ఫేస్‌బుక్‌లో ఫేక్ పోస్ట్ పెట్టినందుకు రూ. 3కోట్లు జరిమానా

Written By:

ఫేస్‌బుక్‌లో ఫేక్ పోస్టులు పెట్టేవారికి కోర్టు మొటిక్కాయలు వేసింది. ఫేస్‌బుక్‌లో ఫేక్ పోస్ట్ పెట్టినందుకు ఓ మహిళకు ఏకంగా కోర్టు రూ. 3కోట్లు జరిమానా విధించింది. వివరాల్లోకెళితే.. తన పాత స్నేహితుడే తన తనయుడిని చంపాడంటూ ఆరోపిస్తూ  ఓ మహిళ ఫేస్‌బుక్‌లో పోస్టు పెట్టింది.

జియోకి సవాల్..రోజుకు 2జిబి డేటా

ఫేస్‌బుక్‌లో ఫేక్ పోస్ట్ పెట్టినందుకు రూ. 3కోట్లు జరిమానా

ఈ మహిళకు పెట్టిన పోస్టు ఫేక్ అని తేలడంతో మూడు కోట్ల ఇరవై నాలుగు లక్షల జరిమానా విధిస్తూ నార్త్‌ కరోలినాలోని ఓ కోర్టు తీర్పు చెప్పింది. యాష్‌విల్లేకు చెందిన జాక్వెలిన్‌ హమ్మన్డ్‌ అనే మహిళ 2015లో మద్యం సేవించి తన తనయుడిని చంపలేదని ఫేస్‌బుక్‌లో పోస్టు చేసింది.

ఫీచర్ ఫోన్స్‌లో ట్రూ కాలర్, అదీ నెట్ లేకుండానే..

ఫేస్‌బుక్‌లో ఫేక్ పోస్ట్ పెట్టినందుకు రూ. 3కోట్లు జరిమానా

తన పాత​ స్నేహితుడు డైల్‌ తన కొడుకుని హతమార్చాడని ఆరోపించింది. కాగా, దీనిపై డైల్‌ కోర్టులో పరువునష్టం దావా వేశాడు. ఈ కేసును అప్పటి నుంచి విచారిస్తున్న కోర్టు హమ్మన్డ్‌కు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పింది. హమ్మన్డ్‌ తనపై చేసిన ఆరోపణల్లో నిజంలేదని డైల్‌ చెప్పారు.

TTD స్పెషల్ దర్శన్ టికెట్స్ బుక్ చేసుకోవడం ఎలా..?

ఫేస్‌బుక్‌లో ఫేక్ పోస్ట్ పెట్టినందుకు రూ. 3కోట్లు జరిమానా

హమ్మన్డ్‌ చేసిన ఆరోపణలు తనను తీవ్రంగా కలిచివేశాయని తెలిపారు. ఇతరులపై అనవసరంగా ఆరోపణలు చేసేవారికి ఈ కేసు తీర్పు ఓ గుణపాఠమని కేసును వాదించిన లాయర్‌ అన్నారు.

English summary
Woman fined $500,000 for false Facebook accusation about former friend read more at gizbot telugu
Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting