2015 టెక్నాలజీ ట్రెండ్స్ ..ఇక అడుగడుగునా పరిజ్ఞానమే

|

ఆధునిక మనిషి ఆలోచనా విధానాన్ని ఆవిష్కరిస్తూ అందుబాటులోకి వస్తోన్న సాంకేతిక పరిజ్ఞానం నేటి మనిషి జీవినశైలి పై మరింత ప్రభావం చూపుతోంది. 2014లో టెక్నాలజీ తీరుతెన్నులను పరిశీలించినట్లయితే స్మార్ట్‌ఫోన్‌ల వాడకం విపరీతంగా పెరిగిపోయింది.

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

అందుకు అనుగుణంగా విప్లవాత్మక ఇంటరాక్టివ్ యాప్స్ పుట్టుకొచ్చాయి. వ్యక్తిగత క్లౌడ్ సర్వీసులకు ఆదరణ పెరిగింది. అదేమారుగా ఆన్‌లైన్ షాపింగ్ అంటూ ఈ-కామర్స్ వెబ్‌సైట్‌ల వైపు జనం పరుగులు తీస్తున్నారు. చాలా సర్వీసులు డిజిటల్ రూపంలోకి మారిపోతున్నాయి. ఈ పరిస్థితులను అంచనావేస్తుంటే కమ్యూనికేషన్ టెక్నాలజీ విభాగంలో 2015 మరింత విప్లవాత్మకం కానుందన్న విషయం స్పష్టమవుతుంది. 2015లో ప్రపంచాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్లే 10 టెక్నాలజీ ట్రెండ్‌లను మీతో షేర్ చేసుకుంటున్నాం...

(క్రిస్మస్ స్పెషల్... 10 సామ్‌సంగ్ ఫోన్‌ల పై బెస్ట్ డీల్స్)

మొబైల్ చెల్లింపు విధానం

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

యాపిల్ సంస్థ వృద్థి చేసిన ‘యాపిల్ పే' అనే నగదు చెల్లింపు స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఆదరణ పెరుగుతోన్న నేపధ్యంలో రానున్న రోజుల్లో మొబైల్ చెల్లింపు విధానం (Mobile payment systems) మరింత విస్తృతం కానుంది. ఈ తరహా యాప్‌‌కు బ్యాంక్ అకౌంట్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డ్‌లను అనుసంధానం చేసినట్లయితే అన్ని రకాల ఆన్‌లైన్ చెల్లింపులను ఈ స్మార్ట్‌ఫోన్‌ యాప్ ద్వారానే చేసేయవచ్చు. యాపిల్ పే తరహాలోనే గూగుల్ వాలెట్, పేపాల్, లెవలప్, స్కేర్ వాలెట్ వంటి యాప్స్ మొబైల్ చెల్లింపు సేవలను అందిస్తున్నాయి. అయితే ఇవి ప్రస్తుతానికి యూఎస్‌లో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. త్వరలోనే ఇవి మరిన్ని దేశాలను విస్తరించనున్నాయి.

ఆన్ డిమాండ్ యాప్స్

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

ఈ ఉరుకుల పరుగుల జీవితంలో భాగంగా కొత్త ఆలచోనలతో పుట్టుకొచ్చిన ఆన్ డిమాండ్ అప్లికేషన్‌లకు మార్కెట్ ఆదరణ అమాంతం పెరిగిపోయింది. ఉదాహరణకు ఈ ఆన్ డిమాండ్ యాప్స్ పుణ్యమా అంటూ కొరకున్న ఆహారాన్ని క్షణాల వ్యవధిలో మన వద్దకు రప్పించుకోగలుగుతున్నాం. అలానే సినిమా టికెట్లను బుక్ చేసుకోగలుగుతున్నాం. ఈ విషయాల్లో మాత్రమే కాదు ట్రావెల్ బుకింగ్స్, హోటల్ రిజర్వేషన్స్, ఎమర్జెన్సీ హెల్త్ సర్వీసెస్ ఇలా అనేక విభాగాల్లో ఆన్-డిమాండ్ యాప్స్ మన అవసరాలను తీరుస్తున్నాయి. వీటిని ఉపయోగించుకోవటం ద్వారా బోలెడంత సమయాన్ని మనం ఆదా చేసుకోగలుగుతున్నాం. రానున్న రోజుల్లో ఈ తరహా ఆన్ డిమాండ్స్ యాప్స్‌ మరింతే విస్తరించే అవకాశముంది.

