BSNL ఉత్తమమైన 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లు!!! 3GB డైలీ డేటా ప్రయోజనాలు..
టెలికామ్ రంగంలో ప్రభుత్వ అద్వర్యంలో పనిచేస్తున్న ఏకైక సంస్థ బిఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం తన వినియోగదారులకు 4G సేవలను అందించడం ప్రారంభించింది. ఇందులో భాగంగా ప్రైవేట్ టెల్కోలకు పోటీగా అద్బుతమైన 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లను అందిస్తోంది. బిఎస్‌ఎన్‌ఎల్ తన 4G సేవలను దేశంలోని అన్ని టెలికాం సర్కిల్‌కు ఇంకా విస్తరించలేదు. కానీ 4G సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలలోని వినియోగదారులు మాత్రం అందుబాటులో ఉన్న 4G ప్లాన్‌ల ప్రయోజనం పొందవచ్చు. BSNL సంస్థ అందిస్తున్న ఉత్తమమైన 4G ప్రీపెయిడ్ ప్లాన్‌ల జాబితా గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

BSNLరూ.997 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
దీర్ఘకాలిక వాలిడిటీతో పాటుగా అద్భుతమైన డేటా మరియు వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో కూడిన ప్లాన్ కోసం చూస్తున్నట్లు అయితే ఈ ప్లాన్ సరిగ్గా సరిపోతుంది. రూ.997 ధర వద్ద లభిస్తున్న ఈ బిఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ మీకు ప్రతిరోజూ 3GB డేటాతో పాటు 250 నిమిషాల ఉచిత కాలింగ్ ప్రయోజనాలు మరియు రోజుకు 100SMS ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ బిఎస్ఎన్ఎల్ యొక్క 4G ప్రీపెయిడ్ ప్లాన్ల జాబితాలో ఉత్తమమైనదిగా ఉండటానికి కారణం ఇది 180 రోజుల చెల్లుబాటుతో వస్తుంది.

BSNLరూ.1999 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
బిఎస్‌ఎన్‌ఎల్ యొక్క బెస్ట్ 4G ప్రీపెయిడ్ ప్లాన్ల జాబితాలో తరువాత స్థానంలో ఉన్నది రూ.1999 ప్లాన్. ఈ ప్లాన్ వినియోగదారులకు రోజువారీ 3GB డేటా, 250 FUP నిమిషాల కాలింగ్ మరియు రోజుకు 100 SMS ల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే రెండు నెలల EROS NOW చందా, Lokdhum కంటెంట్ మరియు ఉచిత కాలర్ ట్యూన్ ప్రయోజనాలను అదనంగా అందిస్తుంది. ఈ ప్లాన్ 365 రోజుల చెల్లుబాటుతో లభిస్తుంది.

BSNL STV 599 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
BSNL యొక్క STV 599 ప్రీపెయిడ్ ప్లాన్ రోజువారీ డేటా పరంగా కస్టమర్‌లకు అందించే ఉత్తమమైన 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఒకటి. ఇది రోజువారి 5GB డేటాతో పాటు 250 నిమిషాల ఉచిత కాలింగ్ ప్రయోజనాలను అందిస్తుంది. అలాగే కస్టమర్లు రోజుకు 100SMS లను కూడా అదనంగా పొందుతారు. ఈ ప్లాన్ యొక్క గొప్పదనం ఏమిటంటే ఇది 90 రోజుల చెల్లుబాటుతో రావడం.

బిఎస్ఎన్ఎల్ రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
బిఎస్ఎన్ఎల్ నుండి వస్తున్న రూ.365 ప్రీపెయిడ్ ప్లాన్ 60 రోజుల చెల్లుబాటుతో అద్బుతమైన ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ తక్కువ ధర వద్ద చాలా చౌకగా లభిస్తుంది. ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటాను అందిస్తుంది. రోజువారీ డేటాతో పాటు రోజుకు 250 నిమిషాల FUP అపరిమిత కాలింగ్ మరియు రోజుకు100 SMS ల ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ అందిస్తున్న ఇతర ప్రయోజనాల విషయానికి వస్తే లోక్‌ధమ్ కంటెంట్ మరియు ఉచిత కాలర్ ట్యూన్ ప్రయోజనాలను ఉచితంగా అందిస్తుంది.

బిఎస్ఎన్ఎల్ STV 187 ప్రీపెయిడ్ ప్లాన్ వివరాలు
బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రూ.187 STV ప్లాన్ తక్కువ ధరలో తక్కువ చెల్లుబాటుతో లభించే 4G ప్రీపెయిడ్ ప్లాన్‌లలో ఉత్తమమైనది. కేవలం 28 రోజుల చెల్లుబాటుతో లభిస్తున్న ఈ ప్లాన్ 2GB రోజువారీ డేటా అందిస్తుంది. దీనితో పాటుగా రోజుకు 250 నిమిషాల FUP ఫోన్ కాల్స్ మరియు రోజుకు 100 SMS వంటి గొప్ప ప్రయోజనాలను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








