వివో వీ5 ప్లస్ ఐపీఎల్ ఫోన్ రేపే లాంచ్

Written By:

చైనా దిగ్గజం వివో తన సరికొత్త స్మార్ట్ ఫోన్ వివో వీ5 ప్లస్ లిమిటెడ్ ఎడిషన్ ను లాంచ్ చేయాలని నిర్ణయించింది. రేపు హైదరాబాద్ లో జరగబోయే ఈ ఈవెంట్ కు ఆహ్వానాలు కూడా పంపుతోంది. ప్రేక్షకుల అందరి సమక్షంలో ఐపీఎల్ లిమిటెడ్ ఎడిషన్ ను లాంచ్ చేయనున్నట్టు కంపెనీ ప్రకటించింది. బుధవారం నుంచి ఐపీఎల్ వేడుక అట్టహాసంగా ప్రారంభకాబోతుంది.

ఫేస్‌బుక్‌లో ఫేక్ పోస్ట్ పెట్టినందుకు రూ. 3కోట్లు జరిమానా

వివో వీ5 ప్లస్ ఐపీఎల్ ఫోన్ రేపే లాంచ్

జనవరిలో లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ.27,980. ఫిబ్రవరి నుంచి ఈ ఫోన్ ఆఫ్ లైన్, ఆన్ లైన్ రెండింట్లోనూ అందుబాటులోకి వచ్చింది. స్పెషల్ గా తీసుకురాబోతున్న ఈ ఎడిషన్ లో ఐపీఎల్ కు సంబంధించిన యాప్స్ ప్రీ-లోడెడ్ గా రాబోతున్నాయి.

మరిన్ని కొత్త సంచలన టారిఫ్ ప్లాన్లతో వస్తున్న జియో !

వివో వీ5 ప్లస్ ఐపీఎల్ ఫోన్ రేపే లాంచ్

రేపు జరుగబోతున్న లాంచ్ ఈవెంట్లోనే ఈ స్పెషల్ ఎడిషన్ ధరను ప్రకటించనున్నారు. కాగా ఈ ఐపీఎల్ సీజన్ కు వివో అధికారిక స్పాన్సర్. సెల్ఫీ ఫోకస్డ్ గా వచ్చిన ఈ స్మార్ట్ ఫోన్, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌ మాలో ఆధారితంగా పనిచేస్తోంది. డ్యూయల్ ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ లో ప్రత్యేక ఆకర్షణ.

జియోకి సవాల్..రోజుకు 2జిబి డేటా

వివో వీ5 ప్లస్ ఐపీఎల్ ఫోన్ రేపే లాంచ్

20 మెగాపిక్సెల్, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాలు, 16 మెగాపిక్సెల్ రియర్ కెమెరా దీనిలో ఉన్నాయి. 5.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్ ప్లే, ఆక్టా-కోర్ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 625 ప్రాసెసర్, 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్, 3055 ఎంఏహెచ్ బ్యాటరీ దీనిలో ఫీచర్లు.

English summary
Vivo V5 Plus IPL Limited Edition to Launch on Tuesday read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting