కుర్రోళ్లు... ఇక కేక పుట్టించండి!

ప్రముఖ కంప్యూటర్ ఉపకరణాల తయారీ సంస్థ ఎన్వెంట్ (Envent), రూ.1699 ధరకు అత్యుత్తమ కార్డ్‌లెస్ ఎంపీ3 ప్లేయర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ స్మార్ట్ ప్లేయర్ పేరు ‘నైటింగేల్ కార్డ్‌లెస్ ఎంపీ3 ప్లేయర్’. ఈ పోర్టబుల్ గాడ్జెట్‌ను వైర్‌లెస్ ఎంపీత్రీ ప్లేయర్, ఎఫ్ఎమ్ రేడియో అలానే ఇయర్ ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చు. సంగీతాన్ని ఆస్వాదించే యువతకు ఈ మ్యూజికల్ గాడ్జెట్ అత్యుత్తమ మ్యూజిక్ అనుభూతులను నిరంతరాయంగా చేరువ చేస్తుందని సంస్థ సీవోవో సందీప్ రమణీ ఆవిష్కరణ సందర్భంగా తెలిపారు.
ఫీచర్లు క్లుప్తంగా:
కంఫర్ట్ ఇంకా ఫ్లెక్సిబుల్ డిజైనింగ్,
నెక్ ఇయర్ ఫోన్ డిజైన్,
8జీబి స్టోరేజ్ మెమెరీ,
ఇన్-బుల్ట్ ఎఫ్ఎమ్ రేడియో అప్లికేషన్,
7 గంటల బ్యాటరీ బ్యాకప్,
6 నెలల వారంటీ,
ధర రూ.1699.
కంప్యూటర్‌ను ప్రతిసారి షట్‌డౌన్ చేస్తున్నారా.?
ఐబాల్ మ్యూజిఫ్లాష్ మ్యూజిక్ హెడ్‌సెట్!
ఉపకరణాల తయారీ విభాగంలో దేశీయంగా గుర్తింపుతెచ్చుకున్న ఐబాల్ తన ఆడియో ఉత్పత్తుల విభాగాన్ని మరింత విస్తరిస్తూ సరికొత్త వైర్‌లెస్ మ్యూజిక్ హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. ఈ మ్యూజిఫ్లాష్ హెడ్‌సెట్‌లో మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్‌ను ఏర్పాటు చేయటం మరో విశేషం. దీంతో అనేక పాటలను కార్డ్‌లో స్టోర్ చేసుకుని హెడ్‌సెట్‌ను మ్యూజిక్ ప్లేయర్ లా ఉపయోగించుకోవచ్చు. ఇందుకు అవసరమైన ప్రత్యేక వ్యవస్థను హెడ్‌సెట్‌లో నిక్షిప్తం చేశారు. కేబుల్ సాయంతో హెడ్‌సెట్‌ను మొబైల్ అలానే ల్యాప్‌టాప్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చు. హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన బుల్ట్-ఇన్ బ్యాటరీ 10 గంటల బ్యాకప్‌ను అందిస్తుంది. యూఎస్బీ పోర్ట్ ద్వారా హెడ్‌సెట్‌ను చార్స్ చేసుకోవల్సి ఉంటుంది. ధర రూ.1499.
స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచే టాప్-5 అప్లికేషన్స్!Read in English


Click it and Unblock the Notifications








