుచూస్తున్నారా..అయితే ఇకపై మీరు ఎదురుచూపులకు సెలవు చెప్పేయవచ్చు. అమెజాన్ ఇప్పుడు సరుకులను కేవలం 13 నిమిషాల్లోనే డెలివరీ ఇవ్వనుంది. అది మనుషుల ద్వారా కాకుండా డ్రోన్ల ద్వారాఈ డెలివరీ చేయనుంది. రానున్న కాలంలో అమెజాన్ సేవలన్నీ డ్రోన్ల ద్వారానే అందుతాయని అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ స్పష్టం చేశారు.

రూ. 18 వేల శాంసంగ్ జె7 ఫోన్ రూ. 3 వేలకే, మీకు కాల్ వచ్చిందా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

ఆర్డరు చేసిన 13 నిమిషాల్లోనే

అమెజాన్ డ్రోన్ల ద్వారా కష్టమర్లకు సర్వీసును అందించాలనే ప్రయత్నం తొలిసారిగా విజయవంతంమైంది. ఇంగ్లండ్ నగరంలోని ఓ వ్యక్తి ఆర్డరు చేసిన 13 నిమిషాల్లోనే ఆ కష్టమర్ ఇంటికి నేరుగా ఆర్డరు చేసిన ప్రొడక్ట్ వచ్చి చేరింది. కష్టమర్ ఇది కలా నిజమా అని ఆశ్చర్యపోయారు.

లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్

అయితే మాములుగా ఇంటర్నెట్లో ఆర్డరుచేసిన వస్తువులను డెలివరీ బాయ్ మనకు అందిస్తాడు. అయితే దీనికి పుల్ స్టాప్ పెట్టాలని అమెజాన్ బావిస్తోంది. డెలివరీ బాయ్ లతో పనిలేకుండా డ్రోన్ల ద్వారానే డెలివరీ చేసేందుకు కసరత్తులు చేస్తున్నారు. ఈ మేరకు అమెజాన్ అధినేత జెఫ్ బిజోస్ ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించారు.

వీడియో ఇదే

ప్రయోగం విజయవంతం కావడంతో త్వరలోనే ఇది అన్ని దేశాలకు విస్తరించే అవకాశం ఉంది. ముందుగా యుఎస్ లో దీన్ని అమలు చేయనున్నారు. ఆ తర్వాత మిగతా దేశాలకు విస్తరించే వ్యూహం చేస్తున్నారు.

అమెజాన్ ప్లయింగ్ డ్రోన్లకు

ఇప్పటికే బ్రిటీష్ గవర్నమెంట్ నుంచి అమెజాన్ ప్లయింగ్ డ్రోన్లకు పర్మిషన్ కూడా సాధించింది. సబ్ అర్బాన్ , రూరల్ ఏరియాలకు ఈ డ్రోన్లను వినియోగించనున్నారు. కేవలం ఒక వ్యక్తి దీన్ని ఆపరేట్ చేస్తూ అన్ని చోట్ల డెలివరీ చేసే విధంగా దీన్ని తీసుకురానున్నారు.

2013లోనే

2013లోనే అమెజాన్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అప్పుడు కష్టమర్ ఆర్డరు ఇచ్చిన చిన్న చిన్న పార్సిళ్లు అలాగే సెలక్ట్ చేసిన మార్కెట్లకు కేవలం 30 నిమిషాల వ్యవధిలో ఈ డ్రోన్లు సరఫరా చేశాయి.

లేటెస్ట్ ట్యాబ్లెట్స్ బెస్ట్ ఆన్‌లైన్ డీల్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడేEnglish summary
Amazon Completes Its First Drone Delivery read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting