Home
News

BSNL అందిస్తున్న అధిక డేటా ప్రీపెయిడ్ డేటా STVs వోచర్‌లు

టెలికాం ఆపరేటర్లలో ప్రస్తుతం ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో సంస్థ భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) మాత్రమే తన ప్రీపెయిడ్ చందాదారులకు దీర్ఘకాలిక డేటా-ఓన్లీ ప్లాన్ లను అందిస్తున్నది. అన్ని ప్రైవేట్ టెల్కోలు తమ వినియోగదారులకు లాంగ్ వాలిడిటీ డేటా ప్లాన్‌లను అందించడం మానేశాయి.

డేటా వోచర్ ప్లాన్ లు

డేటా వోచర్ ప్లాన్ లు

రిలయన్స్ జియోలో రూ.251 4G డేటా వోచర్ రోజుకు 2GB డేటను 51 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ విస్తృత శ్రేణి డేటా వోచర్లను కలిగి ఉండి అవి 365 రోజులపాటు యాక్సిస్ ను అందిస్తున్నాయి. వన్డే వాలిడిటీతో రూ.16 బేసిక్ డేటా వోచర్ నుండి 365 రోజుల చెల్లుబాటుతో రూ.1,498 ధర వరకు చాలా రకాల ప్లాన్ లు ఉన్నాయి. డేటా ప్రయోజనంలో రోజుకు 5GB డేటాను 551 రూపాయల ధర వద్ద 90 రోజుల యాక్సిస్ ను కూడా అందిస్తుంది.

BSNL నెట్‌వర్క్‌

బిఎస్ఎన్ఎల్ వెబ్‌సైట్ నుండి తీసుకున్న డేటా వోచర్లు వాటిలో కొన్ని పరిమిత లభ్యత మరియు సంస్థ నిర్వహిస్తున్న ప్రచార ఆఫర్‌ల కారణంగా ఎంచుకున్న సర్కిల్‌లలో అందుబాటులో ఉండకపోవచ్చు. ప్రస్తుతం BSNL నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న డేటా వోచర్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

రూ.100 లోపు గల బిఎస్‌ఎన్‌ఎల్ డేటా వోచర్లు

రూ.100 లోపు గల బిఎస్‌ఎన్‌ఎల్ డేటా వోచర్లు

బిఎస్‌ఎన్‌ఎల్‌లో ప్రస్తుతం రూ.100 లోపు చాలా డేటా వోచర్‌లు ఉన్నాయి. ఇందులో రూ.16 ధర గల డేటా వోచర్‌ ప్రీపెయిడ్ యూజర్లకు 2GB డేటాను వన్డే వాలిడిటీతో అందిస్తుంది. రూ.16 వోచర్‌ను అనుసరించి ఐదు రోజుల చెల్లుబాటు కాలానికి 3GB డేటాను అందించే రూ.39 డేటా ప్యాక్ కూడా ఉంది. తరువాత రూ.48 ప్లాన్ వినియోగదారులకు 5 జిబి డేటాను 30 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. బిఎస్‌ఎన్‌ఎల్‌కు చెందిన రూ.56 డేటా వోచర్ 14 రోజులకు రోజుకు 1.5 జిబి డేటాను అందిస్తుంది.

డేటా సునామి ప్యాక్

డేటా సునామి ప్యాక్

ప్రభుత్వ-టెల్కోలో గల రూ.96 డేటా వోచర్ 30 రోజుల మొత్తం చెల్లుబాటు కాలానికి 11GB డేటాను అందిస్తుంది. అలాగే రూ.98 ధర గల పాపులర్ డేటా సునామి ప్యాక్ రోజుకు 2 జిబి డేటా బెనిఫిట్ తో పాటుగా ఈరోస్ నౌ చందాను 22 రోజుల వాలిడిటీ కాలానికి అందిస్తుంది. కొన్ని రోజుల క్రితం రూ .98 డేటా STV లో మార్పులను చేసారు. కొన్ని సర్కిల్ లలో ఈ ప్లాన్ యొక్క వాలిడిటీను 24 రోజుల నుండి 22 రోజులకు తగ్గించింది.

రూ .300 లోపు బిఎస్‌ఎన్‌ఎల్ డేటా వోచర్లు

రూ .300 లోపు బిఎస్‌ఎన్‌ఎల్ డేటా వోచర్లు

రూ.158 ధర గల బిఎస్ఎన్ఎల్ డేటా వోచర్ ప్లాన్ 30 రోజుల క్యాలెండర్ డేస్ వాలిడిటీతో 20 జిబి డేటాను అందిస్తోంది. అలాగే ప్రముఖ డేటా రూ.198 STV రోజువారీ 2GB డేటా ప్రయోజనంతో 56 రోజుల వాలిడిటీతో అందిస్తోంది. ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ సర్కిల్‌లో రూ.228 మరియు రూ .268 ధరతో కొన్ని సర్కిల్-నిర్దిష్ట ప్రణాళికలు అందుబాటులో ఉన్నాయి. ఈ ప్లాన్ లు రీఛార్జ్ చేసిన తేదీ నుండి 40GB డేటా ప్రయోజనంను 30 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తాయి.

రూ.500 పైన గల బిఎస్ఎన్ఎల్ డేటా వోచర్లు

రూ.500 పైన గల బిఎస్ఎన్ఎల్ డేటా వోచర్లు

బిఎస్‌ఎన్‌ఎల్‌ సంస్థ అందిస్తున్న 551 రూపాయల ప్రముఖ డేటా STV వినియోగదారులకు రోజుకు 5GB డేటా ప్రయోజనంను 90 రోజుల చెల్లుబాటు కాలానికి అందిస్తుంది. ప్రస్తుతం రూ.551 STV ప్లాన్ ఎంచుకున్న సర్కిల్‌లలో మాత్రమే లభిస్తుంది. రూ.551 ప్లాన్ వ్యక్తిగతీకరించిన రింగ్‌బ్యాక్ టోన్ (పిఆర్‌బిటి) టోన్ ప్రయోజనాన్ని కూడా అందిస్తుంది. చివరగా బిఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లో రూ .998 మరియు రూ .1,498 ధర గల మరో రెండు లాంగ్-వాలిడిటీ డేటా వోచర్‌లు ఉన్నాయి. రోజుకు 2 జీబీ డేటాతో రూ .998 డేటా వోచర్ షిప్ అయితే, రూ .1,498 ప్లాన్ 91 రోజుల ఫిక్స్‌డ్ డేటా బెనిఫిట్‌తో వస్తుంది. ఈ ప్లాన్ లు వరుసగా 240 మరియు 365 క్యాలెండర్ రోజుల చెల్లుబాటు కాలానికి లభిస్తాయి.

More from GizBot

Best Mobiles in India

English summary
BSNL Prepaid Data STV Available Plans Details
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X