ఐబీకాన్ టెక్నాలజీ

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

యాపిల్ టెక్నాలజీ ప్రతిష్టాత్మకంగా ఈ సాంకేతికత పై దృష్టిసారించింది. యాపిల్ ఐఫోన్‌ల కమ్యూనికేషన్‌ల విభాగంలో ఐబీకాన్ సాంకేతికత మరింత ఉపయోగకరంగా నిలవనుంది.

సోషల్ పేమెంట్స్

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

ప్రముఖ మెసేజింగ్ యాప్ ‘లైన్’ ఇటీవల ‘లైన్ పే' పేరుతో సరికొత్త సర్వీసును విడుదల చేసింది. నేరుగా ఈ యాప్ ద్వారానే నగదును ట్రాన్స్‌ఫర్ చేసుకుని వస్తువులను కొనుగోలు చేయవచ్చు. చైనా ఇంకా కొరియాలలో ఈ తరహా సోషల్ చెల్లింపులు సర్వ సాధారణంగా మారిపోయాయి. స్నాప్‌చాట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ వంటి ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ యాప్స్ ఈ తరహా చెల్లింపు సర్వీసులను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.

వెబ్‌ఆర్టీసీ

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

మార్కెట్లో మీడియా స్ట్రీమింగ్ మరింతగా పుంజుకుంటోంది. ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఇంటర్నెట్ ద్వారా తమకు అవసరమైన ఆడియో, వీడియోలను స్ట్రీమ్ చేసుకుంటున్నారు. వేగవంతమైన స్ట్రీమింగ్ సర్వీసులను చేరువ చేసే ఉద్దేశ్యంతో అందుబాటులోకి వచ్చిన వెబ్‌ఆర్టీసీ బ్రౌజర్ అంతరాయంలేని ఆడియో, వీడియో స్ట్రీమింగ్‌కు సహకరిస్తుంది. ఈ బ్రౌజర్‌లో గేమ్స్ అలానే మ్యూజిక్ వేగవంతంగా లోడ్ అవుతాయి. వెబ్‌ఆర్టీసీ ప్రస్తుతం గూగుల్ హ్యాంగ్‌అవుట్స్, అమెజాన్ మేడే సర్వీసులకు అందుబాటులో ఉంది. త్వరలో మరిన్ని మొబైల్ యాప్స్ వెబ్‌ఆర్టీసీ బ్రౌజర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నాయి.

(10 మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్‌ల పై క్రిస్మస్ ఆఫర్లు)

సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫోటో

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

ఈ మధ్య కాలంలో సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ ఫోటో, వీడియో యాప్‌లకు మార్కెట్లో ఆదరణ పెరగుతోంది. సెల్ఫ్.. డిస్ట్రక్టింగ్ యాప్ అంటే ఈ యాప్ ద్వారా మనం పంపిన ఆడియో లేదా వీడియో అవతలి వారు చూసిన తరువాత సిస్టం నుంచి ఆటోమేటిక్‌గా తొలగిపోతుంది. స్నాప్‌చాట్ ఈ తరహా యాప్‌ను మొట్టమొదటి సారిగా అందుబాటులోకి తీసుకురాగా. ఆ తరువాత ఫేస్‌బుక్ స్లింగ్‌షాట్ పేరుతో ఇదే తరహా యాప్‌ను తీసుకువచ్చింది. రానున్న రోజుల్లో సెల్ఫ్ డిస్ట్రక్టింగ్ మెసేజ్ యాప్‌లకు మరింత ఆదరణ పెరిగే అవకాశముంది.

