Home
News

రూ.999లోపు అదిరిపోయే జియో, ఎయిర్‌టెల్, Vi రీఛార్జ్ ప్లాన్స్.. వాటి బెనిఫిట్స్ ఇవే!

Best Recharge Plans April 2025: ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా? బడ్జెట్ రూ.999 లోపేనా? 2024, జులైలో ధరలు పెరిగినా, కంగారు పడకండి. జియో, ఎయిర్‌టెల్, విఐ (వొడాఫోన్ ఐడియా) ఇప్పటికీ రూ.999 లోపు కొన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ అందిస్తున్నాయి. ఈ ప్లాన్స్‌లో అపరిమిత కాల్స్, రోజువారీ డేటా, SMSలతో పాటు ఇతర డిజిటల్ ప్రయోజనాలూ ఉన్నాయి. ఈ ఏప్రిల్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ ఆప్షన్ల గురించి తెలుసుకుందాం.

* ఎయిర్‌టెల్ బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్ (రూ.999 లోపు)

ఎక్కువ వాడకం లేని వారికీ ఎయిర్‌టెల్ రూ.199 ప్లాన్ సరిపోతుంది. దీని వ్యాలిడిటీ 28 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, మొత్తం 2GB డేటా వస్తుంది. ఫ్రీ హలోట్యూన్స్, ఎక్స్‌స్ట్రీమ్ ప్లే యాక్సెస్ కూడా అదనం. కాస్త ఎక్కువ డేటా కావాలనుకుంటే, రూ.249 ప్లాన్ చూడండి.

Best Jio  Airtel  Vi Prepaid Plans Under Rs 999  April 2025  Top Recharge Offers with Data and Calls

BSNL తప్పిదం వల్ల ప్రభుత్వానికి రూ.1,757 కోట్ల నష్టం.. కాగ్ సంచలన నివేదిక!
28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, ఇతర ఎంటర్‌టైన్‌మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి. ఇంకాస్త ఎక్కువ డేటా రోజూ కావాలనుకునేవారికి రూ.299 ప్లాన్ ఉంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 1.5GB డేటా ఇస్తుంది. అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, ఫ్రీ హలోట్యూన్స్ వస్తాయి.

* ఎక్కువ కాలం వ్యాలిడిటీ కావాలంటే..

ఎయిర్‌టెల్ రూ.489 ప్యాక్ మంచి ఎంపిక. దీని వ్యాలిడిటీ 77 రోజులు. అన్‌లిమిటెడ్ కాల్స్, మొత్తం 600 SMSలు, 6GB డేటా వస్తుంది. దీనితో పాటు అపోలో 24/7 సర్కిల్, హెలోట్యూన్స్ లభిస్తాయి. రూ.548 ప్లాన్ 84 రోజుల పాటు పనిచేస్తుంది. 7GB డేటా, 900 SMSలు, అన్‌లిమిటెడ్ కాల్స్, హలోట్యూన్స్ అందిస్తుంది.

* విఐ (Vi) టాప్ రీఛార్జ్ ప్లాన్స్ (రూ.999 లోపు)

విఐ రూ.349 ప్లాన్‌తో 28 రోజుల పాటు అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 1.5GB డేటా, రోజుకు 100 SMSలు పొందవచ్చు. కాస్త ఎక్కువ వ్యాలిడిటీ కోరుకునే వారికి, రూ. 649 ప్లాన్ ఉంది. ఇది 56 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు అందిస్తుంది.

లాంగ్-టర్మ్ యూజర్ల కోసం విఐ రూ.979 ప్లాన్‌ను అందిస్తోంది. దీని వ్యాలిడిటీ 84 రోజులు. రోజుకు 2GB డేటా, రోజుకు 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ దీనితో వస్తాయి. ఈ ప్లాన్ల వివరాలు Vi అధికారిక వెబ్‌సైట్ ద్వారా గానీ ఫోన్ పే వంటి డిజిటల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్స్‌ చెక్ చేయవచ్చు.

* జియో టాప్ రీఛార్జ్ ప్లాన్స్ (రూ.999 లోపు)

జియో రూ.209 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీకి గాను రోజుకు 1GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు పొందవచ్చు. జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాక్సెస్ కూడా ఉంటుంది. రూ. 329 ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు (28 రోజుల వ్యాలిడిటీ) లభిస్తాయి.

జియోసావన్‌ ప్రో, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ కూడా వాడుకోవచ్చు. మీకు ఇంకా ఎక్కువ డేటా కావాలంటే, రూ.399 ప్లాన్ ఉంది. ఇది 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 2.5GB డేటా అందిస్తుంది. జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాక్సెస్ కూడా ఉంది. హై-స్పీడ్ 5G డేటా కావాలనుకునే వారికి.. రూ.449 ప్లాన్ 'ట్రూ 5G’ కింద వస్తుంది.

ఇందులో రోజుకు 3GB డేటా, అన్‌లిమిటెడ్ కాల్స్, రోజుకు 100 SMSలు, జియోటీవీ, జియోఏఐక్లౌడ్ యాక్సెస్ లభిస్తాయి. 5G ప్లాన్ కావాలంటే రూ.949 ప్యాక్ చూడొచ్చు. దీని వ్యాలిడిటీ 84 రోజులు, రోజుకు 2GB డేటా, 100 SMSలు, అన్‌లిమిటెడ్ కాలింగ్ వస్తాయి. జియోటీవీ, జియోక్లౌడ్, హాట్‌స్టార్ యాక్సెస్ (5G కేటగిరీ కింద) కూడా లభిస్తుంది.

Best Mobiles in India

English summary
Discover the best Jio, Airtel, and Vi recharge plans under Rs 999 in April 2025 with daily data, unlimited calls, and top 5G benefits.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X