Home
News

Vodafone అందిస్తున్న ఫస్ట్ రీఛార్జ్ ప్రీపెయిడ్ ప్లాన్‌లు ఇవే..

ఇండియాలోని టెలికాం ఆపరేటర్లలో ఒకటైన వోడాఫోన్ సంస్థ ప్రస్తుతం తన చందాదారులకు విస్తృత శ్రేణిలో ప్రీపెయిడ్ ప్లాన్ లను అందిస్తున్నది. భారతి ఎయిర్‌టెల్ మాదిరిగానే UKకు చెందిన ఈ టెల్కో కూడా తన నెట్‌వర్క్‌లో చేరిన కొత్త చందాదారుల కోసం ఐదు ప్రీపెయిడ్ ప్లాన్‌లను కలిగి ఉంది.

వొడాఫోన్

వొడాఫోన్ నెట్‌వర్క్‌లో లభించే ఐదు ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లు రూ.97, రూ.197, రూ.297, రూ.497 మరియు రూ.649 ధరలను కలిగి ఉన్నాయి. ఈ ప్లాన్‌లన్నీ ప్రస్తుత వినియోగదారులకు కొంచెం తక్కువ ధరలకు లభిస్తాయి. ఉదాహరణకు రూ.97 FRCని ఇప్పటికే ఉన్న చందాదారులు రూ.45 వద్ద పొందవచ్చు. కొన్ని రోజుల క్రితం వోడాఫోన్ రూ .297 ప్రీపెయిడ్ ప్రారంభ రీఛార్జ్‌తో 1.5GB రోజువారీ డేటా ప్లాన్‌లలో డబుల్ డేటా ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. వోడాఫోన్ నెట్‌వర్క్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఐదు మొదటి రీఛార్జ్ ఆఫర్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

వోడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.200 లోపు

వోడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ రూ.200 లోపు

రూ.97 వోడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్

రూ.200 ధరల లోపు విభాగంలో వోడాఫోన్ ప్రస్తుతం రెండు ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లను రూ.97 మరియు రూ.197 ధరలకు అందిస్తోంది. రూ. 97 FRC బేసిక్ వినియోగదారులకు రూ.45 టాక్‌టైమ్‌తో పాటుగా 100MB 2G / 3G / 4G డేటాను 28 రోజుల చెల్లుబాటుతో అందిస్తుంది. ఇందులో అన్ని కాల్స్ సెకనుకు ఒక పైస చొప్పున వసూలు చేయబడుతుంది.

రూ. 197 FRC వోడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్

రూ. 197 FRC వోడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్

వోడాఫోన్ యొక్క తదుపరి ప్లాన్ రూ. 197 FRC ప్లాన్. ఇది భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత వాయిస్ కాలింగ్, 2GB డేటా, 300 ఎస్‌ఎంఎస్‌ల ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఇది వోడాఫోన్ ప్లే చందాను ఉచితంగా అందిస్తుంది. 28 రోజుల తరువాత వినియోగదారులు తమ అకౌంటును చురుకుగా ఉంచడానికి ఆల్ రౌండర్ ప్లాన్‌లు లేదా అపరిమిత కాంబో ప్లాన్‌లతో రీఛార్జ్ చేయాలి.

రూ .297 వొడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌

రూ .297 వొడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌

వొడాఫోన్ యొక్క రూ.297 ఫస్ట్ రీఛార్జి ప్లాన్‌ ప్రస్తుత చందాదారులకు డబుల్ డేటా ప్రయోజనాన్ని అందిస్తోంది. ఇది రోజుకు 1.5GB + 1.5GB (3GB) డేటాను, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు రోజుకు 100 SMS ల ప్రయోజనాలను 28 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ఈ డబుల్ డేటా ఆఫర్ కేవలం పరిమిత కాలంలో మాత్రమే అందిస్తున్నది అని గమనించండి. అలాగే వోడాఫోన్ అదే డబుల్ డేటా ఆఫర్‌ను మరో రూ .249, రూ .399 మరియు రూ .599 మూడు ప్రీపెయిడ్ ప్లాన్‌లలో కూడా అందిస్తున్నది.

రూ .497 వొడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌

రూ .497 వొడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌

వోడాఫోన్ యొక్క రూ .497 FRC ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్ రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు మరియు అపరిమిత వాయిస్ కాలింగ్ వంటి ప్రయోజనాలను 56 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. రూ .297 మరియు రూ .497 ప్లాన్‌లు రెండూ కూడా వోడాఫోన్ ప్లే చందాను ఉచితంగా అందిస్తున్నాయి. ఇవి Zee 5 సభ్యత్వాన్ని కూడా ఫ్రీగా అందిస్తుంది.

రూ .647 వొడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్

రూ .647 వొడాఫోన్ ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్

వొడాఫోన్ సంస్థ యొక్క ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్‌లలో చివరిది ప్రీమియం మరియు దీర్ఘకాలిక రూ .647 ఫస్ట్ రీఛార్జ్ ప్లాన్. ఈ ప్లాన్ అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 1.5GB డేటా మరియు రోజుకు 100 ఎస్ఎంఎస్ వంటి ప్రయోజనాలను రీఛార్జ్ చేసిన తేదీ నుండి 84 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తోంది. ఇది వోడాఫోన్ ప్లే యొక్క చందాకు ఉచిత యాక్సిస్ ను అందిస్తుంది.

More from GizBot

Best Mobiles in India

English summary
Vodafone First Recharge Prepaid Plans Full Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X