7300mAh బ్యాటరీ, 90W ఛార్జింగ్, 50MP కెమెరాతో వివో Y300 Pro+.. 12GB RAMతో పాటు Y300t కూడా.. పూర్తి వివరాలివే!
Vivo Y300 Pro+ and Y300t: వివో తన Y-సిరీస్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లను అధికారికంగా ప్రకటించింది. అవే వివో Y300 ప్రో+, వివో Y300t. వీటిలో భారీ బ్యాటరీలు ఉన్నాయి. Y300 ప్రో+ మోడల్‌లో ఏకంగా 7,300mAh బ్యాటరీ ఉండగా, Y300t లో 6,500mAh బ్యాటరీని అమర్చారు. ఎక్కువ సేపు ఛార్జింగ్ ఆగాలని, పవర్ వాడకం సమర్థవంతంగా ఉండాలని కోరుకునే వారి కోసం ఈ ఫోన్లను రూపొందించారు.
* వివో Y300 ప్రో+ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వివో Y300 ప్రో+లో 7,300mAh మూడవ తరం సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంది. దీని ఎనర్జీ డెన్సిటీ 838Wh/L గా ఉంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 25 గంటలకు పైగా వీడియోలు చూడొచ్చని, 14.7 గంటలు గేమ్స్ ఆడొచ్చని, 15 గంటల పాటు మ్యాప్స్ నావిగేషన్ వాడొచ్చని వివో చెబుతోంది.

50MP కెమెరా, 5200mAh బ్యాటరీ, 25W ఛార్జింగ్‌తో రూ.7,000లోపే.. టాప్ స్మార్ట్‌ఫోన్లు ఇదిగో!
ఇది 90W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అంతేకాదు, 7.5W రివర్స్ OTG ఛార్జింగ్ ఫీచర్ కూడా ఉంది, అంటే అవసరమైతే దీన్ని పవర్ బ్యాంక్‌లా కూడా వాడుకోవచ్చు. ఈ ఫోన్‌లో 6.77-అంగుళాల అమోలెడ్ (AMOLED) డిస్‌ప్లే ఉంది. ఇది FHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది.
ఫింగర్‌ప్రింట్ సెన్సార్ డిస్‌ప్లేలోనే ఉంటుంది. సెల్ఫీల కోసం 32MP ఫ్రంట్ కెమెరా, వెనుక వైపు 50MP (సోనీ LYT-600 సెన్సార్) మెయిన్ కెమెరా + 2MP డెప్త్ సెన్సార్‌తో కూడిన డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. పనితీరు విషయానికొస్తే, ఇందులో స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 (Snapdragon 7s Gen 3) చిప్‌సెట్‌ను వాడారు.
8GB/12GB RAM ఆప్షన్లు, 512GB వరకు UFS 2.2 స్టోరేజ్ లభిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఒరిజిన్OS 5 (OriginOS 5)పై పనిచేస్తుంది. దుమ్ము, నీటి తుంపర్ల నుంచి రక్షణ కోసం IP64 రేటింగ్ కూడా ఉంది. Y300 ప్రో+ ఫోన్ బ్లాక్, సిల్వర్, పింక్ రంగుల్లో లభిస్తుంది.
6000mAh బ్యాటరీ, 50MP కెమెరా, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్‌తో వన్‌ప్లస్ 13 మినీ.. ధర, స్పెసిఫికేషన్లు లీక్!
చైనాలో దీని ధరలు 8GB/128GB వేరియంట్‌కు CNY 1,799 (సుమారు 248 డాలర్లు) నుంచి మొదలై, 12GB/512GB టాప్ మోడల్‌కు CNY 2,499 (సుమారు 344 డాలర్లు) వరకు ఉన్నాయి. ఇప్పటికే ప్రీ-ఆర్డర్లు మొదలయ్యాయి, ఏప్రిల్ 3 నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయి.
* వివో Y300t స్పెసిఫికేషన్లు, ఫీచర్లు
వివో Y300tలో 6,500mAh బ్యాటరీ ఉంది. ఇది 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు, రివర్స్ OTG ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. ఇటీవల ఇండియాలో విడుదలైన వివో T4x తో దీనికి కొన్ని పోలికలు ఉన్నాయి. ఈ ఫోన్‌లో 6.72-అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే అమర్చారు. దీనికి 120Hz రిఫ్రెష్ రేట్, 1,050 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ఉన్నాయి.
ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 (MediaTek Dimensity 7300) చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 8GB/12GB ర్యామ్ ఆప్షన్లు, 512GB వరకు UFS 3.1 స్టోరేజ్ లభిస్తుంది. ప్రో+ మోడల్ లాగే ఇదీ ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఒరిజిన్OS 5 పై నడుస్తుంది.
* కెమెరాలు
ఇందులో 50MP మెయిన్ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్ వెనుకవైపు, 8MP సెల్ఫీ కెమెరా ముందువైపు ఉన్నాయి. Y300 ప్రో+ లో కాకుండా, ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఫోన్ పక్క భాగంలో (సైడ్-మౌంటెడ్) ఉంటుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, డ్యూయల్ 4G VoLTE, వై-ఫై 6, బ్లూటూత్ 5.4, NFC, USB-C పోర్ట్ ఉన్నాయి.
Y300t ఫోన్ బ్లాక్, వైట్, బ్లూ రంగులలో అందుబాటులో ఉంది. దీని ధర చైనాలో 8GB/128GB వేరియంట్‌కు CNY 1,199 (సుమారు 165 డాలర్లు) నుంచి ప్రారంభమై, 12GB/512GB మోడల్‌కు CNY 1,699 (సుమారు 234 డాలర్లు) వరకు ఉంది. దీన్ని చైనాలో వివో అధికారిక వెబ్‌సైట్, ఇతర ఆన్‌లైన్ రిటైలర్ల ద్వారా కొనొచ్చు.


Click it and Unblock the Notifications








