6లక్షల మంది సాఫ్ట్‌వేర్లు అసలు పనికిరారట !

Written By:

ఐటీ కంపెనీలు ఉద్యోగుల తొలగింపు విషయంలో చాలా కఠినంగానే వ్యవహరిస్తున్నాయి. అది చాలా ప్రమాదకరస్థాయిలో వెళుతోంది. ఈ ఉద్యోగాల తొలగింపు వచ్చే మూడేళ్లలో ఏటా రెండు లక్షల వరకు ఉంటుందని పరిశోధన సంస్థలు వెల్లడిస్తున్నాయి.

జియోకి షాక్ , ఎయిర్‌టెల్ అన్‌లిమిటెడ్ డేటా

6లక్షల మంది సాఫ్ట్‌వేర్లు అసలు పనికిరారట !

హెడ్ హంటర్స్ ఇండియా అనే పరిశోధన సంస్థ అంచనాల ప్రకారం ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపు ఏటా 1.75 లక్షల నుంచి 2 లక్షల వరకు వచ్చే మూడేళ్లపాటు ఉంటుందని తెలిసింది. కంపెనీలు కొత్త టెక్నాలజీలను అందుకునేందుకు సన్నద్ధంగా లేకపోవడమే ఇందుకు కారణమని ఈ సంస్థ అంటోంది.

ఈ ఫోన్ వస్తే పాత రికార్డులు చరిత్ర పుటల్లోకే !

6లక్షల మంది సాఫ్ట్‌వేర్లు అసలు పనికిరారట !

ఈ ఏడాది ఇప్పటికే రూ.56,000 మంది ఉద్యోగాలు కోల్పోయినట్టు హెడ్‌ హంటర్స్‌ ఇండియా వ్యవస్థాపక చైర్మన్, ఎండీ కె.లక్ష్మీకాంత్‌ పేర్కొన్నారు. అంటే మొత్తంగా మూడేళ్ల కాలంలో ఆరు లక్షల మంది ఐటీ ఇంజనీర్లు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన ప్రమాదకర పరిస్థితుల్లో ఉండబోతున్నారని లక్ష్మీకాంత్ చెప్పారు.

ఇదే..షియోమిని రికార్డుల వైపు నడిపిస్తోంది

6లక్షల మంది సాఫ్ట్‌వేర్లు అసలు పనికిరారట !

టెక్నాలజీలో వచ్చే మార్పుల వల్ల వీరంతా అప్ డేట్ కాలేరని కాబట్టి వీరిని కొనససాగించడం కష్టమని ముఖ్యంగా 35 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయసున్న నిపుణులపై ఎక్కువ ప్రభావం ఉంటుందని, వీరికి ఉద్యోగాలు లభించడం కష్టంగా మారుతుంది '' అని లక్ష్మీకాంత్‌ అన్నారు.

English summary
2 lakh IT engineers to lose jobs annually in the next 3 years: Head Hunters India Read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot