5G సపోర్ట్ మోడళ్లతో 2020లో ఐఫోన్
కొంతమంది స్మార్ట్‌ఫోన్ తయారీదారులు తమ 5 జి-ఎనేబుల్డ్ ఫోన్‌లను ఈ ఏడాదిలోనే లాంచ్ చేస్తున్నారు. కానీ ఆపిల్ మాత్రం తన ఐఫోన్ మోడళ్ల శ్రేణిని 5G సపోర్ట్‌తో పరిచయం చేయడానికి 2020 వరకు వేచి చూస్తున్నది. ప్రసిద్ధ విశ్లేషకుడు మింగ్-చి కుయో ఆపిల్ యొక్క తన మూడు కొత్త ఐఫోన్ మోడళ్లు వచ్చే ఏడాది 5G సపోర్ట్‌ను ప్రవేశపెడుతుందని ముందే ఉహించారు.

పెట్టుబడిదారులకు తన తాజా నోట్‌లో కుయో తన అంచనాను మార్చుకున్నాడు. 2020 లో మూడు కొత్త ఐఫోన్ మోడళ్లు 5Gకి మద్దతు ఇస్తాయని ఆయన ఇప్పుడు పేర్కొన్నారు. ఈ సంవత్సరం విడిగా రెగ్యులేటరీ లిస్టింగ్ ఆపిల్ రెండు కొత్త ఐప్యాడ్ మోడళ్లను విడుదల చేయబోతున్నట్లు తెలిపింది.

5G సపోర్ట్ స్మార్ట్‌ఫోన్:
2020 లో ఆపిల్ తన ఐఫోన్ మోడళ్లలో 5Gని అందించడం ద్వారా 5G సపోర్ట్ ఉన్న తక్కువ ధర గల ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లతో పోటీ పడగలదని కుయో అభిప్రాయపడ్డారు. 1 బిలియన్ డాలర్ల విలువైన ఒప్పందంలో ఇంటెల్ యొక్క మోడెమ్ వ్యాపారంలో ఎక్కువ భాగాన్ని ఆపిల్ కొనుగోలు చేసింది. ఆపిల్ ఇప్పుడు తన 5G -ఎనేబుల్ ఐఫోన్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ఎక్కువ వనరులను కలిగి ఉందని కుయో చెప్పారు.

మింగ్-చి కుయో పరిశోధన:
తన పరిశోధన నోట్‌లో 5G సపోర్ట్‌తో కూడిన ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు 2020 నాటికి మరింత సరసమైనవి అవుతాయని తెలిపారు. వీటి యొక్క ధరలు $249- $349 మధ్యలో వస్తాయని కుయో పేర్కొన్నారు. 2020 లో కొత్త స్మార్ట్‌ఫోన్ యొక్క ప్రామాణిక లక్షణంగా 5G ని వినియోగదారులు యాచించవచ్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ పరిశోధన యొక్క నోట్‌ను మొదట మాక్‌రూమర్స్ పంచుకున్నారు.

5G టెక్నాలజీ:
2020 ఐఫోన్ మోడల్స్ అమెరికన్ మొబైల్ మార్కెట్ కోసం mm వేవ్ మరియు సబ్ -6 GHz స్పెక్ట్రంకు మద్దతు ఇస్తాయని భావిస్తున్నారు. 5G నెట్‌వర్క్‌లు రెండు టెక్నాలజీలుగా విభజించబడ్డాయి. అందులో మొదటిది mmWave హై-స్పీడ్ 5G నెట్‌వర్క్‌ను అందిస్తుంది. ఇది క్రమంగా జనాదరణ పొందుతోంది మరియు పట్టణ నెట్‌వర్క్‌లకు అనుకూలంగా ఉంటుంది. రెండవది సబ్ -6 GHz టెక్నాలజీ 4G కన్నా వేగంగా ఉంటుందని తెలిపారు. అయితే ఇది mmWave వలె వేగంగా ఉండదు . సబ్ -6 GHz టెక్నాలజీ ఇప్పుడు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో మోహరించే అవకాశం చాలా ఉంది.

క్వాల్కమ్ మోడెమ్ చిప్స్:
వచ్చే ఏడాది వస్తున్న ఐఫోన్ మోడళ్ల కోసం ఆపిల్ క్వాల్కమ్ మోడెమ్ చిప్‌లను ఉపయోగిస్తుందని చెబుతున్నారు. కుపెర్టినో ఆధారిత సంస్థ తన 5G -సపోర్టింగ్ మోడెమ్ చిప్‌లపై పనిచేస్తుందని పుకార్లు వచ్చాయి. అయితే అవి మరికొంత సమయం తీసుకునే అవకాశం కూడా ఉంది.

5G కనెక్టవిటీ ఫోన్లు & ఐప్యాడ్లు:
5G కనెక్టవిటీతో కంపెనీ తన ఐఫోన్ మోడళ్లతో పాటు ఆపిల్ త్వరలో 5G కనెక్టవిటీ లైనప్‌లో మరిన్ని ఐప్యాడ్ మోడళ్లను జోడించాలని చూస్తోంది. ఆపిల్ సంస్థ ప్రస్తుతం టాబ్లెట్లను ఐదు రకాల మోడళ్లలో విక్రయిస్తున్నది. అవి వరుసగా ఐప్యాడ్ మినీ, ఐప్యాడ్, ఐప్యాడ్ ఎయిర్, 11-అంగుళాల ఐప్యాడ్ ప్రో మరియు 12.9-అంగుళాల ఐప్యాడ్ ప్రో ప్రస్తుతం మార్కెట్లో అమ్మకానికి ఉన్నాయి. ఆపిల్ ఇటీవలే ఐప్యాడ్ ఎయిర్ 2019 మోడల్‌తో పాటు రిఫ్రెష్ చేసిన ఐప్యాడ్ మినీని కూడా పరిచయం చేసింది. ఆపిల్ఇన్‌సైడర్ గుర్తించిన కొత్త రెగ్యులేటరీ ఫైలింగ్స్ ప్రకారం ఆపిల్ త్వరలో మరో రెండు ఐప్యాడ్ మోడళ్లను జోడించనుంది.
ఈ కొత్త ఐప్యాడ్ మోడల్స్ 10.2-అంగుళాలతో రావచ్చు అని ఊహాగానాలు ఉన్నాయి. ఇది ప్రస్తుతం ఉన్న 9.7-అంగుళాల ఐప్యాడ్‌కు అప్‌గ్రేడ్ వర్షన్ గా మార్కట్లోకి వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆపిల్ పెన్సిల్‌కు కూడా మద్దతు ఉంటుంది. ఈ కొత్త ఐప్యాడ్ మోడళ్ల భారీ ఉత్పత్తి జూలై నుండి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ మోడళ్లను లాంచ్ చేయడానికి టైమ్‌లైన్ తొందరలో ఉంది అని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








