అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను పొందేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకోండి...
ఇండియాలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్న సమయంలో ప్రజలు చాలా మంది కేవలం ఇంటి వద్ద నుండి మాత్రమే పనిచేస్తున్నారు. ఇటువంటి వారు ఇంటర్నెట్ కోసం అధికంగా మొబైల్ డేటాను మరియు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ను ఎంచుకుంటున్నారు.

బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్
ఈ మధ్య కాలంలో కొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ లు అధికం అయ్యాయి. వినియోగదారులు ఎంచుకోవడానికి చాలా రకాల బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు ఉన్నాయి. కానీ మీరు ఎంచుకోవడానికి మీ అవసరాలకు తగ్గట్టుగా బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్లను ఎంచుకోవడం ఉత్తమం.

అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌లు
అన్ని బ్రాడ్‌బ్యాండ్ సంస్థలు వినియోగదారుల కోసం రెండు రకాల బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను అందిస్తున్నాయి. వాటిలో ఒకటి స్థిర డేటా ప్లాన్ లు మరియు రెండవది అపరిమిత డేటా ప్లాన్ లు. స్థిర డేటా ప్లాన్ లు పరిమిత డేటాతో లభిస్తాయి. కానీ అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ లలో ఎటువంటి FUP పరిమితి లేకుండా అపరిమిత డేటాతో వస్తాయి. మీరు ఖర్చు చేస్తున్న మొత్తానికి ఉత్తమమైన అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి మీరు తప్పక తెలుసుకోవలసిన కొన్ని సూత్రాలను తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

అపరిమిత డేటా కోసం బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌లను ఎంచుకోవడానికి సూత్రాలు
ఉత్తమమైన అపరిమిత బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను పొందడానికి అర్థం చేసుకోవలసిన విషయాలు చాలా ఉన్నాయి. వాటిలో భాగమే మీరు ఎంచుకునే ఇంటర్నెట్ ప్లాన్. ఇందులో మూడు రకాల బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. వారిలో తక్కువగా డేటాను వినియోగించడం, మధ్యస్థంగా మరియు భారీగా ఇంటర్నెట్ ను వినియోగించే వినియోగదారులు. ఈ వినియోగదారులు మీరు ఎలా ఉన్నారు అన్నదానిని దృష్టిలో ఉంచుకొని డేటా ప్లాన్‌లను ఎంచుకోవచ్చు.

సరైన సర్వీస్ ప్రొవైడర్ ను ఎంచుకోవడం
అపరిమిత డేటా ప్లాన్‌లను ఎంచుకోవడానికి అన్నిటికంటే ముందుగా సరైన సర్వీస్ ప్రొవైడర్ ను ఎన్నుకోవడం చాలా అవసరం. బ్రాడ్‌బ్యాండ్ ఇంటర్నెట్ ప్లాన్ లను వేర్వేరు ధరల వద్ద వివిధ ప్రయోజనాలతో అందించే అనేక ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు ఉన్నాయి. కాబట్టి మీరు సరైన ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) ను ఎలా ఎంచుకోవడానికి అది మీ ప్రాంతంలో అది అందిస్తున్న గరిష్ట వేగం మరియు సరసమైన ధరల వివరాల ద్వారా కనుగొనవచ్చు.

తక్కువ డేటాను వినియోగించే యూజర్లు
మీరు తక్కువ మొత్తంలో డేటాను పొందే వ్యక్తి అయితే మీరు లైట్ యూజర్స్ కేటగిరీకి లోబడి ఉంటారు. ఇటువంటి వినియోగదారులు సాధారణంగా హై-స్పీడ్ డేటాను కోరుకోరు. అలాగే వారు సంగీతం మరియు సినిమాలను తక్కువ రెస్‌లో ప్రసారం చేయవచ్చు. ఇటువంటి వారికి తక్కువ ధరలో లభించే పరిమిత డేటా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు సరిగ్గా సరిపోతాయి.

ఇంటర్నెట్ మీడియం యూజర్లు
మీడియం యూజర్లు ప్రతిరోజూ హై-స్పీడ్ ఇంటర్నెట్ లేదా అధిక డేటా అవసరం లేనివారు. కాని ఇటువంటి వారికి రోజువారీ ప్రాతిపదికన నిర్వహించడానికి లిమిట్ ఇంటర్నెట్ అవసరం ఉంటుంది. మధ్యస్థ వినియోగదారులు సంగీతం లేదా చలనచిత్రాలను కొన్నిసార్లు అధిక నాణ్యతతో కూడా ప్రసారం చేయడం జరుగుతుంది. ఇటువంటి వారి కోసం తక్కువ ధరలో లభించే అపరిమిత డేటా బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లను ఉపయోగించవచ్చు.

ఇంటర్నెట్ హెవీ యూజర్లు
హెవీ యూజర్లు అంటే ప్రాథమికంగా ఇంటర్నెట్ యొక్క ఊపిరిని పీల్చుకునేవారు. ఒక్కమాటలో చెప్పాలంటే అధిక మొత్తంలో డేటాను వినియోగించేవారు. ఇటువంటి వారికి వారు చేయబోయే ప్రతి విషయానికి కూడా డేటా యొక్క అవసరం అధికంగా ఉంటుంది. ప్రస్తుతం చాలా మంది బ్రాడ్‌బ్యాండ్ నెట్‌వర్క్‌లలో అధికంగా అపరిమిత డేటా ప్లాన్ లను ఎంచుకుంటున్నారు. ఇందులో మరొక గొప్ప విషయం ఏమిటంటే దీని సాయంతో ఒక్క దానిలోనే ఎక్కువ మందిని కనెక్ట్ చేయడం వీలుగా ఉంటుంది. అలాంటప్పుడు ప్రతిరోజూ చాలా డేటా వినియోగించబడుతోంది. ప్రస్తుతం అన్ని సంస్థలు పరిమిత డేటా ప్లాన్లకు సమానంగా అపరిమిత ప్లాన్ లను కూడా అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications








