ఎక్కువ డేటా కోసం ACT ఫైబర్‌నెట్ అందిస్తున్న 5 కొత్త ఫ్లెక్సీబైట్స్ ప్లాన్‌లు

|

ACT ఫైబర్‌నెట్ (అట్రియా కన్వర్జెన్స్ టెక్నాలజీస్) ఇప్పుడు తన వినియోగదారులకు గొప్ప గొప్ప ప్లాన్‌లను అందిస్తోంది. అందులో భాగంగా ప్రస్తుతం ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్‌ల ద్వారా వినియోగదారులు తమ డేటా FUP పరిమితిని 500GB వరకు పెంచడానికి అనుమతిస్తుంది. సాధారణంగా ఫ్లెక్సీబైట్స్ + అనేది ACT ఫైబర్నెట్ అందిస్తున్న డేటా టాప్-అప్ వోచర్లు. ఇవి డేటా యొక్క FUP పరిమితిని పెంచుతాయి.

ACT ఫైబర్నెట్
 

ACT ఫైబర్నెట్ ఈ ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్‌లను దాని కార్యకలాపాలు ఉన్న అన్ని నగరాల్లో అందిస్తోంది. ACT ఫైబర్నెట్ ఇప్పటికే చెన్నై, హైదరాబాద్, డిల్లీ వంటి నగరాల్లో ఉత్తమమైన బ్రాడ్‌బ్యాండ్‌ను కలిగి ఉంది. బెంగళూరు వంటి నగరాల్లో ఈ సంస్థకు మరొక సంస్థ నుండి బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికల విషయంలో గట్టి పోటీగా ఏవి లేవు. బ్రాడ్‌బ్యాండ్ ఆపరేటర్ ఇటీవలే బెంగళూరులో బ్రాడ్‌బ్యాండ్ ప్రణాళికలపై దాని FUP పరిమితిని మరియు వేగాన్ని సవరించింది. అయితే ఇది ఎయిర్‌టెల్ ఎక్స్‌స్ట్రీమ్, హాత్‌వే మరియు స్పెక్ట్రా వంటి వాటితో పోలిస్తే పోటీలో వెనుకబడి ఉంది. బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై FUP పరిమితులు చాలా తక్కువగా ఉన్న నగరాల్లో ACT ఫైబర్‌నెట్ వినియోగదారులకు ఈ ఫ్లెక్సీబైట్స్ + ప్రణాళికలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి.

ACT ఫైబర్నెట్ ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్ వివరాలు

ACT ఫైబర్నెట్ ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్ వివరాలు

ACT ఫైబర్నెట్ అందిస్తున్న ఫ్లెక్సీబైట్స్ +ప్లాన్ లు కేవలం డేటా టాప్-అప్ వోచర్లు మాత్రమే. ఇవి అందిస్తున్న డేటా ప్రయోజనం విషయానికి వస్తే అవి అంతగా ఆకట్టుకోవు. ప్రస్తుతం ఈ సంస్థ మొత్తం ఐదు ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్‌లను వినియోగదారులకు అందిస్తున్నారు. వీటి ధరలు రూ.225ల నుండి ప్రారంభమయి రూ.2,500 వరకు ఉంటుంది. ఇందులో మొదటిది రూ.225 ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్ కేవలం 25 GB డేటాను అందిస్తుంది. ఆ తర్వాత రూ.400, రూ.600 ప్లాన్లు వరుసగా 50 GB, 60 GB డేటాను అందిస్తున్నాయి. అలాగే రూ .1,250 మరియు రూ .2,500ల హై-ఎండ్ ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్లు వరుసగా 200 GB మరియు 500 GB డేటాను అందిస్తున్నాయి.

ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్‌

ఈ ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్‌లలో ఉత్తమమైన భాగం చెల్లుబాటు సమయం. ప్రతి ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్ మూడు నెలల చెల్లుబాటుతో మొత్తం డేటాను అందిస్తుంది. కాబట్టి మీరు డేటాను ఒక నెలలో వినియోగించకపోయినా డేటాకు ఎటువంటి మార్పు ఉండదు. విచారకరమైన విషయాలలో బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లపై వినియోగదారులకు ACT ఫైబర్‌నెట్ ఇంకా డేటాను అందించలేదు. అయితే ఫ్లెక్సీబైట్స్ + ప్లాన్‌ల నుండి వచ్చిన డేటాను మూడు నెలల పాటు ముందుకు తీసుకెళ్లవచ్చు.

భారతి ఎయిర్‌టెల్ OTT సర్వీస్ లు
 

భారతి ఎయిర్‌టెల్ OTT సర్వీస్ లు

భారతి ఎయిర్‌టెల్ తరువాత వినియోగదారులకు OTT సర్వీస్ సుబ్స్క్రిప్షన్ లను అందించే జాబితాలో ACT ఫైబర్నెట్ రెండవ స్థానంలో ఉంది. రూ.1,099ల పైన ఉన్న ప్లాన్‌లపై భారతి ఎయిర్‌టెల్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు రూ.1,500 ల విలువైన నెట్‌ఫ్లిక్స్ సుబ్స్క్రిప్షన్, ఒక సంవత్సరానికి అమెజాన్ ప్రైమ్ సుబ్స్క్రిప్షన్, ప్రతి నెల ZEE5 ప్రీమియం మెంబెర్ షిప్ మరియు 12 నెలల ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ యాప్ సుబ్స్క్రిప్షన్ ను ఉచితంగా అందిస్తుంది.

ACT ఫైబర్నెట్ OTT సర్వీస్ లు

ACT ఫైబర్నెట్ OTT సర్వీస్ లు

ACT ఫైబర్నెట్ విషయానికి వస్తే భారతి ఎయిర్టెల్ తన బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లకు అందిస్తున్నదానికి ఎక్కడా దగ్గరగా లేదు. ఏదేమైనా బెంగళూరుకు చెందిన ISP జనాదరణ పొందిన OTT సర్వీస్ లకు తగ్గింపును అందించడం ద్వారా చందాదారులను ఆకర్శించాలని చూస్తోంది. ACT ఫైబర్నెట్ ఈ సంవత్సరం ప్రారంభంలో నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌లను ప్రారంభించింది. ఎవరైనా కస్టమర్ ACT ఫైబర్‌నెట్ బిల్లు ద్వారా చెల్లించాలని ఎంచుకుంటే నెట్‌ఫ్లిక్స్ చందాపై రూ .500 వరకు తగ్గింపును అందిస్తుంది. ఇంకా ఈ నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్‌లు బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో పోలిస్తే 500GB వరకు అదనపు డేటాతో అందించబడతాయి. ఉదాహరణకు హైదరాబాద్ నగరంలోని ACT ఫైబర్‌నెట్ రూ.1,050 బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ప్రతి నెలా 750GB FUP పరిమితిని అందిస్తుంది. అయితే ఇలాంటి ధర గల నెట్‌ఫ్లిక్స్ ఎంటర్టైన్మెంట్ ప్లాన్ 850GB FUP పరిమితితో వస్తుంది.

ZEE5 చందా

ACT ఫైబర్‌నెట్ బ్రాడ్‌బ్యాండ్ కస్టమర్లు కూడా ఒక నెలకు 99 రూపాయల విలువైన ZEE5 చందా, ఆరు నెలలు Yupp TV చందాను ఉచితంగా పొందవచ్చు. అలాగే ACT వినియోగదారులకు రాయితీ ధరలకు ఇతర OTT సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. ACT ఫైబర్నెట్ ACT స్ట్రీమ్ TV 4K అని పిలువబడే ఆండ్రాయిడ్ టీవీ ఆధారిత సెట్-టాప్ బాక్స్‌ను విడుదల చేసింది. ఇది హైదరాబాద్, చెన్నై, బెంగళూరు మరియు ఢిల్లీ నాలుగు నగరాల్లో ఎంపిక చేసిన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లతో అందించబడుతుంది.

Most Read Articles
Best Mobiles in India

English summary
ACT Fibernet Introduce 5 FlexyBytes Plans

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X