BSNL కూడా కొత్త ఆఫర్‌తో వచ్చేసింది
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) టెలికం మార్కెట్లో ఇతర టెల్కోలతో పోటీపడేందుకు సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది.
ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్) టెలికం మార్కెట్లో ఇతర టెల్కోలతో పోటీపడేందుకు సరికొత్త ఆఫర్లను తీసుకొస్తోంది. ఇందులో భాగంగా పోస్టు పెయిడ్ వినియోగదారుల కోసం స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చింది. నెలకు కేవలం రూ.599తో అన్ని లోకల్, ఎస్టీడీ కాల్స్‌తోపాటు 6జీబీ డేటాను కూడా ఉచితంగా వినియోగించుకోవచ్చు.
జియోకి భారీ షాక్..ఎయిర్‌టెల్ రూ.7000 కోట్ల డీల్

నాలుగు నెలలపాటు ఈ ఆఫర్ వర్తిస్తుంది.అనంతరం ఇదే ఆఫర్ ఆ తర్వాత రూ.799 గా మారిపోతుంది. తరువాత ఉచిత కాల్స్‌తోపాటు 3 జీబీ డేటా వస్తుందని బీఎస్ఎన్ఎల్ అధికారులు తెలిపారు. మరోవైపు విదేశాల్లో వైఫై హాట్‌స్పాట్ సేవలు అందించేందుకు టాటా కమ్యూనికేషన్ గ్రూప్‌తో ఒప్పందం కుదుర్చుకుంది.
6జిబి ర్యామ్‌తో 28న దూసుకొస్తున్న హానర్ వీ9

ఈ ఒప్పందం ప్రకారం బీఎస్ఎన్ఎల్ అమెరికా, ఆస్ట్రేలియా, యూరప్, లండన్, చైనా, రష్యాల్లోని ప్రధాన నగరాల్లో హాట్‌స్పాట్‌లు ఏర్పాటు చేయనుంది. వీటి ద్వారా రూ.999కే వారం రోజులపాటు అన్‌లిమిటెడ్ డేటా, రూ.1599తో 15 రోజులు, రూ.1999తో నెల రోజులపాటు వైఫై హాట్‌స్పాట్ సేవలు పొందవచ్చు.
జియోకి కౌంటర్ అటాక్ ఇస్తున్న దిగ్గజాలు

కాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిళ్లలో నేడు(గురువారం) నిర్వహించే మెగా మేళాలో సిమ్‌కార్డులను ఉచితంగా పొందవచ్చని బీఎస్ఎన్ఎల్ ఓ ప్రకటనలో తెలిపింది. కస్టమర్ సర్వీస్ సెంటర్లతోపాటు బీఎస్ఎన్ఎల్ సిబ్బంది నిర్వహించే రోడ్‌షోలలో ఇవి అందుబాటులో ఉంటాయని పేర్కొంది.


Click it and Unblock the Notifications








