జియోకి భారీ షాక్..ఎయిర్‌టెల్ రూ.7000 కోట్ల డీల్

Written By:

జియో ఎఫెక్ట్ తో మార్కెట్లో ప్రకంపనలు రేకెత్తుతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా కంపెనీలు విలీనాలకు తెలేపాయి. ఈ మధ్యనే వొడాఫోన్, ఐడియా విలీనం వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు తాజాగా భారతీ ఎయిర్‌టెల్ రూ.7000 కోట్ల డీల్ ఓకే చేసింది. ఈ డీల్ ప్రకారం టెలినార్ భారతీ ఎయిర్‌టెల్‌లో విలీనమవుతుంది. తద్వారా ఎయిర్‌టెల్ అతి పెద్ద నెట్‌వర్క్ గా అవతరిస్తుంది.

మీరు వాడే నంబర్‌నే జియో ప్రైమ్‌లోకి మార్చుకోవడం ఎలా..?

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్‌లను

మార్కెట్ విస్తరణలో భాగంగా నార్వేకు చెందిన టెలినార్ కంపెనీ ఇండియా బిజినెస్‌లను టెలికాం దిగ్గజం ఎయిర్‍టెల్ కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయంపై భారతీ ఎయిర్‍టెల్ గురువారం ఫైనల్ ప్రకటన చేసింది.

ఓ నిర్ణయాత్మక ఒప్పందం

టెలినార్(ఇండియా) కమ్యూనికేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను కొనుగోలుచేసేందుకు తాము టెలినార్ సౌత్ ఆసియా ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో ఓ నిర్ణయాత్మక ఒప్పందంలోకి ప్రవేశించామని భారతీ ఎయిర్‌టెల్‌ తెలిపింది.

ఏడు సర్కిళ్లను కొనుగోలు

రెగ్యులేటరీ ఫైలింగ్‌లో టెలినార్ ఇండియాకు సంబంధించిన ఏడు సర్కిళ్లను కొనుగోలు చేస్తున్నట్టు పేర్కొంది. ఆంధ్రప్రదేశ్, బిహార్, మహారాష్ట్ర, గుజరాత్, యూపీ(ఈస్ట్), యూపీ(వెస్ట్), అస్సాంలు ఈ సర్కిళ్లలో ఉన్నాయి. ఎక్కువ జన సాంద్రత కలిగిన సర్కిళ్లను కొనుగోలుచేసి, రెవెన్యూలను భారీగా పెంచుకోవాలని ఎయిర్‌టెల్ భావిస్తోంది.

అగ్రిమెంట్ ప్రకారం

అగ్రిమెంట్ ప్రకారం ఎయిర్‌టెల్, టెలినార్ ఇండియా విలీనం అయిపోతే, టెలినార్ ఇండియా మొత్తం దాని ఆధీనంలోకి వచ్చేస్తోంది.

వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే

వొడాఫోన్-ఐడియా విలీనానికి ముందే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఎయిర్ టెల్ పూర్తిచేయాలనుకుంటోంది. సబ్‌స్క్రైబర్‌బేస్‌లో దూసుకెళ్తున్నాంటూ ప్రకటిస్తున్న జియోకూ ఇది షాకివ్వాలనుకుంటోంది.

అదనంగా 52.5 మిలియన్ యూజర్లను

టెలినార్ ఇండియాను తనలో విలీనం చేసుకోవడం వల్ల ఎయిర్‌టెల్ అదనంగా 52.5 మిలియన్ యూజర్లను పొందుతోంది. ప్రస్తుతం ఎయిర్ టెల్ కు 269.40 మిలియన్ సబ్‌స్రైబర్లు ఉన్నారు.

గిజ్‌బాట్ మరిన్ని అప్‌డేట్స్ ఇక్కడే

 

English summary
Bharti Airtel to buy Telenor's India operations in Rs 7,000-cr deal read more at gizbot telugu
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot