BSNL యూజర్లకు బ్యాడ్ న్యూస్!!! వాయిస్ కాల్స్,SMS లపై "రేషనలైజేషన్" పరిమితి...

|

ప్రభుత్వ ఆద్వర్యంలో గల టెల్కో సంస్థ బిఎస్ఎన్ఎల్ ఇప్పుడు తన వినియోగదారుల కోసం కొత్త కొత్త ప్లాన్లను విడుదల చేస్తోంది. 4G సర్వీసులను ఇండియా అంతటా విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.

BSNL

ఇప్పుడు చెన్నై GSM ప్రీపెయిడ్ మొబైల్ సేవలను మరింత మెరుగుపరచడానికి మరియు వినియోగదారులను మరింత ఆకట్టుకోవడానికి 2020 మే 12 నుండి ‘అపరిమిత వాయిస్ ఫ్రీబీస్' మరియు రోజుకు 100SMS ప్రయోజనాల మీద కొత్తగా "రేషనలైజేషన్" ను ప్రకటించింది. దీని ఫలితంగా చెన్నై మరియు తమిళనాడు సర్కిల్‌లలోని వినియోయోగదారులు వారి ఎఫ్‌యుపి పరిమితిని చేరుకున్న తర్వాత వసూలు చేయబడతాయి. వీటి మీద స్టాండర్డ్ సుంకం రేట్లలో ఛార్జీలు వర్తించబడతాయి.

వాయిస్ కాల్స్‌

వాయిస్ కాల్స్‌

లాక్‌డౌన్ సమయంలో వాయిస్ కాల్స్‌లో ఎక్కువగా మాట్లాడే వినియోగదారులకు BSNL నుండి వచ్చిన ఈ చర్య ప్రయోజనకరంగా లేదు. మిగతా అన్ని టెల్కోలు తమ కాలింగ్ సదుపాయాలను అపరిమితంగా ఉంచాయి. ఒక జియో సంస్థ మరియు బిఎస్ఎన్ఎల్ మాత్రమే FUP పరిమితిని పాటిస్తున్నాయి. వోడాఫోన్ మరియు ఎయిర్టెల్ మాత్రం తన వినియోగదారులకు అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాన్ని అందిస్తున్నాయి.

రేషనలైజేషన్ యొక్క ‘అపరిమిత వాయిస్ ఫ్రీబీస్’

రేషనలైజేషన్ యొక్క ‘అపరిమిత వాయిస్ ఫ్రీబీస్’

BSNL లో ఇంతకు ముందు మీరు రీఛార్జ్ చేసినప్పుడు అపరిమిత వాయిస్ కాలింగ్ అందించేది. దీనితో మీరు రోజంతా కాల్స్‌లో మాట్లాడవచ్చు దీని కోసం మీరు అదనపు ఛార్జీలు చెల్లించవలసిన అవసరం ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది మారిపోయింది. టెల్కో 250 నిమిషాల FUP పరిమితిని పెట్టింది. అంటే మీరు 250 నిమిషాలు ఉపయోగించిన తర్వాత మీ బేస్ ప్లాన్ సుంకం వద్ద మీకు ఛార్జీ విధించబడుతుంది. ఆ రోజులో అర్ధరాత్రి 12 గంటలు దాటిన తరువాత మీకు మళ్ళీ 250 నిమిషాల వాయిస్ కాల్స్ లభిస్తాయి.

అంతర్జాతీయ కాల్స్ రేషనలైజేషన్

అంతర్జాతీయ కాల్స్ రేషనలైజేషన్

ప్రీమియం నంబర్లు అంతర్జాతీయ కాల్స్ లేదా IN నంబర్లకు కాల్ చేయడానికి ఈ వోచర్ కింద ఉన్న వాయిస్ ప్రయోజనాలు ఏవీ ఉపయోగించబడవు. ఒకవేళ మీరు అంతర్జాతీయ కాల్స్ చేస్తే కనుక ఛార్జీలు వర్తించబడతాయి. ఒకవేళ మీరు ఏదైనా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించినట్లయితే మీ సేవలను నిలిపివేసే హక్కు BSNL కి ఉంది. మీ ప్రణాళిక గడువు ముగిసే సమయానికి ఉపయోగించని ప్రయోజనాలన్నీ జప్తు చేయబడతాయి.

రేషనలైజేషన్ యొక్క  రోజుకు 100 SMSలు

రేషనలైజేషన్ యొక్క రోజుకు 100 SMSలు

బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు ఇప్పుడు ఒక రోజులో గరిష్టంగా 100 SMS లను మాత్రమే ఉచితంగా పంపవచ్చు. ఒకవేళ మీరు 100SMS ల కంటే ఎక్కువ పంపితే కనుక ఛార్జీలు వర్తిస్తాయి. IN నంబర్, అంతర్జాతీయ నంబర్ మరియు ప్రీమియం నంబర్‌లకు SMSలను పంపడానికి ఈ SMS ప్రయోజనాలు ఏవీ ఉపయోగించబడవు. మీరు అలా చేస్తే కనుక అదనపు ఛార్జీలు వర్తిస్తాయి.

BSNL రోజుకు 100 SMSలు

BSNL రోజుకు 100 SMSలు

BSNL అందించే ఈ వోచర్ వ్యక్తిగత ఉపయోగం కోసం మాత్రమే ఉద్దేశించబడింది. మీరు ఏదైనా మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడితే ఎప్పుడైనా సేవను నిలిపివేయడానికి BSNL కి అన్ని హక్కులు ఉన్నాయి. మీ ప్రణాళిక గడువు ముగిసే సమయానికి ఉపయోగించని ప్రయోజనాలన్నీ జప్తు చేయబడతాయి.

బిఎస్‌ఎన్‌ఎల్ 4G సిమ్ అప్‌గ్రేడ్ స్కీమ్

బిఎస్‌ఎన్‌ఎల్ 4G సిమ్ అప్‌గ్రేడ్ స్కీమ్

బిఎస్ఎన్ఎల్ 4G సిమ్ అప్‌గ్రేడ్ స్కీమ్ యొక్క ఆఫర్ ను కేవలం పరిమిత కాలానికి మాత్రమే ఉంచింది. ప్రభుత్వ యాజమాన్యంలోని టెల్కో ఈ ఆఫర్ ను కేవలం 90 రోజుల వరకు మాత్రమే ఉంచింది. కాబట్టి మీలో ఎవరైనా బిఎస్‌ఎన్‌ఎల్ సిమ్ వాడుతూ ఉంటే కనుక దానిని ఎటువంటి ఖర్చు లేకుండా అప్‌గ్రేడ్ చేసుకోవడానికి ఇదే సరైన సమయం.

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు

బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్‌లలో మార్పులు

ప్రైవేట్ టెలికాం ఆపరేటర్లు 2019 డిసెంబర్‌లో ధరల పెరుగుదలను అమలులోకి తీసుకువచ్చారు. అందులో భాగంగా వారు సుంకాల ధరలను 40% వరకు పెంచారు. అయినప్పటికీ బిఎస్ఎన్ఎల్ టారిఫ్ ధరలను పెంచలేదు ఎందుకంటే దీనికి 3G సేవలు లేనందువలన ప్రీపెయిడ్ ప్లాన్ ల యొక్క ధరలను పెంచడానికి కూడా అర్ధమే లేదు. బిఎస్ఎన్ఎల్ సంస్థ ధరల పెరుగుదలను కేవలం మాటలకు మాత్రమే పరిమితం చేసింది కానీ ఇప్పుడు చివరకు అమలు చేసింది. ప్లాన్ ల యొక్క ధరలను సవరించడానికి బదులుగా ప్రస్తుత ప్లాన్ ల యొక్క డేటా ప్రయోజనం మరియు వాలిడిటీని బిఎస్ఎన్ఎల్ తగ్గించింది.

Best Mobiles in India

English summary
BSNL Announced Rationalisation on Unlimited Voice Calls and 100 SMS/Day

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X