స్మార్ట్‌వాచ్‌లు

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

యాపిల్ వాచ్ 2015లో విడుదలకు ముస్తాబవుతోంది. ఇప్పటికే సోనీ, సామ్‌సంగ్, మోటరోలా, ఎల్‌జీ వంటి కంపెనీలు స్మార్ట్ మొబైలింగ్ ఫీచర్లతో కూడిన స్మార్ట్‌వాచ్‌లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. రానున్న రోజుల్లో స్మార్ట్‌వాచ్‌ టెక్నాలజీ మరింత క్రియాశీలకం కానుంది.

చౌకైన 3డీ ప్రింటింగ్

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

2013లో ప్రారంభమైన 3డీ ప్రింటర్ల హవా అన్ని విభాగాల్లోనూ విస్తరించింది. ఇంజనీరింగ్, క్లాతింగ్ ఇలా అనేక పరిశ్రమల్లో 3డీ ప్రింటర్లను విస్తృతంగా వాడుతున్నారు. మనకు కావల్సిన మెటీరియల్‌తో మనకు నచ్చిన వస్తువులను ఈ 3డీ ప్రింటర్ల ద్వారా తయారు చేసుకోవచ్చు. 2015లో 3డీ ప్రింటర్ల వినియోగం మరింతగా పెరిగే అవకాశముంది.

భారతీయులు అత్యధికంగా సెర్చ్ చేసిన 10 స్మార్ట్‌ఫోన్‌లు (2014)

కనెక్టెడ్ హోమ్స్

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

ఇటీవల కాలంలో అనేక స్మార్ట్‌హామ్ కాన్సెప్ట్‌లను మనం చూసాం. యాపిల్, గూగుల్ వంటి దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు స్మార్ట్ హామ్ టెక్నాలజీ పై దృష్టిసారించాయి. వీటికి సంబంధించిన పరిశోధనలను ఈ రెండు కంపెనీలు చాలా రహస్యంగా చేపడుతున్నట్లు సమాచారం. 2015లో వీటి గురించిన మరిన్ని కీలక అప్‌డేట్‌లు మనకందే అవకాశముంది. ఇప్పటికే గూగుల్ డ్రైవర్ రహిత కార్లను పరీక్షించి విజయవంతమైంది.

క్లౌడ్ కంప్యూటింగ్

విప్లవాత్మక టెక్నాలజీ@2015!

క్లౌడ్ కంప్యూటింగ్ సేవలకు ఏ విధమైన పరిధిలు లేవు, ఎటువంటి సర్వీసులనైనా అందిస్తుంది. అప్లికేషన్‌లు మొదలుకుని సాఫ్ట్‌వేర్‌ల వరకు క్లౌడ్ కంప్యూటింగ్‌లో సులువుగా లభ్యమవుతాయి. క్లౌడ్ కంప్యూటింగ్ గుర్తించి క్లుప్తంగా చెప్పాలంటే ఆయా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలనందించే సంస్థలు తాము ఏర్పాటు చేసిన ప్రత్యేకమైన వెబ్ సర్వర్ల ద్వారా క్లయింట్‌కు కావల్సిన అప్లికేషన్స్ ఇంకా డేడా స్టోరేజ్‌ను అందిస్తాయి.

క్లౌడ్ కంప్యూటింగ్‌లో భాగంగా క్లయింట్ స్టోర్ చేసిన డేటా మొత్తం ఒక వెబ్ సర్వర్‌లో స్టోరేజ్ కాబడి ఉంటుంది. అంటే క్లయింట్ వినియోగించిన కంప్యూటర్‌లో ఏ విధమైన డేటా ఇంకా అప్లికేషన్స్ ఉండవు. కేవలం డివైస్ ఆపరేటింగ్ సిస్టం ఇంకా క్లౌడ్ కంప్యూటింగ్ సర్వీసును అందించే సంస్థ అప్లికేషన్ మాత్రమే ఉంటుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, హెచ్‌పీ వంటి ప్రముఖ కంపెనీలు క్లౌడ్ కంప్యూటింగ్ సేవల నిమిత్తం భారీగా వెచ్చిస్తున్నాయి. 2015లో క్లౌడ్ కంప్యూటింగ్ సేవలు మరింతగా విస్తరించనున్నాయి.

Best Mobiles in India

English summary
10 most significant technology trends to look forward to in 2015. Read more in Telugu Gizbot....

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X