Airtel యొక్క అపోలో 247 చెకర్ టూల్ వాడటం ఎలా?

|

రిలయన్స్ జియో ఇటీవల భారతదేశంలో కరోనావైరస్ యొక్క సహాయక చర్యలకు సహాయపడే అనేక చర్యలను ప్రకటించింది. ఈ జాబితాలో కరోనావైరస్ సింప్టమ్ చెకర్ టూల్స్ కూడా ఉంది. దీనిని మైజియో యాప్ మరియు జియో వెబ్‌సైట్‌లో నుండి డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఎయిర్టెల్

ఇది వినియోగదారులకు కరోనావైరస్ ఉన్నట్లు అనుమానించబడిందో లేదో తెలుసుకోవడానికి వీలు కల్పిస్తుంది. జియో విడుదల చేసిన దాదాపు మూడు రోజుల తరువాత ఎయిర్టెల్ కూడా తన వినియోగదారుల కోసం ఇలాంటి టూల్ ను ఇప్పుడు విడుదల చేసింది.

 

 

అపోలో 247 సింప్టమ్ టూల్

అపోలో 247 సింప్టమ్ టూల్

అపోలో 247 అని పిలువబడే ఎయిర్టెల్ యొక్క కరోనావైరస్ సింప్టమ్ టూల్ అపోలో హాస్పిటల్స్ భాగస్వామ్యంతో అభివృద్ధి చేయబడింది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) మరియు ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW) మార్గదర్శకాల ఆధారంగా అభివృద్ధి చేయబడింది.

ఎయిర్టెల్ థాంక్స్ యాప్
 

ఎయిర్టెల్ థాంక్స్ యాప్

ఎయిర్టెల్ వినియోగదారులు ఎయిర్టెల్ థాంక్స్ యాప్ ద్వారా అపోలో 247 టూల్ ను యాక్సెస్ చేయవచ్చు. అలాగే ఎయిర్టెల్ కంపెనీ ప్రత్యేకమైన వెబ్‌సైట్‌ను కూడా ప్రారంభించింది. వినియోగదారులు వైరస్ కలిగి ఉన్నారో లేదో తనిఖీ చేయడానికి వీటిని యాక్సెస్ చేయవచ్చు.

అపోలో 247 టూల్ ను వాడటం ఎలా

అపోలో 247 టూల్ ను వాడటం ఎలా

మీకు కరోనావైరస్ వచ్చే ప్రమాదం ఉందో లేదో తెలుసుకోవడానికి ఎయిర్‌టెల్ యొక్క COVID-19 సింప్టమ్ చెకర్ టూల్ ను ఓపెన్ చేయండి. ఇక్కడ మీ వయస్సు, జెండర్, మీ శరీర ఉష్ణోగ్రత, మీ లక్షణాలు (దగ్గు, బలహీనత మరియు గొంతు మంట) వంటి వాటి గురించి మీకు చాలా ప్రశ్నలు కనబడతాయి. ఈ ప్రశ్నలకు సమాదానాలు ఇవ్వాలి. వీటితో పాటుగా మీరు కొంత ఛాతీ నొప్పి లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడటం వంటివి మరియు మీ ప్రయాణ సమయాలలో ఎదుర్కొన్న సమస్యలు మరియు ఇప్పటికే ఉన్న ఏదైనా వైద్య పరిస్థితిని వంటి సమాచారం కూడా ఇవ్వాలి.

సింప్టమ్ చెకర్ టూల్

సింప్టమ్ చెకర్ టూల్

అపోలో 247 టూల్ మీ సమాధానాల ఆధారంగా మీ ప్రమాద స్థాయిని లెక్కిస్తుంది. మీకు వైరస్ వచ్చే ప్రమాదం ఉంటే మాత్రమే ఈ టూల్ ని లెక్కించడానికి ఉపయోగించండి. మీరు సింప్టమ్ చెకర్ టూల్ లో పేర్కొన్న ఏవైనా లక్షణాలను ప్రదర్శిస్తుంటే మీరు వెంటనే వైద్యుడిని సందర్శించాలి.

Best Mobiles in India

English summary
Airtel launches COVID-19 symptom checker tool

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X